24, మే 2014, శనివారం

సమస్యాపూరణం – 1422 (కాకిని పెండ్లి యాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
(ఇది ఒకానొక అవధానంలో గరికిపాటివారికి ఇచ్చిన సమస్య)

21 కామెంట్‌లు:

 1. లేకయు తల్లి దండ్రులును లేక ధరించగ గుడ్డమేని పై
  లేక వసించ గూడు గతిలేకను దిండికి పొట్ట కూటికై
  లోకపు పల్లె పట్టణములోనను నిత్యము తిర్గుచున్న యే
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో.

  రిప్లయితొలగించండి
 2. నాకము నందు దేలుచును నాగరి కంబని భేషజం బునన్
  కాకలు దీరినట్టి కనకాంగి విహాయస మందు హేలగన్
  కేకయ రాజునంచు ఘన కీర్తిని ఛాటెడి డాంబికుం డ నే
  కాకిని పెండ్లియాడె నొకకన్నె విలాసిని కాకినా డలో

  ఇక్కడ " డాంబి కుండనే ...కాకి ...ఏకాకి " అనికుడ

  రిప్లయితొలగించండి
 3. Laxminarayan Ganduri గారూ మీ పూరణ చాలా బాగుంది.
  --------------------------------
  లేకయు తల్లి దండ్రులును లేక ధరించగ గుడ్డమేని పై
  లేక వసించ గూడు గతిలేకను దిండికి పొట్ట కూటికై

  రిప్లయితొలగించండి
 4. శ్రీకర సద్గుణాశ్రితుఁడు, చిత్త సరోజమునందు శ్రీహరిన్
  ప్రాకటమొప్ప నిల్పి కులవర్ధనుడయ్యును బంధు హీనుడే
  కాకి, యనాథ, పండితుఁడు. గౌరవభాజనుఁడైనవాని,నే
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో.

  రిప్లయితొలగించండి
 5. ఏకయి వచ్చినా డకట యేమని చెప్పుదు మాయమాటలన్
  మేకయి పోయినాడు గద మెల్లగ ముగ్గున దించి, యొక్క ప-
  ల్గాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో,
  నేకరు వింక నామె వ్యధ లెవ్వరు చూడగ వచ్చినన్ సదా.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. సమస్యలో "కాకిని" అని ఉంటే మీరు పల్గాకి అని పూరించుటలో సమన్వయము కొరవడినది. పలుగాకి పల్గాకి అంటారు కాని పలుకాకి పల్కాకి అని చెప్పలేము. అందుచేత మీరు మరొక ప్రయత్నము చేస్తే బాగుగ నుండును.

  రిప్లయితొలగించండి
 7. గైకొనె నవ్యకావ్య కృషి కామయ పుత్రుడు కిట్టసెట్టి ధీ-
  లోకులు మెచ్చకీర్తిగని రూఢిగనందరు జేరి బిల్వగా
  కాకియె కావ్యనామమయె ఖ్యాతిధనాదులు తూచి వర్ధిలన్
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

  రిప్లయితొలగించండి
 8. నాకము బోలు సుందరత నైజము జూపు సముద్ర తీరమున్
  పాకము గల్గు "కాజ" లకు పల్వురు మెచ్చెడు పట్టణమ్ములో
  తాకిన పెన్తుఫాను నకు తల్లిని తండ్రిని బాసినట్టి యే
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో.

  శోకము గల్గ నొక్క కవి సుంతగ మౌనమునే వహింప,నే
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో,
  నో కవులార ! కైతల సముజ్వల రీతిని బల్కుడంచనెన్
  కాకి కబుర్లు గాక ఘన కైతల సల్పగ సంతసంబనెన్

  రిప్లయితొలగించండి
 9. నేమాని పండితార్యా! అలా అయితే ఇంకా ఏకాకి కన్నా వేరే దిక్కు లేదు. ఇలా మారుస్తున్నాను.

  ఏకయి వచ్చినా డచటి కెచ్చటి నుండియొ లేక నెవ్వరున్,
  మేకయి పోయినాడు గద మెల్లగ ముగ్గున దించి, యట్టి యే-
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో,
  నేకరు వింక నామె వ్యధ లెవ్వరు చూడగ వచ్చినన్ సదా.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ మిస్సన్న గారు! శుభాశీస్సులు.
  కొన్ని సమస్యలు ఇబ్బందుల పాలు చేస్తాయి. ఈ నాటి సమస్య కూడా అంతే. కాకి గోల. మీ 2వ పద్యము బాగుగ నున్నది. 1వ పాదము చివరలో లేక యెవ్వరున్ అని యడాగమము చేద్దాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి

 11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు

  కాక నిశాటు కన్ను బలిగాదొరకొన్నపురమ్ము చెంత వ
  ల్మీకము నందు దీపముల రీతి వెలింగెడు కండ్లు పుల్లతో
  తాకెను రాచబిడ్డ నొక తాపసి కన్నులు, యంధుడాయె ను
  ద్రేకము జెంది శాపమిడ దీనత పాహి యటంచు బల్కి ని
  ర్ణేకముగా ఋషీశ్వరుని నీమము దప్పక సేవ జేయ నే
  కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడ లో
  మరియొకపూరణ:రూకలు గల్గు వర్తకుడు రూపసి నాట్యకళాభిలాషుడౌ
  యే కపట మ్మెరుంగనొక నిష్ట సఖుండు తనంత తానుగా
  నాక సుఖమ్ములిచ్చు నొక నర్తకి ప్రేమను గోరినంత నే
  కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

  రిప్లయితొలగించండి
 12. నేమాని పండితార్యా! ధన్యవాదాలు. మీ సూచనను గమనించాను.

  రిప్లయితొలగించండి
 13. కాకని చెప్పుచుండ మరి కాకని దల్చకు కాకనంగ నే
  కాకియుగాదు పేరుగన కాకరపాదుల కిట్టమూర్తి, యే
  కాకియుగూడ గాదు విన కాకని బిల్తురు నిట్టి వాని నీ
  కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

  రిప్లయితొలగించండి
 14. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  రూకలనిచ్చివేశ్యగొను రోజులుపోయెనుదేశమందునన్
  చీకటితప్పునింతులలచేసెడి రోజులుకూడచెల్లెగా
  పైకము లేక యున్నమరి పర్వుగ నుండగ,పేదయైన,యే
  కాకిని పెండ్లియాడె నొక కన్నెవిలాసిని కాకినాడలో

  పైకముకై విలాసినులు పర్వులుదీతురు లోకమందునన్
  రూకలులేని యాబ్రతుకు రోతయు పుట్టు నటంచు నెంచరే!
  చేకొనబూనిపెండ్లినొక చేడియ డబ్బుగలట్టి వృద్ధ యే
  కాకిని పెండ్లి యాడెనొక కన్నెవిలాసిని కాకినాడలొ

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న ఒక పెళ్ళికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరాను. మీ పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘తిండికి పొట్టకూటికై’ అన్నప్పుడు పునరుక్తి దోషం. ‘తిండికి పొట్టనింపగా’ అందామా?
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  చక్కని పూరణ నందించారు. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  కామయగారి కిట్టసెట్టి (కా.కి.)ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  కాకరపాదుల కిట్టమూర్తి (కా.కి.)ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘పైకముకై’ అన్నారు. ‘పైకమునకై’ సరియైన రూపం. అక్కడ ‘పైకము గోరి భోగినులు’ అందాం. ‘వృద్ధ యేకాకి’ అన్నచోట ‘వృద్ధు నేకాకిని’ అనండి.

  రిప్లయితొలగించండి
 16. ఆకలి దీర్చలేని తన యప్పయు నన్నలు పెండ్లి జేతురో
  లేక వివాహ భారమని లెక్కలు జేయుచు తప్పుకుందురో
  నాకిక పెండ్లి చేయగల నాథుడు లేడని పైకమున్న యే
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో!

  రిప్లయితొలగించండి
 17. Shankaraiah Boddu గారూ మీ సమస్యా పూరణ బాగుంది.
  -----------------------------
  ఆకలి దీర్చలేని తన యప్పయు నన్నలు పెండ్లి జేతురో
  లేక వివాహ భారమని లెక్కలు జేయుచు తప్పుకుందురో

  రిప్లయితొలగించండి
 18. Rao S Lakkaraju గారి ప్రశంసలకు ధన్యవాధములు మరియు నమస్కారములు

  రిప్లయితొలగించండి
 19. రూకలు మ్రాకుపై మొలచు రూపులు నాకడ లేవటంచు పల్
  సాకులు వల్కకుండగను; చక్కటి ముద్దిడి; తప్పులెన్ని చీ
  కాకులు పెట్టకుండగను; గంపెడు సొమ్మిడు కాలవర్ణుడౌ
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

  రిప్లయితొలగించండి
 20. రూకలు మెండుగా నిడెడి రూపసి రాగను పెండ్లియాడగన్
  మూకల నెల్లరిన్ విడిచి మూఢపు రీతిని సొల్లు సొల్లులౌ
  సాకులు చెప్పకుండగను చక్కగ నవ్వుచు నల్లనయ్యవోల్
  "కాకి"ని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

  రిప్లయితొలగించండి