15, మే 2014, గురువారం

సమస్యాపూరణం - 1413 (హలమున రాఘవుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్.
ఈ సమస్యను సూచించిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.
నిజానికి వారిచ్చిన సమస్య
హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్.
(దీనినికూడా ప్రయత్నించవచ్చు)

27 కామెంట్‌లు:

 1. కలలందున రావణునకు
  హలమున రాఘవుడు రాక్ష సాధిపు జంపెన్
  బలవంతుడ ననుజంపగ
  నిలలో నరునికి తరమౌనె నెవ్విధి నైనన్

  రిప్లయితొలగించండి
 2. బలరిపు ముఖ్యామరతతి
  యలరగ నస్త్రమును వేసి యతి తీవ్రమహో
  జ్జ్వల సంగర భువి కోలా
  హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్

  రిప్లయితొలగించండి
 3. కలతను బెట్టిన వానిని
  నెలతను చెరబట్టి యనిని నెరపెడు వానిన్
  బలమంతయు బడ హాలా
  హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్.

  రిప్లయితొలగించండి

 4. నిలబడి క్షేత్రమంతటను నీరసమందక పంట నీయగా
  పొలమును దున్ను వేళ మరి పుట్టిన వ్యర్ధపు మొక్కలెన్నియో
  యలయక మట్టుబెట్ట సరి హాలికుడెట్టుల దీసివేయునో
  హలమున, రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

  రిప్లయితొలగించండి

 5. నిలబడి క్షేత్రమంతటను నీరసమందక పంట నీయగా
  పొలమును దున్ను వేళ మరి పుట్టిన వ్యర్ధపు మొక్కనెట్టులో
  యలయక మట్టుబెట్ట సరి హాలికుడెట్టుల దీసివేయునో
  హలమున, రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

  రిప్లయితొలగించండి
 6. బలరాముండని సలుపును
  హలమున, రాఘవుడు రాక్షసాధిపు జంపెన్
  బలవంతమ్మున నాతని
  చెలియను గొనిపోయె గాన, చేటును గనకన్

  రిప్లయితొలగించండి
 7. బల రాముడు గూల్చె రిపుల
  హలమున; రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్
  పలు శస్త్రా స్త్రములు వదలి
  కలు షాత్ముడు రావణుండు కన్నులు మూయన్

  రిప్లయితొలగించండి
 8. బలరామ !చంపు రిపులను
  హలమున, రాఘవుడు రాక్షసాధిపు జంపెన్
  బలమగు కోదండం బున
  బలమదమున నెగయు నట్టి రావణు దనుజున్

  రిప్లయితొలగించండి
 9. శ్రీ పండిత నేమాని గారి పూరణ అత్యుత్తమం

  బల వంతుడ నేనే యను
  తల బిరుసున చెరను బెట్ట తన సీతను ధీ
  బలుడై ,వానర కోలా
  హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్ !!!

  బలరాముడు ద్రుంచె రిపుల
  హలమున;రాఘవుడు రాక్షసాధిపుజంపెన్
  విలసిత కోదండముతో
  నలచక్రాహతునిజేసె హరిశిశుపాలున్ !!!

  రిప్లయితొలగించండి
 10. లలనా మణి సీతమ్మని
  బలవంతుడు రావణుండ పహరించుటచే
  కలుడా తనితో జరిగిన
  హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్.  రిప్లయితొలగించండి
 11. కులసతిఁ జెరబట్టి దనుజ
  బలగర్వమునన్ వరించ బంధీ చేయన్
  దలపడి సంగర కోలా
  హలమున రాఘవుఁడు రాక్షసాధిపు జంపెన్

  రిప్లయితొలగించండి
 12. మిత్రులాఅ! శుభాశీస్సులు.
  ఈ నాటి పూరణలు అన్నియును బాగుగ నున్నవి.
  అందరికి అభినందనలు.
  కొన్ని సూచనలు:

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  4వ పాదములో ఒక అక్షరము ఎక్కువగ నున్నది. టైపు పొరపాటు కావచ్చు. నరునికి బదులుగా నరుని అందాము.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  మీ పద్యములు 2 బాగుగ నున్నవి. అభినందనలు.
  1వ పద్యములో హాలహలముతో జంపెను అనుటను మార్చితే బాగుండునేమో?
  2వ పద్యములో ఆఖరిలో ఎక్కడైన "అటులనే" అంటే అన్వయము పూర్తి అగును.

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  పద్యము చివరలో గనకన్ అనే కంటే గనకే అంటే బాగుంటుంది.

  శ్రీ మంద పీతాంబర్ గారు:
  మీ ప్రశంసలకు మా సంతోషము.

  రిప్లయితొలగించండి
 13. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి

 14. నిలబడి దేవ గణంబులు
  తిలకించిరి కాంక్షతోడ దివినల్దెసలన్
  ఇల బెదరను కదనకుతూ
  హలమున, రాఘవుడు రాక్షసాధిపు జంపెన్

  రిప్లయితొలగించండి
 15. క్రమాలంకారము
  పొలమును రైతెటు దున్నును?
  బలిమిని సీతమ్మ చేయి పట్టినదెవరో?
  ఇల రాముండెవని దునిమె?
  హలమున; రాఘవుడు; రాక్షసాధిపు జంపెన్

  రిప్లయితొలగించండి
 16. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  చెలగుచు లంకకు వారధి
  కలిపియు,వానర బలముల ఘనుడగు వీరుం
  డలయక,కీశుల కోలా
  హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్

  చలమున రావణుండువెస జానకి నెత్తుక పోవ,సాయమై
  బలమునగాక మారిచుడు బంగరులేడిగ మారగా,కుతూ
  హలమున రాఘవుండు దనుజాధిపు జంపెను-సంగరంబునన్
  బలమున రావణున్ దునిమె వానరసేనయె తోడుగా తగన్

  రిప్లయితొలగించండి
 17. ఇల సీతమ్మను రావణు
  డలవోకగ నపహరించి యారడి పెట్టన్
  బలగర్వమణచివేయగ
  హలమున రాఘవుడు రాక్షసాధిపు జంపెన్!

  రిప్లయితొలగించండి
 18. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
  మీ సూచన మేరకు సవరణలు చేయుచున్నాను.

  కలతను బెట్టిన వానిని
  నెలతను చెరబట్టి యనిని నెరపెడు వానిన్
  తలలన్నియు బడ కోలా
  హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్.


  నిలబడి క్షేత్రమంతటను నీరసమందక పంట నీయగా
  పొలమును దున్ను వేళ మరి పుట్టిన వ్యర్ధపు మొక్కనెట్టులో
  యలయక మట్టుబెట్ట సరి హాలికుడే భువి గూల్చినట్టులే
  హలమున, రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

  రిప్లయితొలగించండి
 19. పూరణలు, పద్యాలు వ్రాసిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. రేపటి సమస్యను, పద్యరచనను మాత్రం షెడ్యూల్ చేయగలిగాను. మీ పద్యాలపై స్పందించలేకపోతున్నందుకు మన్నించండి.

  రిప్లయితొలగించండి

 20. 'కలవరపాటు కూడదిక కాంత! త్వదీయ విభుండు కోతిమూ
  కలగొని కట్టి వారధిని గమ్మున లంకకు జేరె, తీవ్రమౌ
  హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను, సంగరంబునన్
  నలిపితి మెల్ల రక్కసుల నల్లుల వోలె' సమీరి వాకొనెన్.  (హలము = కయ్యము)

  రిప్లయితొలగించండి
 21. విలువలు లేని వాని వలె బేల అయోనిజ నెత్తుకెళ్ళియున్
  కలతలు గల్గజేసె దశకంఠుడు, గర్వము నిండుకున్న యా
  తలలను ద్రుంచ బాణములు ధాటిగ వేయుచు నెంతయో కుతూ
  హలమున రాఘవుండు ధనుజారిని జంపెను సంగరంబునన్!

  రిప్లయితొలగించండి
 22. మిత్రులారా! శుభాశీస్సులు.
  అందరి పూరణలు బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. శిలనెత్తంగల వారలు
  బలముఁ గలిగినట్టి పెక్కు వానర వీరుల్
  గలగల చేసెడు హల్లో
  హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్.
  శిలలను చేతఁ బట్టి కడు చేవనుఁ జూపెడు వానరమ్ములన్
  పలువురఁ జేర్చి శత్రువును పట్టుకొనంగ మహా బలిష్ఠుడై
  యిలసుతఁ గావ వచ్చె; ధనువే తన యాయుధమౌను గానదే
  హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్?

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. పలుపలు విధముల చింతలు
   కలతలు దీర్చిన మునివర కథనము తోడన్
   చెలరేగిన ధైర్యముతో
   హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్


   హలము = కలహము

   "తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
   రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం

   దైవతైశ్చ సమాగమ్య
   ద్రష్టుమభ్యాగతో రణం
   ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః"

   తొలగించండి
 25. కిలకిల లాడు కోతులట క్రిందను మీదను గంతి ముద్దుగా
  జలనిధి పైన వారధిని చక్కగ కట్టగ దాటివచ్చుచున్
  కులసతి జానకమ్మనిక కూడగ పావని లక్ష్మణుండితో
  హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

  హలము = కలహము

  రిప్లయితొలగించండి