22, మే 2014, గురువారం

సమస్యాపూరణం – 1420 (బహుపత్నీవ్రతమె)కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
(ఇది ఒకానొక అవధానంలో గరికిపాటివారికి ఇచ్చిన సమస్య)

37 కామెంట్‌లు:

 1. బహుభార్య లందు నొకతయొ
  మహాకవి నుడివిన భంగి మనసున మనసై
  మహిపై వర్తిలు ననుచో
  బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

  రిప్లయితొలగించండి
 2. బహు పత్నీవ్రతు లనరే?
  బహు,పత్నీ వ్రతమె మేలు భర్తల కెల్లన్
  మహినని, ధర్మము వినుడీ
  రహిమెయి యొక పత్నితోడ బ్రతుకుట మేలౌ

  రిప్లయితొలగించండి
 3. మహి నేలిన రాజు లనిరట
  నిహ పరముల సుఖము లేదు నింతుల తోడన్
  మహిళల మహిమలు దెలియక
  బహు పత్నీ వ్రతమె మేలు భర్తల కెల్లన్

  రిప్లయితొలగించండి
 4. మహరాజులకే చెల్లెను
  బహుపత్నీ వ్రతమె, మేలు భర్తల కెల్లన్
  సహనమ్ముగ షట్కర్మల
  సహజమ్ముగ నిర్వహించు సత్సతి యొకతే!

  రిప్లయితొలగించండి
 5. అహహా! నా యున్నతికా
  యహరహమును నిష్ఠ తోడ నతివా! నీకీ
  మహనీయ దీక్ష? ఫలమగు
  బహు, పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

  రిప్లయితొలగించండి

 6. సాఫ్టు జీవితమున ప్రాజెక్టులు
  కరువై జీవన తరుగు కాలమున
  మల్టీ ప్రాజెక్టుల కి సూత్రధారియైన
  బహుపత్నీవ్రతమె మేలు (సాఫ్టు)భర్తల కెల్లన్ !!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. ఇహపర సౌఖ్యము కొరకై
  మహి ధర్మము నాల్గు గతుల మనవలె ననగా
  బహు భర్తలతో చేసెడు
  బహుపత్నీ వ్రతమె మేలు భర్తల కెల్లన్

  రిప్లయితొలగించండి
 8. మహిలో రాజుల కుండును
  బహుపత్నీవ్రతమె, మేలు భర్తల కెల్లన్
  నిహపర సుఖముల నొసగే
  సహచరి యొకరున్నచాలు సంసారమునన్

  రిప్లయితొలగించండి
 9. స్పృహ కలిగి దేశమేలెడు
  మహితుడు భూభర్తగ వర మహిళకు పతిగా
  సహనమున నేలు నటులీ
  బహుపత్నీవ్రతమె మేలు భర్తలకెల్లన్.

  రిప్లయితొలగించండి
 10. స్పృహ కలిగి దేశమేలెడు
  మహితుడు భూభర్తగ వర మహిళకు పతిగా
  సహనమున నేలు నటులీ
  బహుపత్నీవ్రతమె మేలు భర్తలకెల్లన్.

  రిప్లయితొలగించండి
 11. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

  రహియని రలనాడు గొనగ
  బహుపత్నీ వ్రతము; మేలుభర్తల కెల్లన్
  యిహమును,పరమును కనగా
  బహుపత్నుల గాక యేక పత్నియె శుభమౌ!  రిప్లయితొలగించండి
 12. మల్లెల వారిదే మరొకటి

  వహియించిరెల్ల దేవులు
  బహుపత్నీవ్రతము;మేలుభర్తలకెల్లన్
  బహుగతి జూపగ కష్టము
  బహుపత్నులవల్ల,వారి పాట్లను గనియున్

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. బహుళముగా సిరులుండిన
  బహుపత్నీ వ్రతము మేలు భర్తలకెల్లన్
  అహహా! బిక్షువు కిరువుర?
  సహచరి గంగను విడువుము, చాలును ఉమయే!

  రిప్లయితొలగించండి
 15. రామకృష్ణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘మహి నేలిన రాజు లనిరి/ యిహపర...’ అందాం.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  నిజానికి మహారాజు సాధురూపం. అయితే ‘మహరాజు’ శబ్దానికి శ్రీహరి నిఘంటువు శ్రీమంతుడు అనే అర్థాన్నిచ్చింది. కనుక పరవాలేదు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  _/\_
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మంచి పూరణ అందించారు. అభినందనలు.
  ‘సుఖముల నొసగెడి’ అనండి.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  బహుకాలానికి మామీద దయ కలిగింది.
  చక్కని పూరణ నందించి అలరింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘ఎల్లన్ + ఇహమును’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఎల్ల/ న్నిహమును...’ అనవచ్చు.
  *
  పుష్యం గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చాలును ఉమయే’ అని విసంధిగా వ్రాశారు. ‘చాలు నచలయే/ చాలు హిమజయే’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. ఆహాహా చక్కగ బలికిరి
  బహు పత్నీ వ్రతమె మేలు భర్తల కెల్లన్
  బహు భార్యలు గలరుగ మఱి
  మహినేలినరా జులకును మఱచితి రార్యా !

  రిప్లయితొలగించండి
 18. కుహణుండంచు దలంచక
  బహుపత్నుల నేలినట్టి ప్రవరుని పోల్కిన్
  సహచరునిగ మెలుగ గలుగ
  బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

  కుహనా సంస్కృతి, నధముల
  సహవాసము, గోరు వారె సంతోషముతో
  నహరహమును బలుకుడురిటు
  బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

  రిప్లయితొలగించండి

 19. శంకరార్యా,

  'చాలును ఉమయే' అంటే పొసగలేదనిపించింది గాని, ఎందుకో తెలియలేదు. సవరణకు ధన్యవాదములు.


  బహుళముగా సిరులుండిన
  బహుపత్నీ వ్రతము మేలు భర్తలకెల్లన్
  అహహా! బిక్షువు కిరువుర?
  సహచరి గంగను విడువుము, చాలునచలయే!

  రిప్లయితొలగించండి
 20. సహజీవన సౌఖ్యమ్మును
  సహజమ్ముగ గోరువారు సరస మతులకున్
  ఇహలోకపు పురుషులకును
  బహు , పత్నీ వ్రతమె మేలు భర్తల కెల్లన్

  రిప్లయితొలగించండి
 21. సహనము గల సతి నొకతియె
  సహజముగా నుంట చాలు సంసారమునన్
  బహు పత్నులతో నిడుములు
  బహు; పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్ !!!

  రిప్లయితొలగించండి

 22. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు

  పూరణ:పి .మాధవ శర్మ గారు పిఠాపురం
  మహిలోజెల్లు వివాహము
  మహిళకు మగవానికి పరమార్ధము బడయన్
  విహితము కాదాడ సతుల
  బహు ,పత్నీవ్రతము మేలు భర్తల కెల్లన్
  తిమ్మాజీరావు పూరణ:మహిలో పతి కొక పత్నిగ
  నిహమున సుఖములను బొంద నింకా సిరులన్
  బహుళముగా నార్జిoపగ
  బహు ,పత్నీవ్రతము మేలు భర్తల కెల్లన్

  రిప్లయితొలగించండి
 23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు
  మరిరెండుపూరణలు

  బహు కట్నము లభియింపగ
  బహు ,పత్నీవ్రతము మేలు భర్తల కెల్లన్
  యిహిహీ యని యికిలించగ
  నహి నహి జైలుకు పదమని న్యాయము తెలిపెన్

  బహుపత్నులు జేయు వ్రతము
  బహు పత్నీ వ్రతమనంగ బహమని రాణుల్
  బహుళము గా నొనరించిన
  బహు ,పత్నీవ్రతము మేలు భర్తల కెల్లన్

  రిప్లయితొలగించండి
 24. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మాధవశర్మగారి పూరణను అందించినందుకు ధన్యవాదాలు.
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  పి. మాధవ శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. ప్రతి పురుషుడి విజయము వెనక ఒక స్త్రీ వుంటుందనే అర్థంలో ....
  బహు రూపుల దాల్చు నహో!
  బహు నేర్పున, పతి కనువుగ పడతి నొకతె నుం
  డు హ! కీర్తి బడయ పురుషుడు
  బహు పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

  రిప్లయితొలగించండి
 26. మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘పడతి యొకతె యుం/ డహొ కీర్తి...’ అనండి.

  రిప్లయితొలగించండి
 27. అలాగే గురువు గారు. ధన్యవాదములు.

  బహు రూపుల దాల్చు నహో!
  బహు నేర్పున, పతి కనువుగ పడతి పడతి యొకతె యుం
  డహొ! కీర్తి బడయ పురుషుడు
  బహు పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

  మీకు ఇప్పుడు ఆరోగ్యము ఎట్లా వుంది?

  రిప్లయితొలగించండి
 28. బహు రూపుల దాల్చు నహో!
  బహు నేర్పున, పతి కనువుగ పడతి యొకతె యుం
  డహొ! కీర్తి బడయ పురుషుడు
  బహు పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

  రిప్లయితొలగించండి
 29. అమ్మా! సుమలత గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది.
  బహు రూపులు, బహు నేర్పు అనే సమాసములు సాధువులు కావు. బహు రూపములు అనాలి; సమాసములో మొదటి పదము సంస్కృతము అయినప్పుడు 2వ పదము తెలుగు ఉండకూడదు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 30. బహుళంతస్తుల గృహముల
  మహిళలు నొకచోటజేరి మాహేశ్వరినే
  సహపంక్తిజేరి గొలిచిరి
  బహు పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

  రిప్లయితొలగించండి
 31. పండిత నేమాని వారూ,
  అవును గురువుగారు. నేను కూడ కొంచెము సందేహించాను. నాకు తెలిసిన కొద్ది సంస్కృతములో బహు అను పదము లింగము, వచనము బట్టి మారుతుంది కద అని. బహవహ, బహూని లాగ. బహు అనునది సర్వ బహు వచనమేమొ కద.

  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 32. బహుకార్యపు దాసి వలెను
  సహిసహి గృహమంత్రి వోలె శయ్యన రంభై
  సహనమ్మున క్షితి వోలెడి
  బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్

  రిప్లయితొలగించండి


 33. కుహుకుహు జిలేబి యవగన్
  "బహు"! పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్!
  వహవహ యని పతి యనగన్
  జహనారా బేగమా మజ,ముడేసుకొనూ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 34. బహుబాగుగ పల్కిరయా:
  "బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్"
  బహు పత్నుల తోడుతగా
  బహు పత్నుల తల్లు లెల్ల బరరబర రారే?

  రిప్లయితొలగించండి


 35. ఇహలోకమున వెలసె నహ
  రహము జనుల గావ భళి సిరాజుగ నితడే
  ముహమదు పెండిలి యాడెను
  బహు పత్నుల, తల్లు లెల్ల బరబర రారే!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 36. అహహ! జిలేబులనుకొనిర!
  ప్రహతంబయ్యెదరు మీరు పండితులారా
  జహరీలాలు! పలుకకుడి
  "బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్"!

  జిలేబి

  రిప్లయితొలగించండి