22, జులై 2015, బుధవారం

సమస్యా పూరణము - 1738 (రక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము.
(ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు)

30 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. మరణ శయ్యపై నున్నట్టి మానవునకు
   ప్రాణ దానమ్ము సేయుటే మాన వతగ
   నెఱిగి మసలుకొనుడు, ధర్మ మిదియె, కాదు
   రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు మీ సూచన ప్రకారము పద్యమును సరిచేసాను ..నా దోషములను ఎప్పటీకప్పుడు సరిచేసి మార్గదర్శకం చూపుతున్న మీకు కృతజ్ఞతలండీ.

   తొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  రోగుల-రక్తదానం రాక్షసమే :

  01)
  _____________________________

  రక్తమందున వైరస్సు - రాజుకొనెడి
  రోగకరమగు రుధిరపు - రోగులెపుడు
  తోటివారి కంటును గాన - తొలగి చనుడు
  రక్తదానమ్ము సేయుట - రాక్షసమ్ము !

  _____________________________

  రిప్లయితొలగించండి
 3. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మానవత+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘మానవతగ| నెఱిగి...’ అనండి.
  *****
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  ఒకఁ డెయిడ్స్ వ్యాధి పీడిత ప్రకటుఁ డయ్యుఁ
  దక్కు వారినిం దనవలెఁ దల్లడిల్లఁ
  జేయఁగా నెంచి వైద్యులఁ జీరి తనదు
  రక్తదానమ్ముఁ జేయుట రాక్షసమ్ము!

  రిప్లయితొలగించండి
 5. రెక్క లూపుచు తొండాన రెచ్చికరచు
  జనుల నేచుచు నారోగ్య జగతి చెరచు
  మనుజ పీడన జేసెడి మశకములకు
  రక్తదానమ్ము జేయుట రాక్షసమ్ము

  రిప్లయితొలగించండి
 6. తనదు రక్తము నీయంగ తగని దగచు
  నంటు రోగము తగిలించు ననుచు దెలిసి
  యుండి గూడను " శాడిస్టు " మొండి యగుచు
  రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము

  రిప్లయితొలగించండి
 7. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. అవసరార్థము వచ్చిన నార్త జనుల
  రుధిర మీయక పీడించి రొక్కమడుగు
  రక్తనిధి కేంద్రముల వద్ద లాభమనుచు
  రక్తదానమ్ము జేయుట రాక్షసమ్ము!

  రిప్లయితొలగించండి
 9. రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
  కాదు,పరుల ప్రాణము నిల్చు ఖచ్చితముగ
  మానవుల సేవ యే ,యిల మాధవార్చ
  నంబనుచు దాన మొసగ పుణ్యంబు నబ్బు.

  రిప్లయితొలగించండి
 10. సుఖపురోగములన్ బడి స్రుక్కుచుండి
  తాగి తందనా లాడెడి తలపుతోడ
  రక్తదానముఁజేయుట రాక్షసమ్ము
  వంచన సలిపి రోగులన్ ముంచవద్దు

  రిప్లయితొలగించండి
 11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. పుణ్య కార్యమ్మురా మంచి బుద్ధితోడ
  రక్తదానమ్ము సేయుట - రాక్షసమ్ము
  సుమ్మ నిర్లక్ష్యముగదాని సుంతయైన
  ప్రజలకుపయోగ పడకుండ పాడు చేయ

  రిప్లయితొలగించండి
 13. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. దుష్టమగు రీతి రణమున దుస్ససేను
  రక్త"పానమ్ము"సేయుట రాక్షసమన
  ముద్ర"రాక్షస"మున తప్పు ముద్రిత మయె
  రక్త "దానమ్ము"సేయుట రాక్షసమ్ము
  అచ్చు తప్పును క్షమియించు డార్యులార

  రిప్లయితొలగించండి
 15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ వైవిద్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
  నేను నా పూరణను పోస్ట్ చేద్దామనుకుంటుండగా మీ పూరణ వచ్చింది. చూడండి నా పూరణ....

  రిప్లయితొలగించండి
 16. వ్రాయమనె శిష్యుని గురువు పలకపైన
  “రక్తపానమ్ము సేయుట రాక్షసమ్ము”
  వ్రాసె గురువాక్య మిట్లు పరాకున విని
  “రక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము”

  రిప్లయితొలగించండి
 17. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  రక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము
  గాగ దలుపగ వలయును,కర్మభూమి
  కుష్టు, బొల్లి, యెయిడ్సు తో కుందువారు,
  రక్త కేన్సరు గలవారు యుక్తమదియె.

  రిప్లయితొలగించండి
 18. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. అన్న,వస్త్ర,భూ,గోదానమున్న?మిన్న
  సాటి మానవాళి కొసగు సమయమందు
  రక్త దానంబు సేయుట.”రాక్షసమ్ము
  రోగకారకక్రిములున్న-రక్తమివ్వ”

  రిప్లయితొలగించండి
 20. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గురుదేవులు శ౦కరయ్య గారికి
  నాపద్యము మీకు నచ్చినందుకు ధన్యవాదములు.మీపూరణ కు
  అభినందనలు

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
  గాదలచవలదు మదిన కరుణతోడ
  సాటివారిని గాపాడ సత్వరముగ
  దానమీయగ బుణ్యంబు శోణితమును!!!

  రిప్లయితొలగించండి
 24. శ్రీ శంకరార్యా
  చిన్న సందేహం. కొండపై బస్సు పద్యంలో ఉమాదేవిగారి పద్యంలో దర్శనముకు తప్పు దర్శనమునకు కరెక్ట్ అన్నట్లే పలకపై అని కాక పలకముపై అని వ్రాయాలా?

  రిప్లయితొలగించండి
 25. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  ‘కి-కు’ ప్రత్యయాల ప్రయోగాలు....
  అ) ఇ,ఈ,ఐ అంతమందున్న శబ్దాలకు ‘కి’ వస్తుంది. ఉదా. హరికి, తరుణికి, బావిలీకి, రైకి. (నీ,మీ లకు కి రాదు. నీకు, మీకు).
  ఆ) అ,ఆ,ఎ అంతమందున్న శబ్దాలకు ‘కు’ వస్తుంది. ఉదా. పలకకు, బాబాకు, కన్నెకు.
  ఇ) ఉ,ఋ అంతమందున్న శబ్దాలకు ‘కు’ పరమై దానికి ముందు ‘న’ ఆగమంగా వస్తుంది. రామునకు, విధాతృనకు.
  ఇక ఫలకము తత్సమము. దానికి ఫలకమునకు, ఫలకముపై అని ప్రత్యయాలు చేరుతాయి. ‘పలక’ తద్భవము. దానిని పలకకు, పలకపై అని ప్రత్యయాలు చేరుతాయి.

  రిప్లయితొలగించండి
 26. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మదిని’ అనండి. ఇకారాంత శబ్దాలకు ద్వితీయావిభక్తిలో ‘ని’ ప్రత్యయం చేరుతుంది.

  రిప్లయితొలగించండి
 27. శ్రద్ధ లేకుండ వాహనచాలకులును
  దారి నడిచెడి వారిని దారుణముగ
  గుద్ది,యాసుపత్రిని జేర్చి,గొప్పగాను
  రక్తదానమ్ము జేయుట రాక్షసమ్ము

  మేదినందున మనకగు మేలుచర్య
  రక్తదానమ్ము చేయుట-రాక్షసమ్ము
  దారియందున క్షతగాత్రు,దారుణముగ
  వదల-పరిచర్య చేయుటే భవ్యమగును

  రక్తదానంపు శిబిరాలు రమ్యమగును
  తాము రక్తమ్ము చేయక దానమచట,
  నితర మనుజులు రక్తమ్మునివ్వగాను
  రక్తదానమ్ము చేయుట రాక్షసమ్ము

  దయయు లేకుండ రక్తమ్ము ధరకునమ్మి
  తాము పొందంగ వ్యసనమ్ము దానివలన,
  రక్తదానమ్ము చేయుట రాక్షసమ్ము
  దయను పొందినయపుడేను దానమగును

  రిప్లయితొలగించండి
 28. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి