7, మే 2014, బుధవారం

పద్య రచన – 589

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. వంగి యున్నది వరి చేను పంట తోడ
    నిండు చూలాలు రూపుతో నీటు గాను
    కర్షకహృదయముల గల్గె కరము కాంతి
    రైతు బిద్డలే దేశపు రాజులిపుడు

    రిప్లయితొలగించండి
  2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్న గారూ,
    చక్కని ఖండిక నందించారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. సిరిమాలచ్చిమి జనులకు
    వరియే గద ముఖ్యపంట భరతావనిలో
    వరమౌనిది కర్షకులకు
    ధరలో వరిధరలు జూడ తారల నంటెన్

    రిప్లయితొలగించండి
  5. పంట చేలలో బండిన పంట జూడ
    కళ్ళు మిరుమిట్లు గొలిపెను కంకె లవియ
    రైతు లప్పుడు చేలను గోత గోసి
    తెత్తు రిండ్లకు మనసులు దేట బడగ

    రిప్లయితొలగించండి
  6. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీమతి శైలజ గారూ: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    ముఖ్య పంట అను సమాసము సాధువు కాదు. సరిజేయండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ ఖండిక చాలా బాగుగ నున్నది. అభినందనలు.
    "పుణ్యము పుచ్చగ" అనుట సాహిత్యపరముగా బాగుగనే యున్నది కానీ మార్చితే శ్రవణ సౌలభ్యము ఎక్కువగా నుండునేమో?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. నేమాని పండితార్యా! ధన్యవాదములు.
    మీ సూచనానుసారం పుణ్యము పండుట అని మారుస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  10. ఓటు వేయు వేళ నొక్క మాటను విను
    రైతు నాంధ్ర మందు రాజు జేయ
    గలుగు చేవ యున్న ఘను నెన్ను కొనుమయా
    అన్నపూర్ణ గాగ నాంధ్రభూమి.

    నేడు రైతు కంట నెత్తురోడుచు నుండె
    పెట్టుబడికి తగ్గ విలువ రాక
    అప్పు తీర్చ లేక హతజీవి తుండుగా
    నాదు కొనెడు దిక్కు లేదు లేదు.

    అన్న మిడెడు వాడె యన్నార్తు డైనచో
    మేలు గాదు మనకు, మీనమేష-
    ములను లెక్క మాని మునిగెడు రైతుల
    కంట తడిని తుడువ గలుగ వలెను.

    నవ్వుచు రైతు పట్టగను నాగలి భూమికి పుల్కలౌ గదా!
    పువ్వుగ విచ్చి సంతసపు పొంగున సస్యఫలాల నిచ్చుచున్
    నవ్వును పచ్చగా ధరణి ! నమ్ముడు, రైతును గావ రండికన్,
    బువ్వకు లోటు లేక మన పుణ్యము పండుట తథ్య మెంతయున్.

    రిప్లయితొలగించండి
  11. ముచ్చట తోడ పెంచి వరి మొక్కలు రైతులు పెద్ద జేయగన్
    వచ్చిన హోరుగాలి ఘన వర్షము పండిన చేలపై పడన్
    జచ్చిన రీతి నేలబడె సస్యము సర్వము చూచి దానినిన్
    అచ్చెరు వొందె రైతు తతి యంతయు, దైవమె దిక్కు వారికిన్

    రిప్లయితొలగించండి
  12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. హోరుగాలి వాన హుంకరింపగ వరి
    చేను వత్తిగిల్లె; చింత మిగిలె
    రైతుకు నిదె ; యేది రక్ష? పాలకులకు
    లేదు చిత్తశుద్ధి; రాదు బుద్ధి.

    రిప్లయితొలగించండి