30, మే 2014, శుక్రవారం

సమస్యాపూరణం – 1428 (ధారణ లేనియట్టి యవధానము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఒకానొక అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది...

15 వ్యాఖ్యలు:

 1. ధారణ ధార ధైర్యములె దాగుడుమూతులు ధీబలంబుకునె
  సారెకు విఘ్నభగ్నమున శారద నర్తిల పద్యపద్యమున్
  పూరణ కష్ట దత్తపది పోరు సమస్య పదాళికర్థ ని-
  ర్థారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ధారణతోడ చెప్పె డవధానము నందున చిక్కు ప్రశ్నలన్
  ధారగ వేయుచుండ మన తాతకు నైన నసాధ్యమైన యే
  మేరలు లేని ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పువాని కే
  ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడగన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పూరణ జేయు నట్టికవి పుంగవుడాయవదాన దీక్ష లో
  ధారణ, శైలి, పాండితి, విధానము జూపుచు మించి వాక్య ని
  ర్ధారణ జేసి, శారదను దల్చి సుధల్ చిలుకించ, కాలదు
  ర్ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

  ధారణమన్నచో జనులు దైవము నందునె బుద్ధి నుంచుటౌ
  ధారణ మన్న గుర్తుగొని తానటు పల్కిన దాని చెప్పుటౌ,
  ధారణలివ్వి రెండు నవధానికి కావలె.తన్నెనమ్ము నా
  ధారణ లేని యట్టి యవధానము గొప్పది యెంచి చూదగా!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మల్లెల వారిదే మరొకటి

  ధారణమున్ననే యదవధానము .లేకను వమ్మునయ్యెడున్
  వారణ లేక దత్తపది, బాగుసమస్య, నిషిద్ధమక్షరాల్
  పూరణ జేసి తా విడిగ, పొల్పుగ చెప్పినతప్పుతోడ, నా
  ధారణ లేనియట్టి యవధానము గొప్పదియెంచి చూడగా!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు

  “ధారణ లేని యట్టి యవధానము గొప్పది” యెంచి చూడగన్
  నీరము పైన వ్రాతలవి నీమము నీతియు నిగ్రహమ్ముయున్
  ధీరత లేక కార్యములు దేశ హితమ్ముగ జేయ జాలమీ
  వారసి సస్యశ్యామలము వాసినొనర్చుము నూత్న రాష్ట్రమున్

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మారణకాండ లేని పెను మాయల యుద్ధము; భూమిపైన పెన్
  దారుణకృత్యముల్ గనని ధర్మపు యెన్నిక;చూడ, లింగ ని
  ర్ధారణ లేని కాన్పులవి; ధారుణి యందున హీనమౌ పదో
  ద్ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడగా

  ప్రత్యుత్తరంతొలగించు

 10. శారద మాతనే దలచి సాధ్యము గానిది లేదటంచు నా
  పూరణ లన్ని జేసి ఘన పూరుషుడన్న టువంటి పేరుతో
  ధారణజూపి, పండితుల వద్దకు జేరిన నొక్క తప్పు ని
  ర్ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చూరగొనందగున్ తనకు సూటిగ ప్రశ్నల నిచ్చుచుండి ని-
  ర్ధారణ జేయ వాక్పటిమ తద్దయు జేరిన పృచ్చకాళినిన్
  గౌరవ సభ్యులన్ తగిన కైతల నూసుల పల్కరించుచున్
  ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.

  (ధారణ = ఎల్ల )

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ధారణతోడ చెప్పె డవధానము నందున చిక్కు ప్రశ్నలన్
  ధారగ వేయు పృచ్ఛకులు తప్పుల నెన్నని రీతి తోడ నే
  మేరలు లేని ప్రశ్నలకు మీరు జవాబుల నిచ్చుంచుండ యే
  ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడగన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. వీరవిహారమో యనగ పృచ్ఛకులెల్లరు మూర్ఛపోవగా
  మారణహోమమున్ సలిపి మాన్యత నొందెడి ప్రాభవమ్ముతో
  పూరణలందునన్ వసిగ పూర్వకవీంద్రుల స్పందనమ్మునన్
  ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బారులు బారు పద్యములు భార్యకు బంగరు గాజులిచ్చుటన్
  తీరుగ నాశువుల్ వడిగ తియ్యని మేతలు కుక్షి నిండగన్
  కారును బంగళానిడెడి కైతలు వచ్చునొ రావొటంచు ని
  ర్ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్

  అవధానము = ఏకాగ్రత

  ప్రత్యుత్తరంతొలగించు