3, మే 2014, శనివారం

పద్య రచన – 585 (మద్యపానము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“మద్యపానము”

15 కామెంట్‌లు:

  1. మందు మందని మందబుద్ధులు మత్తు పొందుచు మత్తునే
    విందు విందని పొంగుచుందురు వెర్రి వేషము వేయుచున్
    మందు కాదది విందు కాదది మాన ప్రాణహరమ్మురా
    మందు వీడుము విందు వీడుము మద్యపానము మానురా

    రిప్లయితొలగించండి
  2. మధ్యము సేవించిన తరి
    హృద్యముగా నుండు ననుచు హృదయము నందున్
    తద్యము తూటులు బడునట
    చోద్యము గాదనగ నిజము జూడగ తెలియున్

    రిప్లయితొలగించండి

  3. పద్య రచన ఇష్ట ప్రణయమై
    చేతుము రారండీ మిత్రులారా
    e-పద్య రచన మద్య పానము
    ఇచ్చు e-మాధ్య నిధిధ్యాసము !!

    శుభోదయం
    జిలేబి






    రిప్లయితొలగించండి
  4. జిలేబీ గారి భావానికి నా పద్యరూపం.....

    పద్యరచన మిష్టవ్యాసంగమై కావ్య
    రచనఁ జేయ రండు రసికులార!
    మద్యపానమువలె మత్తిల్లఁ జేయు నీ (e)
    మాధ్యమందు గలదు మధురిమమ్ము.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    మద్యపానరతుడు లయ తప్పే విధానాన్ని చక్కని లయతో కూడిన పద్యంలో చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘తద్యము’ అన్నారు. అలాంటి పదం లేదు. అది తథ్యమునకు వికృతి అనుకున్నారా?

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    ఇష్ట వ్యాసంగము అనుచోట గణములను ఒకమారు చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు. అది దోషమే క్రింది విధంగా సవరిస్తున్నాను...
    “పద్యరచన మొక్క వ్యాసంగమై....”

    రిప్లయితొలగించండి
  8. గురువులకు నమస్కా రములు
    మనం సాధారణంగా దేనికైనా " ఇది ఇలాజరగడం తధ్యం " అంటా, కదా అందుకని అలా వ్రాయ వచ్చు నని అనుకున్నాను పొరబడితే ఏ ముంది మన్నించడమే మరి
    "

    రిప్లయితొలగించండి
  9. విద్యను గలిగియు కొందరు
    విద్యయె లేనట్టి వారు వివరమె లేకన్
    మద్యపు బానిస లగుదురు
    చోద్యమె మద్యమ్మునందు చొప్పడెనేదో !

    రిప్లయితొలగించండి
  10. మద్య పానము చేయకు మామ ! నీవు
    మద్య పానము వలనన మతియ చెడును
    చిల్లు పడునయ్య ! నీ గుండె చివర కికను
    విగత జీవులు నగుదురు వేగముగను


    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. భాద్యతలు లేని కొందరు బ్రతుకు నంత
    మందు త్రాగుచు సతతము విందులందు
    మునిగి తేలుచు నుండిరి పనిని వీడి
    కూల్చు చుండిరి కొంపలా కోర్కె తీర



    రిప్లయితొలగించండి
  13. మద్యము ముట్టనిదే యే
    గద్యముఁ బద్యముఁ దొరలని కవులన్ జూడన్
    సోద్యము గాదే? మదిలో
    విద్యల తల్లిని దలచిన విబుధులు కారే?

    రిప్లయితొలగించండి
  14. మత్తున కలవాటు పడిన
    విత్తము గోల్పడు బ్రతుకున వేదన దెచ్చున్
    సత్తువ నీయని మద్యపు
    బొత్తును విడనాడకున్న పొందరు సుఖమున్

    రిప్లయితొలగించండి
  15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి