10, మే 2014, శనివారం

పద్య రచన – 592 (పేదవాని కోపము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
‘పేదవాని కోపము’

18 కామెంట్‌లు:


  1. పేద వాని కోపము పెదవి కి చేటు
    అది నాటి మాట మరి నేటి మాటో
    పేద 'వాణి' కోపము 'పదవి' కి చేటు
    పై వారమున ఇది తెలియును నిక్కముగా !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. పేదవాని కోపమధరపు చేటైన
    గొప్పవాని ముదము చెప్పఘనము
    మొదటి వాని జూచి కదలు సమాజమ్ము
    ధనము కల్గువాని వెనుక కదులు

    రిప్లయితొలగించండి
  4. జిలేబీ గారూ,
    మీ భావాన్ని మిత్రులెవరైనా ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మంచి ప్రయత్నం చేశారు. అభినందనలు.
    మొదటిపాదంలో యతి తప్పింది. మీనుండి సవరణ రాని పక్షంలో నా సవరణను సూచిస్తాను.

    రిప్లయితొలగించండి
  5. పేదవాని కోప మేదయ్యు పెదవికి
    చేటు గా ప లుకుట శేఖరయ్య !
    నిజము గాదు ,ప్రభుత నిలువెల్ల కూలును
    ఓటు వలన, దెలియు మోయి

    రిప్లయితొలగించండి
  6. పేద వారల కోపంబు విధిగ చేటు
    దెచ్చు వారి కటంచును యెచ్చు బోయి
    నారు ధనికుల్ గతమునందు, వారె నేడు
    గుడిసెకడకును చనుచుండ్రి కూర్మి తోడ
    పాట్లు పడుచు నుండిరి వారి యోట్ల కొరకు

    రిప్లయితొలగించండి
  7. 'పేదవాని కోపము చేటు పెదవికి'' యని
    యనిరి, వారి యాగ్రహవాణి యగ్ని సమము
    వార లేకమయిననాడు భరత దేశ
    మందు వారు కోరుకొనిన యట్లు జరుగు

    రిప్లయితొలగించండి
  8. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ఆ పాదాన్ని ‘ఓటువలన దెలియునోయి మనకు’ అందామా?
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    వారికటంచును + ఎచ్చు అన్నప్పుడు యడాగమం రాదు. ‘వారికటంచును హెచ్చు బోయి...’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శంకరయ్య గారికి నమస్తే.మొదటి పాదంలో ద-ధ లకు ప్రాస యతి చెల్లదా దయ చేసి వివరించండి ఇతే సత్యనారాయణ రెడ్ది గారిది కూడా అదే ప్రాస యతి కదా

    రిప్లయితొలగించండి
  10. రామకృష్ణ మూర్తి గారూ,
    మీరు వేసినది స్వవర్గజ ప్రాస. కొందరు లాక్షణికులు అంగీకరించారు కనుక దోషం లేదు. నేనే తొందర పడ్డాను. మన్నించండి.
    సత్యనారాయణ రెడ్డి గారిది ప్రాసయతి కాదు. ఆ పాదంలో పే-వి లకు యతి కూర్చబడింది.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ రామకృష్ణమూర్తి గారు : శుభాశీస్సులు.
    మీ పద్యములో మొదటి పాదము:
    "పేదవాని కోప మధరపు చేటైన"
    మీకు ప్రాస యతి నియమము గురించి సరియైన అవగాహన లేదు. పేద అను పదములో మొదటి అక్షరము దీర్ఘము కదా; మరి యతి స్థానములో మీరు అధ అనుటలో అ దీర్ఘము కాదు కదా. అందుచేత ప్రాస యతి వేయబడలేదు. జాగ్రత్తగా మీరు నియమములను అధ్యయనము చేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సలహాకు కృతజ్ఞతలు. ప్రాస యతి వేసి నప్పుడు ప్రాస అక్షరానికి ముందున్న అక్షరం గురువైతే ప్రస యతి స్థానము దగ్గర గూడా గురువుండాలిగదా. రామకృష్ణ మూర్తి గారు అది పాటించ వద్దా. దయతో తెలియజేయండి.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    అన్నపరెడ్డి వారూ,
    రామకృష్ణమూర్తి గారి పూరణలో నేను ద-ధ లనే గమనించాను. వాటి పూర్వాక్షరాలను నేను గమనించలేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  14. జిలేబి గారి భావాన్ని అనుసరించడానికి ఒక చిన్న ప్రయత్నం.

    పేద కోపము పృధివిని పెదవి చేటు
    ఘనులు పల్కిన మాటలు వినుడు నేడు
    పేద వాణిని వినిపింప పెద్దసభల
    వారమాగిన తెలియును ఫలితమేమొ?

    రిప్లయితొలగించండి
  15. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    జిలేబీ గారి భావానికి మీ పద్యరూపం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. పేదవానికి నిల రాదది కోపము
    వచ్చిననది నేత పదవి గూల్చు
    ననుచు జంకు జనులె యందలమునుఁ గాచు
    దారి వెదకుచుంద్రు ధరనునెపుడు.

    రిప్లయితొలగించండి