సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, చాలా రోజులకు మీ పద్యాన్ని చదివే అదృష్టాన్ని ప్రసాదించారు. ధన్యవాదాలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
పంచా మృతముల తోడను
రిప్లయితొలగించండిసంచిత పాపములు తొలగు శర్వుని కొలువన్
చంచల మనమును వీడుచు ;
అంచిత మంత్రముల చేత యభి షేకించన్
పంచా మృతముల తోడను
రిప్లయితొలగించండిఅంచిత మంత్రములు చదివి యభి షేకించన్
చంచల మనమును వీడిన
సంచిత పాపములు తొలగు శర్వుని కొలువన్
గురువులు క్షమించాలి ఇలా వ్రాస్తె అన్వయం కుదురు తుందేమొ అని
పంచామృతాభిషేకము
రిప్లయితొలగించండిపంచముఖునకున్ ప్రియంబు భక్తుల కెరుకే
తుంచును పాపమ్ములఁ దా
పెంచును మది శాంతి సౌఖ్య బీజము తానై
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
సత్య నారాయ ణా ! నీదు శస్త్ర వైద్య
రిప్లయితొలగించండిమీయు చక్కని ఫలితమ్ము నీశు కరుణ
సందియంబును నిసుమంత యిందు లేదు
సంతసంబున నేగుమా స్టారు నకును
పంచామృతముల జేతను
రిప్లయితొలగించండిమంచిగ నభిషేక మచట మంత్రము తోడ
న్నంచిత భక్తిని జేయగ
సంచితమగు బుణ్య తతులు శర్వుని గరుణన్
కన్నె యొక్కరిత యభిషే కంబు సలుపు
రిప్లయితొలగించండిచుండె శర్వునకున్ నిష్ట నుదయ కాల
మందు, పంచామృతము తోడ, నాదరించి
స్వామి కామితమ్ముల నిచ్చి సాకు గాత
వాక్కులర్థమ్ములు చక్కని మేనులై
రిప్లయితొలగించండి....యలరు దంపతులకు నక్కరముల
అఖిల లోకంబులు నందాల తనువులై
....పరగు దైవతములకు ప్రణతి శతము
హృదయ పద్మమునందు నింపుగా దనరారు
....నమృత తత్త్వములకు ధ్యాన నిరతి
ఊతమ్ము నందించి యోగసిద్ధిని గూర్చు
....గురువరేణ్యులకు నాదరముతోడ
సరస కవితాభిషేకమ్ము సన్మనమున
జరుపుకొనుచుందు నొప్పుగా సంతతమ్ము
శ్రీశివాశివ పాద రాజీవయుగ్మ
సేవతో గడపుచుందును జీవితమ్ము
పంచామృతములతోడన్
రిప్లయితొలగించండిఅంచితమౌభక్తి జేత యభిషేకించన్
పంచాస్యుని కరుణగలిగి
సంచిత పాపములు తొలగు సర్వుల కిలలో
అభిషేకజలము దెచ్చుచు
రిప్లయితొలగించండిప్రభవించిన భక్తితోడ పావనమయమౌ
విభునకు మంత్రాక్షరముల
శుభకరమగు వందనములు శోభను కూర్చున్
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
చాలా రోజులకు మీ పద్యాన్ని చదివే అదృష్టాన్ని ప్రసాదించారు. ధన్యవాదాలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.