30, మే 2014, శుక్రవారం

పద్య రచన – 575

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. ఎండలు మండుచు నుండగ
  గుండును గీయించుకొన్నకుఱ్ఱడు తలపై
  నిండుగ గంధము బూయగ
  దండిగ సంతోష పడెను తనువడుచుండన్!

  రిప్లయితొలగించండి
 2. గుండున చందనము
  తల గుండు అందము
  నిండు గ ఛందము
  మెండు గ డెందము !!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. దేహ చింతవీడి దివ్యమౌ తలనటుల్
  పొల్పునిచ్చునదియె బొప్పనంబు
  చల్లగాను నుండ చందనంబలదిన
  తిరము తొలగినట్ల, దేహచింత

  రిప్లయితొలగించండి
 4. బాల భానుని బోలిన బాలకుండు
  వెంట్రుకలను స్వామికినిచ్చి వేడ్క తోడ
  చందనమ్మును శిరముపై చక్క నలది
  చిరునగవులను చిందించె చెన్ను గాను

  రిప్లయితొలగించండి
 5. చెన్ను మీరి యుండె నున్నని యాగుండు
  పిల్లవానికి ,మఱి చల్ల ద నము
  కొఱకు గంధమతని గుండు మీదన బూయ
  కనులు మూసి కొనుచు దనరు చుండె

  రిప్లయితొలగించండి
 6. భక్తి భావము మనిషిలో పాల కుండ
  బాలకది లోన, పెంచుటే చాల గొప్ప
  దాని సూచన,యిచ్చుటే తలను కురులు
  చల్లదనముల కోసమే చందనములు

  రిప్లయితొలగించండి
 7. గుండు సుఖము నున్నగుండుగ నుండును
  చల్లగుండు పూయ చందనమును
  ముఖము జూడ చిన్ని బుడతడా మాకును
  తలను బోడి జేయ తలపు గలిగె.

  రిప్లయితొలగించండి
 8. తలనీలాలను తీయగ
  వలవల మనియేడ్చుశిశువు భాధకు లోనై
  తలపై గంధము పూయగ
  కిలకిలమని నవ్వుచుండె కేరింతలతో

  రిప్లయితొలగించండి
 9. కేశ వియోగము:

  నాపైన తాపము నాట్యమాడగ లేదు
  *****కాచు నా చెలులచే కప్పి యుండ
  కుండబెట్టినరీతి కూర్చు చల్లదనము
  *****నారియల్ నూనెతో నాదు సఖులు
  వారమునకు నొక మారైనను తమతో
  *****జలకములాడించు సన్నిహితులు
  వారు నాపై నిల్వ వర్చస్సు పెరిగెను
  *****జంట వీడిన వేళ నొంటినైతి

  కేశములతోటి నా స్నేహ పాశము తెగి
  గుండు నైతి నిజము బోడి గుండునైతి
  గంధమను క్రొత్త చెలి తోడ సంధి గూర్చి
  నట్టి బాలకా! నీకు ధీర్ఘాయురస్తు!!

  రిప్లయితొలగించండి
 10. చందనమును పూసిన తన
  అందమయిన గుండు ఎంత హాయిగొలిపెనో
  డెందమునానందముతో
  సుందర మైన తనరూపు చూడగ తరమా!

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి