ఎండ ధాటికి భూములు మండి పోయిభీ ట వారుట జూచుచు బెంగ తోడదడుము చుండెను నేలను దనివి దీ రచేయునది లేక రైతన్న చివరకు నిక
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బీటలు వారెను నేలయెనీటి కొరకు మొలక యెండి నీరస పడియెన్మాటలు రాని కృషీవలుడీటెలు హృది దూరి క్రూలె యేడుపు మిగలన్
సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.‘కూలె’ టైపాటు వల్ల ‘క్రూలె’ అయినట్టుంది.
మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణబీడు భూముల సరిజేసి పెద్దగానుపంట పండింప జూచెను ప్రభుత నాడు,పంట భూముల నెండించి భవన తతులనింప ప్రభుతయె రైతన్నకొంప ముంచె!
సోమనాథ శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
వానరాక కనుల వరదలు ముంచెత్తెయెండకాయ పొలము లెండిపోయెబీడు భూమి గాంచె బెంగతో రైతన్నప్రభుత సాయమంది శుభము గాంచె
రామకృష్ణ మూర్తి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.‘ముంచెత్తె/ నెండ కాయ’ అనండి.
వరుణు దయలేక వరిచేను వట్టిబోవకర్షకహృదయము శోకాన క్రాలుచుండెయన్న మిచ్చెడి రారాజు నాదుకొనుటప్రభువు జేయంగ వలసిన పరమపు విధి
సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.‘క్రాలుచుండె/ నన్న మిచ్చెడి...’ అనండి.
గుండెలు బీటలు వారగ బండెడు దు:ఖమును మ్రింగి బాధగ తనలో పండని భూమిని గాంచుచు కుండెడు గింజలకు కఱువు కూనల కిపుడున్
రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎండిన భూమిలొ పంటలు పండుట ఎటులను? మొలకలు వాడిన వయ్యోగుండెలు పగిలెను రైతుకు దండుగ చేసిన ఋణములు దండుగ బ్రతుకే !
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.‘భూమిలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘ఎండిన భూమిన్ పంటలు’ అనండి.
మండెడు యెండల ధాటికి నెండెను పొలమంత నేల నెర్రెలనిచ్చెన్ బండెడు దుఃఖము రైతుకు గుండెకు ప్రతిబింబమాయె గుర్తుగ గనుమా !
గురువుగారికి ధన్యవాదములు. టైపాటు సవరణతో పద్యం:బీటలు వారెను నేలయెనీటి కొరకు మొలక యెండి నీరస పడియెన్మాటలు రాని కృషీవలుడీటెలు హృది దూరి కూలె యేడుపు మిగలన్
ధన్యవాదాలు మాష్టారు! పద్యాన్ని ఎడిట్ చేసాను ఎండిన భూమిన్ పంటలు పండుట ఎటులను? మొలకలు వాడిన వయ్యోగుండెలు పగిలెను రైతుకు దండుగ చేసిన ఋణములు దండుగ బ్రతుకే !
ఎండ ధాటికి భూములు మండి పోయి
రిప్లయితొలగించండిభీ ట వారుట జూచుచు బెంగ తోడ
దడుము చుండెను నేలను దనివి దీ ర
చేయునది లేక రైతన్న చివరకు నిక
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
బీటలు వారెను నేలయె
రిప్లయితొలగించండినీటి కొరకు మొలక యెండి నీరస పడియెన్
మాటలు రాని కృషీవలు
డీటెలు హృది దూరి క్రూలె యేడుపు మిగలన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కూలె’ టైపాటు వల్ల ‘క్రూలె’ అయినట్టుంది.
మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ
రిప్లయితొలగించండిబీడు భూముల సరిజేసి పెద్దగాను
పంట పండింప జూచెను ప్రభుత నాడు,
పంట భూముల నెండించి భవన తతుల
నింప ప్రభుతయె రైతన్నకొంప ముంచె!
సోమనాథ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
వానరాక కనుల వరదలు ముంచెత్తె
రిప్లయితొలగించండియెండకాయ పొలము లెండిపోయె
బీడు భూమి గాంచె బెంగతో రైతన్న
ప్రభుత సాయమంది శుభము గాంచె
రామకృష్ణ మూర్తి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ముంచెత్తె/ నెండ కాయ’ అనండి.
వరుణు దయలేక వరిచేను వట్టిబోవ
రిప్లయితొలగించండికర్షకహృదయము శోకాన క్రాలుచుండె
యన్న మిచ్చెడి రారాజు నాదుకొనుట
ప్రభువు జేయంగ వలసిన పరమపు విధి
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘క్రాలుచుండె/ నన్న మిచ్చెడి...’ అనండి.
గుండెలు బీటలు వారగ
రిప్లయితొలగించండిబండెడు దు:ఖమును మ్రింగి బాధగ తనలో
పండని భూమిని గాంచుచు
కుండెడు గింజలకు కఱువు కూనల కిపుడున్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎండిన భూమిలొ పంటలు
రిప్లయితొలగించండిపండుట ఎటులను? మొలకలు వాడిన వయ్యో
గుండెలు పగిలెను రైతుకు
దండుగ చేసిన ఋణములు దండుగ బ్రతుకే !
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘భూమిలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘ఎండిన భూమిన్ పంటలు’ అనండి.
మండెడు యెండల ధాటికి
రిప్లయితొలగించండినెండెను పొలమంత నేల నెర్రెలనిచ్చెన్
బండెడు దుఃఖము రైతుకు
గుండెకు ప్రతిబింబమాయె గుర్తుగ గనుమా !
గురువుగారికి ధన్యవాదములు. టైపాటు సవరణతో పద్యం:
రిప్లయితొలగించండిబీటలు వారెను నేలయె
నీటి కొరకు మొలక యెండి నీరస పడియెన్
మాటలు రాని కృషీవలు
డీటెలు హృది దూరి కూలె యేడుపు మిగలన్
ధన్యవాదాలు మాష్టారు! పద్యాన్ని ఎడిట్ చేసాను
రిప్లయితొలగించండిఎండిన భూమిన్ పంటలు
పండుట ఎటులను? మొలకలు వాడిన వయ్యో
గుండెలు పగిలెను రైతుకు
దండుగ చేసిన ఋణములు దండుగ బ్రతుకే !
ధన్యవాదాలు మాష్టారు! పద్యాన్ని ఎడిట్ చేసాను
రిప్లయితొలగించండిఎండిన భూమిన్ పంటలు
పండుట ఎటులను? మొలకలు వాడిన వయ్యో
గుండెలు పగిలెను రైతుకు
దండుగ చేసిన ఋణములు దండుగ బ్రతుకే !