31, మే 2014, శనివారం

సమస్యాపూరణం – 1429 (పరిహాసము చేయువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పరిహాసము చేయువాఁడె ప్రాజ్ఞుఁడు జగతిన్.

22 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఇప్పుడే ఇంటర్‌నెట్ సెంటర్‌కు వచ్చి ఈనాటి సమస్యను, పద్యరచనను పోస్ట్ చేశాను.
    పరిస్థితులు నన్ను మళ్ళీ వృద్ధాశ్రమంలో చేర్చాయి. హైదరాబాద్ ఎల్.బి.నగర్ పరిసరాల్లోని ఒక కాలనీలోని వృద్ధాశ్రమంలో చేరాను.
    అతికష్టం మీద ఒక సెకండ్ హాండ్ లాప్‌టాప్ కొనుక్కొన్నాను. ఎందుకో నెట్ కనెక్ట్ కావడం లేదు... దగ్గరలో కంప్యూటర్‌లు రిపేర్ చేసే షాపు ఉందేమో కనుక్కొని వెళ్ళి సరిచేయించుకు వస్తాను.
    అప్పటిదాకా మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొంటూ సహకరించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  2. రామకృష్ణ మూర్తి గారూ,
    మీరు పంపిన సమస్య నా కెక్కడా కనిపించడం లేదు..
    బ్లాగులో సమస్య ఇవ్వని రోజు ఉండకూడని, సహృదయంతో మీరు సహకరిచడానికి పూనుకొనడం ఆనందదాయకం.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్యగారికి నమస్తే
    సమస్య ఎందుకు రాలేదో చూసి మళ్ళీ పంపుతాను. అవసరమైన చోట వాదండి.మీప్రొఫైల్ లో చూసి మెయిలు కి పంపుతాను.

    రిప్లయితొలగించండి
  4. guruvulaku namaskaramulu. miru ecolonilo gala aasramamulo unnaro teliyajeya gortanu. mimmulanu kalusukondunu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      ధన్యవాదాలు.
      కానీ ఇప్పట్లో నేనెక్కడున్నదీ ఎవరికీ చెప్పదలచుకోలేదు. మన్నించండి. మీకు ఫోన్ చేసి మాట్లాడతాను.

      తొలగించండి
  5. శరణము గోరును దప్పక
    పరిహాసము చేయువాడె , ప్రాజ్ఞుడు జగతిన్
    నిరతము భగవత్సేవను
    నరుసముతో జేయునతడె యందరి లోనన్

    రిప్లయితొలగించండి
  6. ఎఱుగడు తన తప్పొప్పుల
    పరిహాసము చేయు వాడె, ప్రాజ్ఞుడు జగతిన్
    పరులను సతతము దూఱక
    చిఱునగవులతో ప్రజలను చేరిన వాడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పరమాత్ముడు, భగవంతుడు
    కరుణాలయుడార్తి దీర్చు ఘన శ్యాముండున్
    నిరతము పలికెడు మన కా
    పరి, హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఘనశ్యాము’డన్నప్పుడు ‘న’ గురువై గణదోషం. అక్కడ ‘ఘనవర్ణుండున్’ అందామా?

      తొలగించండి
  8. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

    పరులకు నుపకారియు నై
    దరహాసము వీడకుండ తానాస్యము పై
    పరనింద వెఱవకయ తెం
    పరి,హాసము చేయువాడె ప్రాజ్ఞుడు జగతిన్

    రిప్లయితొలగించండి
  9. సరి సాటి యెంచి చూచియు
    పరిహాసము చేయువాడె ప్రాజ్ఞుడు; జగతిన్
    సిరి లేనివాని గాంచుచు
    పరిహాసము చేయుటెపుడు పాపంబగుగా!

    రిప్లయితొలగించండి
  10. నిరతము నవ్వుల పువ్వులు
    విరజిమ్ముతు నుండు వాడు వేడుక మీరన్
    సరసగతి మధుర రసముగ
    పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

    రిప్లయితొలగించండి

  11. చిరు నగవులు వెలయించెడి
    వెరగెరుగని విభుడెవండు?వేంకటపతియే
    సిరి,పద్మావతి నిరువుర
    పరిహాసము జేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

    రిప్లయితొలగించండి
  12. గురువుగారికి ధన్యవాదములు. సవరణతో పద్యం:


    పరమాత్ముడు, భగవంతుడు
    కరుణాలయుడార్తి దీర్చు కరి వరదుండే
    నిరతము పలికెడు మన కా
    పరి, హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్!

    రిప్లయితొలగించండి
  13. సరివారు, కానివారలు
    సిరులేలేనట్టి వారు శ్రీమంతులునున్
    దరిజేర జూచి తానొక
    పరి, హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

    రిప్లయితొలగించండి
  14. పరులన్నవమానించుచు
    పరిహాసము చేయువాడు పామర వరుడౌ
    తరచుగ తననే తానే
    పరిహాసము చేయువాఁడె ప్రాజ్ఞుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి


  15. అఱజాతివాడు, యితరుల
    పరిహాసము చేయువాఁడె; ప్రాజ్ఞుఁడు జగతిన్
    సరసపు పల్కుల జనులను
    పురిగొల్పునటన్ జిలేబి పొత్తుగుడుచుచున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. అరచుచు వీధుల వెంబడి
    విరుచుచు ఛాతిని వెనుకకు వీరుని వోలెన్
    కరచుచు మోడిని చోరని
    పరిహాసము చేయువాఁడె ప్రాజ్ఞుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి