11, మే 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1409 (పండు మంచిది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పండు మంచిది తినఁ బనికి రాదు.
ఈ సమస్యను సూచించిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

 1. మేడి చెట్టు కువర మేమొహరి యొసంగె
  నార సిం హుని యవ తార మందు
  పున్నె మనగ నీడ మునివరుల కటంచు
  పండు మంచిది తిన బనికి రాదు

  రిప్లయితొలగించు
 2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 3. (విభూతి పండు అంటాము కదా)
  సకల దోషహరము సౌభాగ్యదమ్మును
  శివ కృపా విశేష సిద్ధిదమును
  నతి పవిత్రమైన దదె చూడుడీ బూది
  పండు మంచిది తిన బనికి రాదు

  రిప్లయితొలగించు
 4. షుగరు వ్యాధితోడ స్రుక్కెడు రోగి కే
  పండు మంచిది ? తిన బనికిరాదు
  గద మధుర ఫలమ్ము ! కాకర రసమును
  ప్రతిదినమును ద్రాగవలె నతండు

  రిప్లయితొలగించు
 5. వెఱ్ఱిపుచ్చపండు వెఱ్ఱిని గలిగించు
  తెలియక తినినంత దెలిసికొనుడు
  పుచ్చపండు వోలె పొడసూపు నెట్టు లా
  పండు మంచిది ? తిన బనికిరాదు

  రిప్లయితొలగించు
 6. ఔషధముల గల్గు నౌదుంబర మనెడు
  పండు మంచిది తిన ; బనికిరాదు
  చిత్రమూలము వలె చింతాకు శూలకు
  కఫమును హరియించు కరకకాయ

  రిప్లయితొలగించు
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 8. పిచ్చి దొండ కాయ వేడ్కతో కన వచ్చు
  పండు మంచిది తిన పనికిరాదు
  వెఱ్ఱి నాయకులను వేడ్కతో వినవచ్చు
  పాలనమ్మునకును పనికిరారు

  రిప్లయితొలగించు

 9. మాగబెట్టుచు నుందురు మామిడులను
  ' పండబెట్టగ ' మందులు బరగ వేసి
  హంగు గానుండు చూడగ రంగుతోను
  పండు మంచిది, తినఁ బనికి రాదు.

  రిప్లయితొలగించు
 10. మేలి రంగు తోడ మేలిమి గల మేడి
  పండు మంచిది తిన బనికి రాదు
  పొట్ట విచ్చి చూడ పురుగు లుం డునుమఱి
  పండు నైజ మదియ పవన పుత్ర !

  రిప్లయితొలగించు
 11. మేడి పండు రంగు మేలిమి వర్ణమై
  చూడ ముచ్చటగును చూపరులకు
  కీటకమ్ములందు క్రిక్కిఱిసి వసించు
  పండు మంచిది తినఁ బనికి రాదు.

  రిప్లయితొలగించు
 12. లెక్క లేని పండ్లు లక్కపందిరినుండు
  నరటి ద్రాక్షలందు నమరియుండు
  నందమైనదైన నాడుటకే గాని
  పండు మంచిది తినఁ బనికి రాదు.

  రిప్లయితొలగించు
 13. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3 పాదములు తేటగీతి + 1 పాదము ఆటవెలది
  చాలా హాయిగా నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించు
 14. వేపచెట్టు వలన వేయౌను లాభాలు
  ఆకు బెరడు గింజలన్ని ఇచ్చు
  ఔషధములగుణము ఆరోగ్య హేతువా
  పండు మంచిది తిన బనికి రాదు

  మల్లెల సోమనాధశాస్త్రి గారి పూరణ

  రిప్లయితొలగించు
 15. మనిషి రోగి కాక మనుగడ సాగింప
  పండు మంచిది; తిన బనికి రాదు,
  కలుష తైలములను కల్మష భరితమౌ
  వీధులందు దొరకు వింత తిండి

  రిప్లయితొలగించు
 16. అన్నివేళలందు నారగించుటకును
  పండు మంచిది, తిన బనికిరాదు
  యడ్డమైన గడ్డి యంగళ్ళలోనుండి
  చేటు దెచ్చుననుట చేదు నిజము


  రిప్లయితొలగించు
 17. పండు చూడ పైన బాగుండు లోపల
  నుండు సూక్ష్మ క్రిములు నిండుగాను
  పండు మెండుగాను పలు చోట్ల నీ మేడి
  పండు పంచిది తినగ పనికి రాదు

  రిప్లయితొలగించు
 18. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, కవిపండితమిత్రు లందఱికిని యంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలతో...

  లక్కబొమ్మలందు నొక్క మామిడిపండు
  బొమ్మఁ గాంచి యొక్కఁ డిమ్ముగఁ గొనె!
  దీని నతని సుతుఁడుఁ దినఁ బోవ, ననెఁ దండ్రి
  "బండు మంచిది; తినఁ బనికి రాదు!"

  Note: పూజ్యులు నేమానివారూ, మీకు అస్వస్థతగ నున్నదని ఈ బ్లాగులోఁ జదివియుంటిని. ప్రస్తుతము మీ కెట్లున్నది? తమకు శీఘ్రముగ స్వస్థత చేకూరవలెనని యా భగవంతుని మనస్ఫూర్తిగఁ గోరుకొనుచున్నాను. స్వస్తి.

  రిప్లయితొలగించు
 19. శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
  మీరు ప్రేమతో నా గురించి స్పందించినదులకు చాలా సంతోషము. ప్రస్తుతము నాకు కొంచెము కొంచెము arthritis నుండి ఉపశమనము లభించుచున్నది. నొప్పి ఉన్నది గాని నిరంతరము బాధించుట లేదు. డాక్టరు చి. గన్నవరపు నరసింహమూర్తి గారు కూడా నా గురించి శ్రద్ధ తీసికొని సలహాలు ఇచ్చుచున్నారు. మీకు మరియు మన మిత్రులందరికి మరొక మారు మా దీవెనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించు
 20. ఒంటరి తానున్న నంటునె సత్కీర్తి
  సంఘమున మెదల సకల సిద్ధి
  వాడి మిరపగలయ వంటలో సొగయించు
  పండు మంచిది తినఁ బనికి రాదు.

  రిప్లయితొలగించు
 21. వెండి కొండపైన వెలిసిన వేల్పుని
  నిండు మనసుతోడ దండిగాను
  వేడ పుత్రికనిడె, పిలిచిరి పండని
  పండు మంచిది తిన బనికి రాదు !!!

  రిప్లయితొలగించు
 22. గురువర్యులకు వందనములు. మీరు Frozen Shoulder తో బాధపడుచున్నట్టు నా కనిపించుచున్నది. సుబ్బారావు గారు చెప్పినట్లు physiotherapy exercises మరియు ultrasound therapy తో తొందరగా నయమయ్యే అవకాశాలు ఎక్కువ. గమనించగలరు.

  రిప్లయితొలగించు
 23. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్నటినుండి జ్వరం. పూర్తిగా నీరసంగా ఉంది. అందువల్ల మీ పూరణలపై వెంట వెంట స్పందించలేకపోయాను. మన్నించండి.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  నృసింహావతారంలో విష్ణువు మేడిచెట్టుకు వరమిచ్చిన కథ నాకైతే తెలియదు.
  మొత్తానికి మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మేడిచెట్టు కువరము’ నన్ను కొంచెంసేపు తికమక పెట్టింది... ‘రామునితోక పివరుండు..’ లాగా!
  *
  పండిత నేమాని వారూ,
  విభూతిపండుపై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  మిత్రుల పూరణను సమీక్షించినందుకు ధన్యవాదాలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ భావంతో పూరణ చేశారు. అభినందనలు.
  నేమాని వారు చెప్పినట్లు మొదటి మూడు పాదాలను తేటగీతిలో వ్రాశారు. నా సవరణలతో మీ పద్యం.....
  మాగబెట్టుచుంద్రు మామిడికాయలన్
  ' పండబెట్ట ' మందు బరగ వేసి
  హంగు చూడగాను రంగుతో మెరిసెడి
  పండు మంచిది, తినఁ బనికి రాదు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘గుణము + ఆరోగ్య’ అని విసంధిగా వ్రాశారు. ‘గుణము లారోగ్య..’ అనండి.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  బహుకాల దర్శనం. సంతోషం!
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటి రెండు పాదాలలో గణభంగం. నా సవరణ....
  ఒంటరిగ మసలిన నంటునె సత్కీర్తి
  సంఘమందు మెదల సకల సిద్ధి
  వాడి మిరప గలయ వంటలో సొగసైన
  పండు మంచిది తినఁ బనికి రాదు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 24. శ్రీ నేమానివారికి ధన్యవాదములు...పొరబాటుకు క్షంతవ్యుడను..కూడనిదైనను చ్వరి పాదమును ఈ విధముగా మార్చుచున్నాను.  మాగబెట్టుచు నుందురు మామిడులను
  ' పండబెట్టగ ' మందులు బరగ వేసి
  హంగు గానుండు చూడగ రంగుతోను
  పండు మంచిది, తినుటకు పనికి రాదు.

  రిప్లయితొలగించు
 25. శ్రీ శంకరార్యులకు నమస్కారములు..మీ అరోగ్యము త్వరగా కుదుట బడవలెనని ఆకాంక్షించుచున్నాను.
  నేను సవరణ చేయు సమయములోనే మీరు నా పూరణకు చక్కని సవరణ జేసినందులకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించు
 26. గురువులకు నమస్కారములు
  నరసిం హావతారంలో రాక్షస సమ్హారం జరిగి నప్పుడు విష్ణుమూర్తి చేతులకు అంటుకున్న రక్తం వలన చేతులు బాగా మండుతుంటే లక్ష్మీ దేవి ఉదుంబర వృక్షం యొక్క ఆకులతో ఆ చేతులు తుడిచిందట .అందుకని ఆ చెట్టుకి నీనీడన కూర్చున్న వారికి , తపస్సు చేసిన వారికి పుణ్య ఫలితము లభించును అని వరమిచ్చాడట .నేను చాగంటి వారి ప్రవచ నాలలో విన్నట్టు గుర్తు
  ఇక రాముని తోక మనకి మామూలే కదా 1 అదన్నమాట అసల్ సంగతి

  రిప్లయితొలగించు
 27. దేవిఁ గొలుచునట్టి దినముల దశహర
  రాత్రులందు జనులు రమ్యమైన
  ఫలములెన్నొ చేయు వ్రతమునందున చేయు
  పండు మంచిది; తినఁ బనికి రాదు.

  రిప్లయితొలగించు