28, మే 2014, బుధవారం

పద్య రచన – 573

కవిమిత్రులారా,
 పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. అమ్మమ్మ పూలనమ్ముట
    అమ్మమ్మా తప్పుగాదదాకటికొరకే
    అమ్మాయీ ! పూలను గొను
    మమ్మా ! యీ పేదలాలి నాదుకొనమ్మా !

    రిప్లయితొలగించండి
  2. నగర సాయంత్రసమయాల నడచిచూడ
    పొసగ స్త్రీజనుల శిరమౌను పూలగంప
    చాల సందడి చేయులే పూలమనిషి
    చాల చదువగ బ్రతుకౌను పూలబాట !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ మూర్తి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      రెండవ పాదంలో ఒక అక్షరం ఎక్కువయింది. ‘పొసగ స్త్రీజన శిరములౌ పూలగంప’ అనవచ్చు కదా!

      తొలగించండి
  3. నుదుటను బొద్దుపొడ్పు వలె నున్నన దిద్దియు బొట్టు చేతిలో
    కుదురుగ గంపలోన కడు కోమలికంబగు బంతి పూవులన్
    ముదమున నింపి పట్టుకొని పోవుచునున్నది వృద్ధురాలు తా
    ముదితల కెల్లనమ్మనవి ముఖ్య పు పట్టణ వీధి యిండ్లలోన్

    రిప్లయితొలగించండి
  4. నిండు గంపను దెచ్చితి రండు కొనగ
    మగని మురిపించి గెలిపించ మల్లె పూలు
    వరము లందెడి తరుణమ్ము విరియు సొగసు
    నమ్మ గామిమ్ము దీవింతు కొమ్మ లార

    రిప్లయితొలగించండి
  5. అక్కయ్యా,
    ఈరోజు ఈ శీర్షికకు వచ్చిన పద్యాలలో మీ పద్యం నిస్సందేహంగా ఉత్తమమైనదని చెప్పవచ్చు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పెద్ద ముత్తయిదువ ముద్దబంతుల నమ్మ
    కోరి కొనగ రాని కొమ్మలెవరె?
    పూల పచ్చ దనము ముదిత నుదుట జేర!
    తాళి పచ్చ గుండు తరుణు లలర!

    రిప్లయితొలగించండి
  7. పెద్ద ముత్తైదువ ను జూడు పెద్ద గంప
    నిండ బంతి పూవులు ,మల్లె లుండు నటుల
    అమ్మ కానికి గొనివచ్చె నతివ లార !
    వెళ్లి వేవేగ గొనుడిక విరులు మీరు

    రిప్లయితొలగించండి
  8. బుట్టను చేతంబట్టుచు
    పట్టణమంతయు దిరుగుచు బంతుల నమ్మున్
    పట్టెడు మెతుకుల కోసమె
    నిట్టుల పనిజేయుచున్న నింతిని గనరే!

    రిప్లయితొలగించండి
  9. దేవుడు వ్రాసిన వ్రాతయొ
    పూవుల నమ్ముకొని ప్రొద్దు బుచ్చగవలసెన్
    ఏ విధి దెలుపుదు బాధలు
    చావుకు చేరువగ నున్న చయ్యనరాదే!

    రిప్లయితొలగించండి
  10. మాస్టరుగారూ ధన్యవాదములు...
    చిన్నటైపాటు సవరణ..పేదలాలి బదులు పేదరాలి..తో...

    అమ్మమ్మ పూలనమ్ముట
    అమ్మమ్మా తప్పుగాదదాకటికొరకే
    అమ్మాయీ ! పూలను గొను
    మమ్మా ! యీ పేదరాలి నాదుకొనమ్మా !

    రిప్లయితొలగించండి
  11. గురువులకు ధన్య వాదములు
    అక్కని గావడం నా పూర్వ పుణ్య ఫలితం ఎం...త చక్కని పిలుపు ? కృతజ్ఞాతలు

    రిప్లయితొలగించండి
  12. నిజమే! గురువు గారు! కంగారు లో గమనించలేదు.

    రిప్లయితొలగించండి
  13. దేవుడు వ్రాసిన వ్రాతయొ
    పూవుల నమ్ముకొని ప్రొద్దు బుచ్చగవలసెన్
    ఏ విధి దెలుపుదు బాధలు
    జీవన చరమాంకమందు జీవిక కొరకై

    రిప్లయితొలగించండి
  14. ముదిమి వయసు లోన ముచ్చటౌ మోముతో
    నాంద్ర కట్టు బొట్టు నందగించె
    పొట్ట కూటి కొరకు పువ్వుల నమ్ముచు
    పతికి నండ యయ్యె పరమ సాధ్వి

    రిప్లయితొలగించండి