20, మే 2014, మంగళవారం

పద్య రచన – 565

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు: 1. దాయమున పందెము కాచి
  సముదాయము మోదీ ని గెలిపించి
  దీదీ లను తలపై నెక్కించి
  సరియైన 'చెక్' పెట్టిన దేశమిది !!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం.............

  దాయమందున సముదాయమ్ముగా పందె
  మొడ్డి మోదికి గెలు పొనరజేసి
  తెలిసి తెలిసి తలను దీదీల నెక్కించి
  తివిరి చెక్కు పెట్టు దేశ మిద్ది.

  రిప్లయితొలగించండి
 3. అదియొక విష వలయమ్మట
  పదవుల వ్యామోహ మందు పాములు పులులున్
  మదముగ దిరుగుచు నుండును
  పదిలము ప్రజలార గనుడు బలియై పోవన్

  రిప్లయితొలగించండి
 4. వేల వరము లిచ్చి వెఱ్ఱి వారిగ జేసి
  ప్రజల దోచు కొనుచు బ్రతుకు వారు
  పదవి కొరకు సతము పార్టీలు మార్చుచూ
  వెలుగు చుండ్రి నేడు తెలుగు నేలఁ

  రిప్లయితొలగించండి
 5. భటుడు బందిచేయు ప్రభు చదరంగాన
  నటులె భటుడు చివరికగును మంత్రి
  గడినిచేర,నేడు కలుగును మార్పెంతొ
  జనుల యోటు మహిమ సరగుగాను

  మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

  రిప్లయితొలగించండి
 6. రాజకీయచదరంగం
  ఎత్తుజిత్తుల మృదంగం
  మెత్తని కత్తుల రణరంగం
  గెలుపెవరిదో తెలియని తురంగం

  రిప్లయితొలగించండి
 7. ఎన్నికల గుర్తులే యవి ,యెన్ను కొనగ
  సిద్ధ పరచిరి బాక్సును బెద్ద లచట
  యోటు వేయగ గెలిచిరి దీ టు గాను
  చంద్ర బాబును మోడియు చంద్రు లుగద .

  రిప్లయితొలగించండి
 8. ఫలితము తెలిసే ముందర
  బలపరచెడు వార్నిపాహి పాహియనుచు నా
  ఫలితము తమపక్షంబవ
  కలిషితుడని ద్రోహి ద్రోహి కనుడనెనెదరే!

  రిప్లయితొలగించండి
 9. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  పద్యం చివర అరసున్నా ఎందుకు?
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  భావం బాగుంది. కాని ఛందస్సును వదిలిపెట్టారేం?
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మంచి భావంతో పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
  ‘తెలిసే, వార్ని’ వ్యాకరణ విరుద్ధప్రయోగాలు.
  ‘కనుడనెనెదరే’ అన్నదాన్ని ‘కనుడందురుగా’ అనండి.

  రిప్లయితొలగించండి
 10. చిత్తుగ నోడించదలచి
  ఎత్తులు వేయుదురుగాదె నెవరికి వారే!
  మెత్తని కత్తులు దూయగ
  జిత్తుల చదరంగమిదియె శివశివ గనవా!


  రిప్లయితొలగించండి
 11. శంకరయ్య గారి సూచన పై మరొకటి

  ఓట్లు కోరిన పార్టీల[పక్షాల]పాట్లు కనిన
  పదవి కొరకను విషయంబు మదికి దెలియు
  రాజకీయమే చదరపు రంగమనిన
  గెలుపు నోడుట లెవరికి తెలియ రావు

  రిప్లయితొలగించండి
 12. కరియో, కరమో, సుత్తియొ,
  శరాసనమొ. రవియొ, దళమొ, సైకిలొ, బళిరా!
  బరిలో నిలువక పోయెను
  సరసిజమే గెలిచె నహహ జనవంద్యమ్మై

  రిప్లయితొలగించండి
 13. శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. గురువుగారికి ధన్యవాదములు.
  తమరి సూచిత సవరణతో...
  ఫలితంబేమౌనోయని
  బలపరచగ రండు పాహి పాహియనుచు నా
  ఫలితము తమపక్షంబవ
  కలుషితుడని ద్రోహి ద్రోహి కనుడందురుగా

  రిప్లయితొలగించండి