28, మే 2014, బుధవారం

సమస్యాపూరణం – 1426 (లంచము నీయఁగోరె హరి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లంచము నీయఁగోరె హరి లక్ష్మినిఁ బొందగఁ గోరి లుబ్ధుఁడై.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఒకానొక అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది...

27 కామెంట్‌లు:


 1. వంచన జేయుటే యనగ వారిజ లోచని నీదు ధామమున్
  న్నంచిత మైన నీదుయెద నాదర మొప్పుచు నిండి తుండగా
  నించుక నైన సిగ్గనక నెవ్విధి యాసల మోసులందు నన్
  లంచము నీయగోరె హరి లక్ష్మిని బొందగ గోరి లుబ్ధుడై

  రిప్లయితొలగించండి
 2. రవీందర్ గారూ,
  మీ సూచన బాగుంది. ధన్యవాదాలు.
  మీ సూచనతో ‘ఈయఁగోరె’లో అరసున్నా టైపు చేయడం మరిచిపోయానని గుర్తించి, సవరించాను.

  రిప్లయితొలగించండి
 3. ముంచెను దేశ గౌరవము ముంచెను మానవ జాతి విల్వలున్
  ముంచెను నీతి ధర్మములు మించిన యాస్థిని కూడబెట్టగన్
  గొంచము గూడ సిగ్గు పడకుండను పొందుచు నిచ్చుచున్ సదా
  లంచము నీయ గోరె 'హరి' లక్ష్మిని బొందగ గోరి లుబ్డుడై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది.

   తొలగించండి
 4. మల్లెల సోమనాధశాస్త్రి గారి పూరణ

  ఇంచుక పారిజాత సుమ మెట్టులొనియ్యగ, రుక్మిణందగా
  పొంచియుజూచి సత్యచెలి, పొల్పుగ జెప్పెను నామెకిట్లు"తా
  లంచము నీయగోరె హరి లక్ష్మిని పొందగ గోరి లుబ్ధుడై
  కొంచెము పూవునే వెసను గొప్పగ జెప్పుచు నిచ్చెగా సఖీ"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సోమనాథ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   ‘రుక్మిణి + అందగా’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
 5. పంచను వీడి పర్వులిడు పత్నిని పెండిలి యాడ గొరగా
  కొంచెము గానె పైకమును గోరి ఋణమ్మును పొంది తీర్చగా
  కుంచము కుంచముల్ ధనము కొల్లలుగా నిడవడ్డి రూపముల్
  లంచము నీయఁగోరె హరి లక్ష్మినిఁ బొందగఁ గోరి లుబ్ధుఁడై.

  శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
  '' సామర సాక్షి ని '' అను పదము నకు బదులుగా ''సర్వ మనందగు'' అను పదము నుంచితిని .

  రిప్లయితొలగించండి
 6. కొంచెపు బుద్ధి తోడ సురకోటుల జేర్చి మహేంద్రు డిట్లనెన్
  "మించిన క్షీరసాగరము మేదిని చిల్కగ,పుట్టు వానిలో
  నెంచగగొప్ప వస్తువులవెన్నియొ వెల్వడ వాని వీడుచున్
  లంచము నీయ గోరె హరి లక్ష్మిని పొందగ గోరి లుబ్ధుడై"

  రిప్లయితొలగించండి
 7. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
  మీ సూచనకు ధన్యవాదములు. ప్రాసను గమనించనేలేదు

  ముంచెను దేశ గౌరవము ముంచెను మానవ జాతి విల్వలున్
  ముంచెను నీతి ధర్మములు ముమ్ముర మాస్థిని కూడబెట్టగన్
  గొంచము గూడ సిగ్గు పడకుండను బొందుచు నిచ్చుచున్ సదా
  లంచము నీయ గోరె 'హరి' లక్ష్మిని బొందగ గోరి లుబ్డుడై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   సవరించిన పూరణ బాగున్నది.
   మీరు గమనించనిది యతి... ప్రాసను కాదు.

   తొలగించండి
 8. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. ఎంచగ నేటి దుస్థితికి నిద్ది నిదర్శన మొక్క చోట తా
  మించిన ప్రజ్ఞతో నుడివె మెల్లగ నాధునికుండు వింటివా
  కొంచెపు బుద్ధితో నసుర కోటుల జేరగ బిల్చి చాటునన్
  లంచము నీయఁగోరె హరి లక్ష్మినిఁ బొందగఁ గోరి లుబ్ధుఁడై

  రిప్లయితొలగించండి
 10. వంచన చేయకుండ తన భార్య సులక్షణ మైన దంచు నా
  యంచిత నెంతయో పొగడి యామె యభీష్టము దీర్చువాడుగా
  పంచన చేరగా దలచి ప్రార్థన జేయుచు, దేవులాడుచున్
  లంచము నీయగోరె హరి లక్ష్మిని బొందగ కోరి లుబ్ధుడై

  రిప్లయితొలగించండి
 11. దించగ మందరంబు తను దేలిచి నిల్పెను కూర్మమై! సుధన్
  బంచగ మోహినై! ప్రభువు పంచనె జేరిరె భాగ్యమంచు నా
  మంచమె యాదిశేషుడుగ, మాధవె భార్యగ ధన్యమవ్వ! నే
  లంచము నీయఁ జూచె హరి లక్ష్మిని బొందగఁ గోరి లుబ్ధుడై?

  రిప్లయితొలగించండి
 12. సంచిత సంపదంతఁ దము సాగిన రీతిన దోచినట్టిదై
  యెంచెద రన్యులందు సిరులీ విధి నక్రమమంచు నూహలన్
  గొంచెపు బుద్ధులై పరుల గ్రుచ్చెడు వారల వాక్కులందు నీ
  "లంచము నీయఁ జూచె హరి లక్ష్మిని బొందగఁ గోరి లుబ్ధుడై!"

  రిప్లయితొలగించండి
 13. శంకరయ్య గారి సూచనపై మల్లెల సోమనాధ శాస్త్రి గారి సవరణ

  "రుక్మిణందగా " అన్నచోట ఇలా సవరించవచ్చు"రుక్మిణీసతిన్"

  రిప్లయితొలగించండి
 14. Laxminarayan Ganduri గారూ మీ పూరణ బాగుంది.
  -----------------------------------------
  ముంచెను దేశ గౌరవము ముంచెను మానవ జాతి విల్వలున్
  ముంచెను నీతి ధర్మములు ముమ్ముర మాస్థిని కూడబెట్టగన్

  రిప్లయితొలగించండి
 15. దంచగ నక్రమున్ పరుగు దండిగ పెట్టుచు పారిపోవగా
  కొంచెము సిగ్గుయున్ విడిచి కొంపను కట్టక బజ్జుకుండుచున్
  మంచము నొక్కటిన్ కొనని మందుడు నీవని తిట్టి యల్గగా
  లంచము నీయఁగోరె హరి లక్ష్మినిఁ బొందగఁ గోరి లుబ్ధుఁడై...

  రిప్లయితొలగించండి