రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. ‘పులిని గాంచిన జంతువుల్ పుల్లగిల్లి’ అందాం. (పుల్లగిల్లు = భయపడు) * సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. గురువర్యులు నేమాని వారి వ్యాఖ్యను గమనించి సవరించినందుకు సంతోషం! * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ తేటగీతిక చాలా బాగుంది. పిల్లలకు పాఠ్యాంశంగా పెట్టవచ్చు. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
పులిని గాంచిన జంతువు లెల్ల జడిసి
రిప్లయితొలగించండిపరువు లిడుచుండె నటునిటు భయము జెంది
దిక్కు తోచని బాలుడు పిక్క టిల్ల
యరచె భీతిగ నాయన పులి యటంచు
లేనిది వచ్చెనని బలుక
రిప్లయితొలగించండినానైనను నమ్మలేదు నందనునైనన్
రానే వచ్చెను యా పులి
తానే పులి వాత బడెను తనయుడు బలియై!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
వచ్చెను + ఆ పులి = అనుచోట యడాగమము రాదు. వచ్చిన దాపులి అందామా?
స్వస్తి.
గురుదేవుల సవరణకు ధన్యవాదాలు. సవరించిన పద్యం:
రిప్లయితొలగించండిలేనిది వచ్చెనని బలుక
నానైనను నమ్మలేదు నందనునైనన్
రానే వచ్చిన దాపులి
తానే పులి వాతబడెను తనయుడు బలియై!
పులి వచ్చెను నాన్నా!యని
రిప్లయితొలగించండిపలుమాఱులు పిలిచిజేసె పరిహాసమునన్
పులితా వచ్చిన భయపడి
పిలువగ నపహాస్యమనుచు పితరుడు భ్రమసెన్
నిజమునుఁ బలుకక పరిపరి
రిప్లయితొలగించండిప్రజలను మూర్ఖులనుఁ జేసి పరిహాసంబుల్
నిజలాభముకొఱకు సలుపు
కుజనులు ఫలితమునుఁ బొంది క్రుంకుదురయ్యా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివ్యాఘ్రమును జూచి బాలుడు వ్యాకు లతను
రిప్లయితొలగించండిదరువు నెక్కియు పిలిచెను దండ్రి నపుడు
వాని పలుకులు వినియును రాని కతన
పులికి నాహార మయ్యెను సులువు గాను
బాలకుని నావులన్ గాయ పంపుచు తన
రిప్లయితొలగించండిపుత్రునకు స్పష్టముగ జెప్పె పులులు వచ్చి
నపుడు పెద్దగా పులిపులి యనుచు కేక
బెట్టమని తండ్రి, పరికించ పిల్ల వాడు
పులిపులి యనుచు నరవగా పురములోని
జనులు వచ్చిరి రయమున సాయపడగ
పులిని కానక జనులెల్ల పోయి రపుడు
నిజముగా పులి యేతెంచి నిర్భయముగ
పసుల వేటాడి తినుచుండ బాలు డపుడు
మరల పిలిచె సహాయమ్ము కొరకు, కాని
జనులెవరు రాక పోయిర సత్యమనుచు
సత్య వాక్యముల్ పల్కుడు సంతతంబు
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. ‘పులిని గాంచిన జంతువుల్ పుల్లగిల్లి’ అందాం. (పుల్లగిల్లు = భయపడు)
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువర్యులు నేమాని వారి వ్యాఖ్యను గమనించి సవరించినందుకు సంతోషం!
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ తేటగీతిక చాలా బాగుంది. పిల్లలకు పాఠ్యాంశంగా పెట్టవచ్చు. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కల్లలు జెప్పుచు కన్నా !
రిప్లయితొలగించండిపిల్లలు పరిహాసమాడ పీడలుగలుగున్
ఇల్లిదె వినుమా మానెయ్
కల్లలు, నాన్నా పులియను కథనే గనుమా !
నాన్నా పులియన, రాగా
నాన్నకు పులిలేదనుచును నగుచును జెప్పెన్
నాన్నా పులి యన మరలా
నాన్నే రాలేదు గాని నమిలెను పులియే.