11, మే 2014, ఆదివారం

పద్య రచన – 593 (జోలపాట)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“జోలపాట”

15 కామెంట్‌లు:

 1. లాల బోసితి కన్నయ్య లీల మాని
  పాలు ద్రావుచు నీవింక పవ్వ ళించు
  దొంగ నిద్దుర నటియించి దొరల వలదు
  జోల పాడెద ప్రియముగ వేలు పనుచు

  రిప్లయితొలగించండి
 2. జోజో నంద కుల ప్రదీప విభవా! జోజో యశోదాసుతా!
  జోజో శ్యామల కోమలాంగ కలితా! జోజో శశాంకాననా!
  జోజో సుందర మందహాస వదనా! జో జో సరోజేక్షణా!
  జోజో సర్వ శుభంకరా! యదువరా! జోజో కృపాసాగరా!

  రిప్లయితొలగించండి


 3. guruvulu nemani variki namaskaramulu

  మీ కు వచ్చిన రుగ్మత నాకు కలుగ
  మందులను వాడ తగ్గెను . మందు పేర్లు
  మీకు వ్రాయుదు వాడుడు మీరు కూడ
  తరలి పోవును రుగ్మత తనువు నుండి

  మందులను వాడుచు మరియు మరువ కుండ
  భుజమునకు ఫిజియో తెర్ఫి పూట పూట
  వైద్యు చేతను చేయించ వలయు నార్య !
  యొక్క ముప్పది దినములు చక్క గాను

  మందులు ;;;
  medrol(8)
  liryca(75)
  gemcal
  razo(20)
  flcxabanz Gel

  (daktaru salaha meraku )

  రిప్లయితొలగించండి
 4. లాలీ! ళుళుళుళు లాయీ !
  లాలీ వటపత్రశాయి రక్షణ హాయీ !
  లాలీ! యశోద లాలన
  లాలీ కౌసల్య ప్రేమ లందాలోయీ !

  రిప్లయితొలగించండి
 5. లాల బోసి తనను లాలించి నప్పుడు
  బోసినవ్వు నవ్వు పసిడి పాప
  జోల పాట పాడి జోకొట్టి నప్పుడు
  చక్కగ నిదురించు చంటి పాప

  రిప్లయితొలగించండి
 6. జోల పాటను బాడుదు జోజొ యనుచు
  నిదుర పొమ్మిక హాయిగ నీవు బిడ్డ !
  యింటి పనులను జూసుకు నిత్తు నీకు
  వేడి వేడిగ బాలను వెఱ్రి కుంక !

  రిప్లయితొలగించండి
 7. పరమానందముతోడను
  పరమాత్ముని రామచంద్రు బరమోన్నతమౌ
  యురలించెడి డోలికలో
  పెరిమిని బెట్టె బరుండగ పేర్కొనిజోలల్.

  జోజో దశరధ నందన!
  జోజో యిన వంశ తిలక జోరఘురామా!
  జో నీల మేఘ శ్యామా !
  జోజో కమలాయతాక్ష ! జో శ్రీ రామా !

  రిప్లయితొలగించండి
 8. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  'బోసి నవ్వు నవ్వు పసిడి పాప ' అను పాదములో ప్రాసయతి సరిపోలేదు.
  బోసి నవ్వు నవ్వు ముద్దు పాప అందామా?

  శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3వ పాదములో ప్రాసను మీరు గమనించ లేదు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ సుబ్బా రావు గారికి శుభాశీస్సులు.
  మీరు ప్రేమతో నా గురించి మందులు చెప్పేరు. చాలా సంతోషము. నేను ప్రస్తుతము అమెరికాలో నుంటున్నాను. ఇక్కడ మందులు డాక్టర్ సలహా మేరకే అమ్ముతారు. ఇక్కడి మందులు పేరులు వేరు. ప్రస్తుతము నాకు సమస్య తగ్గు ముఖము పట్టినది. India వచ్చిన తరువాత మీరు చెప్పిన మందులను తప్పక తీసుకొంటాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. పసులు శిశువు లెల్ల పాటను వినినంత
  ఆదమరచి వేగ మోద మందు
  భాష యేదియైన పాపల నోదార్చు
  లాలి పాట కాదె జోల పాట

  రిప్లయితొలగించండి
 11. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు.తెలిసి తొందరలో జేసిన తప్పుకు మన్నించండి.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు
  ప్రాస దోషమును సూచించిన మీకు ధన్యవాదములు. మూడవ పాద ప్రాసము సవరించి వ్రాశాను
  జోజో దశరధ నందన!
  జోజో యిన వంశ తిలక జోరఘురామా!
  జో జో సుందర వదనా !
  జోజో కమలాయతాక్ష ! జో శ్రీ రామా !

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, పండితకవిమిత్రులందఱికిని అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

  (పండిత నేమానివారిని అనుసరించుచు...)

  జోజో సూర్య కుల ప్రదీప విభవా! జోజో ఘనాభాజిరా!
  జోజో కౌశిక యజ్ఞ రక్షణ పరా! జోజో హరేశూద్భిదా!
  జోజో రావణ కుంభకర్ణ హననా! జోజో నిలింపావనా!
  జోజో రామమహీశ! చంద్రవదనా! జోజో మహీజాపతీ!

  రిప్లయితొలగించండి
 14. మిత్రులు కొందరు జోలపాట ప్రాశస్త్యాన్ని వివరిస్తే, కొందరు జోలపాటను బోలు పద్యాలనే వ్రాశారు. సంతోషం.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  నందబాలునికి మీరు జోకొట్టిన పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
  మిత్రుల పద్యాలను సమీక్షించినందుకు ధన్యవాదాలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  వటపత్రశాయికి మీరు జోలపాడిన రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  నేమాని వారికి మీరు చెప్పిన సలహా పద్యాలు బాగున్నవి. సంతోషం!
  జోలపాటపై మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పనులను జేసియు’ అనండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ లాలి పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పద్యం మూడవ పాదంలో ప్రాసను పాటించలేదు. ఆ పాదాన్ని ‘జోజో మేఘశ్యామా’ అందామా?
  మీరు చేసిన సవరణ ‘సుందరం’గా ఉంది.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. సందసవ్వడి యగురీతి సద్దు చేయకుడయ్య
  పెద్దలార! యిచట ముద్దులొలుకు
  పాపనికయి మీరు పాడగ జోలలు
  నిద్దుర విడి లేచు; నేరరొక్కొ!

  రిప్లయితొలగించండి