4, మే 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1402 (ఓడినవాఁ డలర)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఓడినవాఁ డలర గెలిచి యొక్కం డేడ్చెన్.

20 కామెంట్‌లు:

  1. ఆడక పోయిన నయమని
    ఓడిన వాడలర , గెలిచి యొక్కం డేడ్చెన్
    వేడుక జూచిన కొందరు
    నీడగ వెంటాడి పొగడ నీరము కరుఔ

    రిప్లయితొలగించండి
  2. నేటి భారతం
    ఓడిన పార్టీ వానికి
    వేడుకగా పిలిచి పదవి పేరిమి నివ్వన్
    చేడియ జేసినది తలచి
    యోడిన వాడలర గెలిచి యొక్కండేడ్చెన్

    రిప్లయితొలగించండి
  3. వాడినవి దొంగ నోట్లని
    ఓడినవాఁ డలర గెలిచి యొక్కం డేడ్చెన్,
    మేడలు మిద్దెలు పోవగ
    బూడిదయే మిగుల,పదవి భోజ్యము గాకన్

    రిప్లయితొలగించండి
  4. ఓడిన వానిది పార్టీ
    చూడగ గెలిచెనుగ భావిజూపును పదవే
    యోడెను గెలిచిన వానిది
    యోడిన వాడలర గెలిచి యొక్కండేడ్చెన్

    రిప్లయితొలగించండి
  5. 'మూడెను నీ' కనె నొక, 'డహ
    మూడదె నీకేమి' వదరె మూర్ఖుడు, గెలిచెన్
    వీ' డోడె పక్షమ కటా
    ఓడినవాఁ డలర గెలిచి యొక్కం డేడ్చెన్.

    నీకు మూడింది అంటే నీకు మూడింది అని ఒకళ్ళ నొకళ్ళు తిట్టు కున్నారిద్దరు. ఒకడు ఓడి పోయాడు కానీ వాడి పార్టీ నెగ్గింది. ఇంకొకడు నెగ్గేడు కానీ వాడి పార్టీ ఓడి పోయింది.

    రిప్లయితొలగించండి
  6. ఆడే విధమును గన నా
    డోడిన వాడలర గెలిచి, యొక్కండేడ్చెన్
    న్నోడిన వైనము దలచుచు
    పోడిమితో నాడలేక పుడమిని గూలెన్

    రిప్లయితొలగించండి
  7. ఏడిచె సంతోషముతో
    నోడినవాఁ డలర గెలిచి, యొక్కం డేడ్చెన్
    ఓడితి నేనెట్టులయని
    సడలకు గెలుపోటములును సహజమ్మిలలో.

    రిప్లయితొలగించండి
  8. గురువులు శ్రీకందిశంకరయ్య గారికి, శ్రీ పండితనేమానిగురువర్యులకు మరియునితర కవిమిత్రులకు "శ్రీశంకరజయంతి" శుభాకాంక్షలు.

    పరమశివుండు వైదికము వంద్యముగావెలయించనెంచి శం
    కరగురునామధేయుడయి కాల్నడకన్ జని భారతావనిన్
    నిరుపమరీతి ధర్మమును నేర్పుగ నిల్పెను ధీరతన్, జగ
    ద్గురువుగ పొల్చునాతనికి దోసిలిజాచి నమస్కరించెదన్.

    రిప్లయితొలగించండి
  9. ఒకానొక అవధానములో బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మగారు శ్రీశంకరుల కవితా రీతిని ఆశువుగా వర్ణించినవిధము.................

    వరరుచిరప్రకారగుణవార్ధిసమన్వితచిత్తరీతిలో
    స్పురదరుణప్రభావపరిపూర్ణమనోహరవర్ణపర్ణమై
    నిరతనితాంతభక్తిభరణిన్ భలెతొల్కుచునున్నదైన శం
    కరగురుకావ్యఖండరసఖండమఖండము ధర్మదండమున్.

    రిప్లయితొలగించండి
  10. ఓడుట గెలుచుట కతమని
    నో డిన వాడలర గెలిచి యొక్కం డే డ్చె
    న్నో డిన నతడే తనచెలి
    కాడౌ టౌ ట మఱి గెలుపు కాకూ డనుచున్

    రిప్లయితొలగించండి
  11. జోడీయై నిలువ గురువు
    యోడిన వాడలర గెలిచి , యొక్కండేడ్చెన్
    ప్రౌఢిమ నొసంగిన గురుని
    పాడియె నోడింప ననుచు, పదుగురు మెచ్చన్ !

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. తోడగు నాప్తుడు గెలువగ
    యోడిన వాడలర, గెలిచి యొక్కండేడ్చెన్
    న్నోడిన సచివుని గనుచున్
    పాడియెనగునీ విధమ్ము భరతావనిలో

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    చూడుము పోరున రాముని
    వాడి శరము వాలి గూల్చ ప్రాణ జ్యోతుల్
    వీడి గలిసె రఘు రాముని
    యోడిన వాడలర, గెలిచి యొక్క౦డేడ్చెన్

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మల్లెల సోమనాధశాస్త్రి గారి పూరణ
    ఓడియు కర్ణుడు తల్లికి
    పాడిగ నిచ్చినపలుకుల పాలన నలరెన్
    వాడిరి యన్నని తెలియగ
    యోడిన వాడలర, గెలిచి యొక్క౦డేడ్చెన్

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నీరము కరుఔ’ అన్నదానిని ‘నీరస మెసగన్’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండింటిలోను ‘ఏడ్చె/న్నోడిన...’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మంచి పద్యాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘కతమని యోడిన, ఓడిన యతడే, చెలి/కాడౌట యెఱింగి గెలుపు...’ అనండి.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవపాదంలో ప్రాసాక్షరంగా ‘ఢ’ వేసారు. ‘పాడియె యోడింప’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ వైవిద్యంగా ఉంది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    కర్ణుడు విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ఓడిన దుర్యోధనుని
    న్నాడుచు స్వర్గమున మెండు హాయిగ నుండన్
    జూడగ ధర్మజుడనియెను:
    "ఓడినవాఁ డలర గెలిచి యొక్కం డేడ్చెన్"

    రిప్లయితొలగించండి


  18. మోడీ దెబ్బకు ఠాయని
    ఓడినవాఁ డలర, గెలిచి, యొక్కం డేడ్చెన్,
    వాడోదర నగరంబున
    గోడల్పైనన్ జిలేబి గొడవల్లవగన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి