9, మే 2014, శుక్రవారం

పద్య రచన – 591

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. దినకరు గాంతిపుంజముల తేజములో నరుసమ్ము నొందుచున్
  గనులకు విందు జేయుచు సుఖమ్ముల దేలెడు చిన్ని పిచ్చుకల్
  కను మరుగౌచునుండె కద గాలియు నీరు నశుద్ధమౌటచే
  మనుటకు వీలులేని విషమ స్థితులన్ దివి కేగుచుండుటన్

  రిప్లయితొలగించండి
 2. అపురూప మైన సృష్టిని
  నెపమెన్నక జేయుచుండు నేర్పుగ నలువే
  విపరీత మైన సొగసులు
  తపియిం చినగాంచ లేము తన్మయ మొందన్

  రిప్లయితొలగించండి
 3. ఊర పిచ్చుకల్ కనుపించు నూర్లలోన
  జంటలుగ నివశించును సంతతమ్ము
  కట్టుగూడును చక్కగా చెట్టుపైన
  పనితనమునందు సరిరావు పక్షులేవి

  రిప్లయితొలగించండి
 4. పిచ్చుక చిత్రము జూడుము
  మచ్చుకకికకానరావు మరి మన కికయున్
  పిచ్చుక లవి నశియించెను
  హెచ్చుగ వేటాడు కతన నెందరొ వాటిన్

  రిప్లయితొలగించండి
 5. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి పద్య రచన శీర్షికకు మంచి పద్యములు వచ్చినవి. అందరికి అభినందనలు.
  కొన్ని సూచనలు:

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
  మీ పద్యము బాగుగ నున్నది.
  నివశించును -- అన్నారు : టైపు పొరపాటు అనుకొంటాను.

  శ్రీ సుబ్బా రావు గారు:
  మీ పద్యము బాగుగ నున్నది.
  2, 4 పాదములను ఇలాగ మార్చుదామా?

  ...........
  మచ్చునకిక కానరావు మరి మనకు భువిన్
  ........
  హెచ్చుగ వేటాడు చుందు రెందరొ కాదే?
  (వాటిన్ - అనుట సాధువు కాదు - వానిన్ అనవలెన్).
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు సలహాలకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 7. ముచ్చటగను దిరిగెడి యీ
  పిచ్చుక లూరూర నుండు వేలకు వేలీ
  పిచ్చుకలు పెట్టు నింట్లో
  విచ్చలవిడి గూళ్ళ నూర పిచ్చుకలివియే

  రిప్లయితొలగించండి
 8. కనుమరుగవుతున్న ఊరపిచ్చుకపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  నాగరాజు రవీందర్ గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  సుబ్బారావు గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. పిచ్చుకలను చిన్నతనము
  నెచ్చటనైన కనుచుంటిమిప్పుడు నకటా!
  హెచ్చిన యాంత్రిక జీవన
  మిచ్చిన కానుక నఱుదయె నిప్పటి వేళన్.

  రిప్లయితొలగించండి