కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్.
ఈ సమస్యను పంపిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్.
ఈ సమస్యను పంపిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.
వింతగ సుతునిడె సూర్యుడు
రిప్లయితొలగించండికుంతికి; విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్
కాంతామణి పార్వతి పతి
కెంతయొ చిత్రంపు కధలు యీ భరత భువిన్
" కుంతీ పుత్ర వినాయకు
రిప్లయితొలగించండిడెం''తయు ప్రఖ్యాతి గాంచెనీ భరతభువిన్
సుంతగ పండితు డనెనట
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్
శంక రార్యుడ !మీకుగా శంకరుండు
రిప్లయితొలగించండిరుగ్మతను దరిమి యిక యా రోగ్యవంతు
జేయు గావుత !మిమ్ముల , యీ య దనున
వేడు కొం దును నేనును విశ్వవిభుని
చెంతకు జన కుజనులు కా
రిప్లయితొలగించండిసంతయినను తెలివి లేని శంకిత గురువుల్
వింతగ చెప్పుదు రిటులే
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్.
శం తనుడే గద మామయ
రిప్లయితొలగించండికుంతికి, విఘ్నే శ్వరుండు కొడుకన జెల్లున్
కంతుని శత్రువు శివునకు
నంతే మఱి యా తడౌను హరునకు పుడమిన్
సంతానము ముగ్గురు సతి
రిప్లయితొలగించండికుంతికి, విఘ్నేశ్వరుండు కొడుకన జెల్లున్
కాంత భవానికి, నామెయె
సొంతగ పిండికి నుసుఱును జొప్పించె గదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముంతెడు కల్లును త్రావియు
రిప్లయితొలగించండియెంతెంతోపలుకుచుండి యేహ్యపుగతితో
పొంతన బో నొకడిట్లనె
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకన జెల్లున్
ఎంతటి విఘ్నములైనను
రిప్లయితొలగించండిసాంతము నిర్విఘ్నములె! యసాధ్యుడు భీమున్
డంతగ లంబోదరుడై
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్
వింతగ గలిగిరి కొడుకులు
రిప్లయితొలగించండికుంతికి;విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్
కంతుని గాల్చిన శివునికి
వింతలు గతకాలమందు విరివిగజరిగెన్ !!!
మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు:
రిప్లయితొలగించండిపొంతన లేనటు లిటులను
వింతగ పలికెడు కవివర,పెద్దగనిటు లీ
రంతుల మాటలు విడు,మే?
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకన జెల్లున్
కుంతికి పతియా పాండుడు
వింతగ శంభుడును కూడవెల్గడె తెలుపై
చింతన జేయగ నీవిధి
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకన జెల్లున్
వింతగ పాండవు లేవురు
నంతము జేయరె కురుపతి యాశలనెల్లన్
ఎంత వినాయకులో గద!
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకన జెల్లున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెంతన పాండవులుండగ
రిప్లయితొలగించండిచింతించెను కుంతి కర్ణు క్షేమము కొరకై
సాంతము నెరిగియు నెట్టుల
కుంతికి విఘ్నేశ్వరుండు కొడుకన జెల్లున్?
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈ నాటి పూరణలు అన్నియును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
కొన్ని సూచనలు:
శ్రీ నాగరాజు రవీందర్ గారూ:
మీ పద్యము (1) బాగుగ నున్నది. అభినందనలు.
పద్యము చివరిలో కాముం డతడే -- అనునది స్పష్టముగా లేదు.
శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు:
మీ 2 పద్యములు బాగుగ నున్నవి.
1. కథలు తరువాత యడాగమము రాదు. ఆ పాదమును ఇలాగ మార్చుదామా?
"ఎంతయొ చిత్రంపు గాథలీ భరత భువిన్".
2వ పద్యము 3వ పాదములో స్పష్టత కొరకు ఇలాగ మార్చుదామా?
సుంతగ నొక పండితుడనె .. అని.
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
మీ పద్యము బాగుగ నున్నది.
కుంతికి పుత్రులు కర్ణునితో కలిపి నలుగురు కదా - మీరు మువ్వురు అన్నారు.
శ్రీ మల్లెల సోమనాథ శాస్త్రి గారు:
మీ పద్యములు 3 బాగుగ నున్నవి.
2, 3 పద్యములలో భావము సందేహాస్పదముగా నున్నది.
స్వస్తి.
Rama Krishna Murthy Renduchintala గారూ మీ పద్యం బాగుంది.
రిప్లయితొలగించండి--------------------
ముంతెడు కల్లును త్రావియు
యెంతెంతోపలుకుచుండి యేహ్యపుగతితో
శ్రీ రామకృష్ణా రావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
2వ పాదము మొదటలో యడాగమము రాదు. నుగాగమము వచ్చును. ఆ పాదమును "నెంతెంతో' అని మొదలిడుతూ సవరించండి.
స్వస్తి.
పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సలహాకు కృతజ్ఞతలు. భీముని కుంతీ మధ్యముడని అంటారుగద.గుర్తింపు గలిగిన ముగ్గురు కొడుకులనే లెక్కలోకి తీసుకున్నాను.
రిప్లయితొలగించండిశ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు సూచించిన 2 సవరణలు కూడా బాగుగనే యున్నవి. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినా ఆరోగ్యం మరింత క్షీణించింది. జ్వరం, ఒంటినొప్పులు, నీరసం... కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళు మండుతున్నాయి. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. మందులు వాడుతున్నాను. డాక్టర్ ఏ విధమైన పరీక్షలు చేయించలేదు... ఇది ఏ జ్వరమో చెప్పలేదు. ఆయన రాసిన మందులు వాడుతున్నాను.
సమస్యలను పూరిస్తున్న మిత్రులు...
నాగరాజు రవీందర్ గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
సుబ్బారావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
చంద్రమౌళి గారికి,
మంద పీతాంబర్ గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు.
ఇంతి సతి నలుగు పిండిన
రిప్లయితొలగించండివింతగ జన్మించినాడు - విశ్వేశునకే
ఎంతేని - జెప్పె పార్థుడు
కుంతికి - విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్.
గురువర్యా ! మీరు తగినంత విశ్రాంతి తీసుకొనండి ..మీ ఆరోగ్యము త్వరగా కుదుట బడాలని కోరుకొనుచున్నాను.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారి సవరణ సహృదయ స్వీకృతమ్.
రిప్లయితొలగించండికుంతికి పుట్టిరి కొడుకులు
రిప్లయితొలగించండికొంతయు పతి జోడు లేక కోరిక తీరన్;
ఇంతికి గౌరికి, పోలుచు
కుంతికి, విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్
పంతులు! కొడుకుర కర్ణుడు
రిప్లయితొలగించండికుంతికి;..విఘ్నేశ్వరుండు కొడుకనఁ జెల్లున్
జంతువు తలతో హిమజకు
వింతగ పుట్టెను మరింత విడ్డూరముగన్