నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీరు ‘నక్క’ శబ్దానికి ‘నక్కియుండగా’ అనే అర్థాన్ని స్వీకరించారా? బాగుంది మీ పూరణ. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, ‘కుంపటిలోన్ + అక్క’ అని మీ పదవిభాగమా? బాగుంది మీ పూరణ. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణ పద్యాన్ని ‘యడాగమం’ తో ప్రారంభించారు. అది ‘ఇంపగు’ అనే మొదలు కావలసింది. ‘కల + అట్టి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘కొంప కెదుట గలిగినట్టి కోష్ఠము...’ అందామా? * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు మీరు సూచించినటులే సంధి కార్యము జరుగుతుందని అక్క! అని సంబోధ చిహ్నమును వాడినాను. దయచేసి ఈ సంధి కార్యము సరియైనదేనా తెలుప పార్థన.
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, ‘అక్క!’ అన్న సంబోధనలోను, అక్కడి సంధికార్యంలోనూ ఏ దోషమూ లేదు.
సంపత్కుమార ! వ్రాయుము
రిప్లయితొలగించండి' కుంపటిలో నొక్క కుక్క కూనల నీనెన్. '
సొంపుగ వ్రాసితి చూడుము
' కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్. '
నింపగ పొట్టను తిండికి
రిప్లయితొలగించండిదుంపలు దూర్వమ్ములైన దూరము కాగా
కొంపను గల చల్లనిదగు
కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.
దుంపలు మేలుగ గాల్చెన్
రిప్లయితొలగించండికుంపటిలోనక్క, కుక్క కూనల నీనెన్
కంపల దడిలోమూలన
సొంపుగ నుండెనవిజూడ శోభను గూర్చెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంపన్నమాయె గోరిక
రిప్లయితొలగించండికుంపటిలో నక్క! కుక్క కూనల నీనెన్
ఇంపగనున్నవి చూడగ
లంపటపడి పెంచుకొందు లాలిత్యముతో.
చంపను గుక్కను నక్కెను
రిప్లయితొలగించండికుంపటిలో నక్క, కుక్క కూనల నీనెన్
పెంపుడు కుక్కయ మాయది
యింపుగ మఱి యుండె కూన లేడును జూడన్
యింపుగ దాగెను గృహమున
రిప్లయితొలగించండికుంపటిలో నక్క, కుక్క కూనల నీనెన్
సొంపుగ నక్కడ, పిల్లల
చంపి భుజించి ముదమునను, చనె జంబుకమున్
యింపగు వంటలు జేసెను
కుంపటిలో నక్క, కుక్క కూనల నీనెన్
సొంపుగ రాతిరి వేళను
కొంపకు నెదురను గలట్టి కోష్టము నందున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశ౦కరయ్య గారికి వందనములు
వెంపటి వారింటను శుని
యింపుగ నీళ్ళాడి రేయి నింటిపెరటిలో
వంపునస్నానాల గదిని
కుంపటిలో,నక్క,కుక్కకూనల నీనెన్
సంపన్నులు జాతరలో
రిప్లయితొలగించండికుంపటి వెలిగించి వండి కోలాహలమున్
నింపిరి నాడా యారిన
కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్
సంపన్నుల యింటను గల
రిప్లయితొలగించండికుంపటిలో వంటమాని కొన్నాళ్ళయ్యెన్
సొంపుగ, వంతులుగా నా
కుంపటిలో నక్క, కుక్క, కూనల నీనెన్!
గుంపులు గుంపులు దోమలు,
రిప్లయితొలగించండికొంపన దిరుగాడు పిల్లి, కోతుల మూకల్
కంపర బెట్టగ పొంచెను
కుంపటిలో నక్క ,కుక్క కూనల నీనెన్!!!
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీరు ‘నక్క’ శబ్దానికి ‘నక్కియుండగా’ అనే అర్థాన్ని స్వీకరించారా?
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
‘కుంపటిలోన్ + అక్క’ అని మీ పదవిభాగమా?
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ పద్యాన్ని ‘యడాగమం’ తో ప్రారంభించారు. అది ‘ఇంపగు’ అనే మొదలు కావలసింది. ‘కల + అట్టి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘కొంప కెదుట గలిగినట్టి కోష్ఠము...’ అందామా?
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అమ్మా! శైలజ గారూ!
రిప్లయితొలగించండినిన్నటి మీ పద్యములలో ప్రాసయతి దోషముల గురంచి నేను చేసిన సూచనలను గమనించారా?
స్వస్తి. `
ముంపుగ వానలు గురియగ
రిప్లయితొలగించండిగుంపులుగా జేరె జీవకోటుల వెన్నో
పెంపున ఆరిన నిప్పుల
కుంపటి లో నక్క,కుక్క,పిల్లలనీనెన్
మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ
రిప్లయితొలగించండిఇంపుగ చలికాలంబున
సొంపుగ వెచ్చగ తనువును సుఖముగ నుంచన్
పొంపిరి,చూడిది యౌటను
కుంపటిలో నక్క,కుక్క కూనల నీనెన్
రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండిమీరు సూచించినటులే సంధి కార్యము జరుగుతుందని అక్క! అని సంబోధ చిహ్నమును వాడినాను. దయచేసి ఈ సంధి కార్యము సరియైనదేనా తెలుప పార్థన.
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
‘అక్క!’ అన్న సంబోధనలోను, అక్కడి సంధికార్యంలోనూ ఏ దోషమూ లేదు.
పెంపుడు నక్కొక కుక్కొక
రిప్లయితొలగించండికొంపన పెరుగుచు రమించ కొక్కోకమున
న్నింపుగ రాజ్యపుటెన్నిక
కుంపటిలో నక్క, కుక్క కూనల నీనెన్
రిప్లయితొలగించండిచంపా రావే ! రావే
కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్
గంపెడు గడ్డిని తేవే !
చంపావు గద కథగట్టి ఛంద జిలేబీ :)
జిలేబి
పెంపుడు కుక్కయు నక్కయు
రిప్లయితొలగించండికొంపను వీడకయె పెండ్లి గొప్పగ నాడన్
చంపా! చూడవె కాంగ్రెసు
కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్
రిప్లయితొలగించండిఅంపయె తగిలి మతిచెడి ప్ర
కంపన లొలుక పలుకుల్ తికమక గొననకో
ట్రంపువలె నుడివితివి! యే
కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్?
జిలేబి