8, మే 2014, గురువారం

పద్య రచన – 590 (మోదుగుపూలు)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7 కామెంట్‌లు:

  1. మోదుగు కుసుమములు చాల మోదము కలి
    గించు చున్నవి భక్తిఁ బూజించ శివుని
    కామితమ్ముల నిచ్చును కరుణ తోడ
    శివుని మల్లెయనిపిలుతు రవని జనులు

    రిప్లయితొలగించండి

  2. మోదుగ పూలవి జూడుడు
    మోదము గలిగించు చుండె మోహన రీతిన్
    యాదగిరి గురువు పొలమున
    పాదపమును జూడ నేను బ్రమదము గలిగెన్

    రిప్లయితొలగించండి
  3. కవి మిత్రులకు విన్నపము. బొమ్మను డెస్కు టాపు మీదకు డ్రాగ్ చేస్తే దాని పేరు తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. హోమ గుండము లోనుండు ధూమకేతు
    కణము లేరీతి వెల్గునో కణకణ మని
    య ట్లరుణకాంతితో నొప్పు నవి గనంగ
    మోదుగు విరులు ప్రోవుగా పోయ నిచట.

    రిప్లయితొలగించండి
  5. విరివిగ వనిలో పూచును
    పరిమళ మిసుమంత లేని పర్ణార్తవముల్
    అరుణోదయ వర్ణముగల
    విరులివి ముచ్చటగ నున్న విలువే లేదే!

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా! శుభాశీస్సులు.
    మోదుగు పూవుల గురించి ఈనాటి పద్యములు అన్నియును బాగుగ నున్నవి.
    అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. మోదుగంపు పూలనుమాట ముదమునిచ్చె
    మనము నిండెనెన్నియొ భావమాలికలవి
    తోట నిండుగ పువ్వుల తోరణములు
    రంగురంగుల గాంచితి రమ్యమలర.

    రిప్లయితొలగించండి