ఫుజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. నాకు 21.05.2014, స్టార్ హోస్పటల్ లో బై పాస్ సర్జెరి జరుగుతుంది. రేపు అడ్మిట్ అగుచున్నాను. గత మూడు నెలలుగా తోటి కవిమిత్రులతో పాలుపంచు కుంటూ కాలము చక్కగా గడిచి పోయింది. కొన్ని రోజులు బ్లాగుకు దూరంగా వుండాలంటే బాధగా ఉంది.
కవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ శస్త్రచికిత్స విషయం తెలిసి సంభ్రాంతికి గురయ్యాను. మీరు సంపూర్ణారోగ్యంతో తిరిగివచ్చి బ్లాగును మీ పద్యాలతో భూషింపజేయాలని, ఆ విధంగా భగవత్కృప మీపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆరోగ్య పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడు ఎవరైనా మిత్రుల ద్వారానో, మీ సంతానం ద్వారానో బ్లాగుకు సమాచారం అందించండి. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * జిలేబీ గారూ, ☺ * సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి వారి స్వాస్థ్యాన్ని కోరిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
కవిమిత్రులు శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిగారికి,ఆపరేషన్ విజయవంతంగా జరిగి, సంపూర్ణ ఆరోగ్యవంతులై మరల బ్లాగులో పద్య మధురిమలను పంచవలెనని కోరుకొనుచున్నాను.
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * కార్తిక్ భరద్వాజ్ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మిస్సన్న గారన్నట్టు మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నలువకు నాలగు ముఖములు
రిప్లయితొలగించండిపలుకుల గీర్వాణి కనగ బహుముఖ కళలన్
విలువగు రాగరసమ్ముల
నలుగురితో దిరుగు సాధ్వి నాయిల్లాలే
ఫుజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. నాకు 21.05.2014, స్టార్ హోస్పటల్ లో బై పాస్ సర్జెరి జరుగుతుంది. రేపు అడ్మిట్ అగుచున్నాను. గత మూడు నెలలుగా తోటి కవిమిత్రులతో పాలుపంచు కుంటూ కాలము చక్కగా గడిచి పోయింది. కొన్ని రోజులు బ్లాగుకు దూరంగా వుండాలంటే బాధగా ఉంది.
రిప్లయితొలగించండికవిమిత్రులు శ్రీ అన్నపరెడ్డి సత్య నారాయణ రెడ్డిగారికి ఆపరేషను విజయవంతమై ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నాను .
రిప్లయితొలగించండికలిమికి చెలిమికి యెడమై
పలురితుల బాధనొందు ప్రజలకు నిల
దుర్బలులకు చేయూత నిడుచు
నలుగురిలో దిరుగు సాద్వి నా యిల్లాలే !!!
పలుకుల రాణిగ వెలుగుచు
రిప్లయితొలగించండిపలు విద్యల నొసగు వాణి భక్తిని గొలువ
న్నలుగదనుచు నలువబలికె
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే.
అలుగని ధర్మజుడు బలికె
కలిగిన నాడైన కడకు కానల నైనన్
తలదాచెను మరుదులతో
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే.
రిప్లయితొలగించండిపొద్దెరగక కామెంట్ల లోకములో
చలాకీ అయి తిరుగు జిలేబి ని చూసి
అయ్యరు హుసూరు మని వాపోయే
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే!
జిలేబి
తలలో నాలుక వలెనే
రిప్లయితొలగించండివెలుగుల నాయింట నిలుపు వేకువ తానై
తలిదండ్రి సొదరుడు మా
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే!
రిప్లయితొలగించండికవిమిత్రులు శ్రీ అన్నపరెడ్డి సత్య నారాయణ రెడ్డిగారికి ఆపరేషను విజయవంతమై ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నాను .
పలు సత్కర్మల జేయుచు
రిప్లయితొలగించండివిలసిత ప్రేమానురాగ విమల చరిత్రన్
కలిగియు సద్భావముతో
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపలువురి హితమును గోరుచు
రిప్లయితొలగించండికలివిడిగా నుండునెపుడు కాంతలతోడన్
విలువగు విద్యలు నేర్పగ
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
కవిమిత్రులు శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిగారికి,విజయవంతంగా అపరేషన్ జరిగి,
రిప్లయితొలగించండిఆరోగ్యం కుదుటపడాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..
కవిమిత్రులు శ్రీ అన్నపరెడ్డి సత్య నారాయణ రెడ్డిగారికి ఆపరేషను విజయవంతమై ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తున్నాను.
రిప్లయితొలగించండికవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ శస్త్రచికిత్స విషయం తెలిసి సంభ్రాంతికి గురయ్యాను. మీరు సంపూర్ణారోగ్యంతో తిరిగివచ్చి బ్లాగును మీ పద్యాలతో భూషింపజేయాలని, ఆ విధంగా భగవత్కృప మీపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ ఆరోగ్య పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడు ఎవరైనా మిత్రుల ద్వారానో, మీ సంతానం ద్వారానో బ్లాగుకు సమాచారం అందించండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
☺
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి వారి స్వాస్థ్యాన్ని కోరిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
నలుగురు మిత్రులు బ్రతుకున
రిప్లయితొలగించండికలిగిరి, ధర్మార్ధ మోక్ష కామములవి నా
వలపుల జోడికి, నాకును,
నలుగురితో తిరుగు సాధ్వి నా యిల్లాలే
సత్య నారాయ ణా ! నీదు శస్త్ర వైద్య
రిప్లయితొలగించండిమీయు చక్కని ఫలితమ్ము నీశు కరుణ
సందియంబును నిసుమంత యిందు లేదు
సంతసంబున నేగుమా స్టారు నకును
'Sheena' గారూ,
రిప్లయితొలగించండి(ఈ పేరు స్వంతదారు ఎవరో... గుర్తుకు రావడం లేదు.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారి గురించి మీరు వ్రాసిన పద్యం బాగుంది. సంతోషం!
ఇలగొప్ప నేత యయ్యెను
రిప్లయితొలగించండినలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
కలలో గూడను నితరుల
తలచదు మఱి తనదు మదిని దనపని తనదే
పలు సేవలుతా జేయుచు
రిప్లయితొలగించండిపిలచిన పలుకుచు సతమ్ము పేదలకొరకై
తలపడు నాయకురాలై
నలుగురితో దిరుగు సాధ్వి నాయిల్లాలే
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశ౦కరయ్య గారికి వందనములు
అల పాండవసతి ద్రౌపది
నలుగురితో తిరుగు సాధ్వి. నా యిల్లాలే
యలుకను మానవె యన నా
తలనుముడిని ద్రోచె. నీసు తాపము హెచ్చన్
మరియొక పూరణ: తెలివియు విద్యయు కలిమియు కలికితనము చెలువమున్న గరువములేకన్
తొలగని చిరునగవులతో
నలుగురితో తిరుగు సాధ్వి. నా యిల్లాలే
సత్యనారాయణ రెడ్డిగారు పరిపూర్ణమైన ఆరోగ్యం తో మరల మన బ్లాగులో ప్రవేశిస్తారని నమ్ముతున్నాను.
రిప్లయితొలగించండికవిమిత్రులు శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిగారికి,ఆపరేషన్ విజయవంతంగా జరిగి,
రిప్లయితొలగించండిసంపూర్ణ ఆరోగ్యవంతులై మరల బ్లాగులో పద్య మధురిమలను పంచవలెనని కోరుకొనుచున్నాను.
వెలుగులు చిందెడు మోమున
తిలకమ్మును దాల్చివెడలి దేవాలయమే
అలజూడుడు గుడిచుట్టును
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
నా స్వస్థత కోరి సందేశము పంపిన పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి యితర కవి మిత్రులకు
రిప్లయితొలగించండికృతజ్ఞతలు.
హనుమచ్చాస్త్రి గారూ మీ పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండివలపుల నను కరగించుచు
రిప్లయితొలగించండినలసత్వము జూప దెపుడు నలివేణి! యహో!
చెలిమినిడుచు కలివిడిగా
నలుగురితోఁ దిరుగు సాధ్వి! నా యిల్లాలే.
కులకాంతలు వటవృక్షముఁ
రిప్లయితొలగించండివలచుట్టుచు మ్రొక్కుచుంద్రు వటపౌర్ణమి నా
డల పతి సేమమున కటుల
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే!
గోలి గారూ మీ పూరణ అభినందనీయం.
రిప్లయితొలగించండిమల్లెల సోమనాథ శాస్రి గారి పూరణములు
రిప్లయితొలగించండిపలుగతి నింటిని దిద్దుచు
సలుపుచు మానవహితమగు సంఘపు సేవన్
మెలగుచు, పూజల, భజనల
నలుగురితో తిరుగు సాథ్వి నా యిల్లాలే
చెలగుచు బిడ్డల తల్లిగ
సలుపుచు నుద్యోగమదియు సర్వులమెప్పున్
గలదిగ,సమాజ సేవన్
నలుగురిలో తిరుగు సాధ్వి నా యిల్లాలే
అలకల కులుకుల మాటల
రిప్లయితొలగించండితలపుల రమణీయమైన తాదాత్మ్యంబున్
చిలుకుచు మెలకువ తోడన్
నలుగురితో తిరుగునామె నాయిల్లాలే
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కార్తిక్ భరద్వాజ్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మిస్సన్న గారన్నట్టు మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలతలలో కలహములో
రిప్లయితొలగించండిచెలరేగే కామమందు చెరిసగ మనుచున్
వలపుల వృద్ధాప్యమనెడి
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే
సలుపుచు మాలున యాత్రలు
రిప్లయితొలగించండికలుపుచు చేతులను మెండు గారము తోడన్
పలుకుచు కులుకుచు పడతుల
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే
రిప్లయితొలగించండిపలుగున్ పారను గైకొని
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే
పలువిధముల పిల్లల చదు
వులకై చేయూతనిచ్చె వురుకుల పరుగుల్ !
జిలేబి