7, జులై 2015, మంగళవారం

పద్య రచన - 953

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27 కామెంట్‌లు:

  1. రంభా యూర్వసి మేనక
    సంభా వించగ నీకు సాటెవ రంచున్
    అంబర మంటిన యందము
    సంబర ముగజూచి నంత సౌరులు కురియున్

    --------------------------------------
    వడ్డాది పాపయ్య చిత్రము
    నొడ్డోల గమునందు గనిన నోహో యనగన్
    వడ్డాణపు సొగసు తరుణుల
    కడ్డము లేదంచు కుంచె గగనపు వీధిన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘రంభయు నూర్వశి...’ అనండి. రెండవపాదంలో గణదోషం. ‘సాటి+ఎవరు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘సంభావింపంగ నీకు సాటియె లేరే| యంబర మంటిన...’ అనండి.
    రెండవపద్యం మొదటి మూడుపాదాలలో గణదోషం. ‘వడ్డాది పాపయ పటము| నొడ్డోలగమందు గనిన నొహొ యనరే| యొడ్డాణపు సొగసు సతుల...’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. పాపయ్య బొమ్మ జూడుడు
    గోపయ్యే వెనుకనుండె, కోమలి గనియెన్
    దీపమునే వెలిగించుచు
    నాపకుమా కృష్ణ వేణు నాదమ్మనియెన్.

    రిప్లయితొలగించండి


  4. ఆ.వె:నడుము లోన హొయలు నగవుతో కెమ్మోవి
    తలచినంత చాలు తరుణి రూపు
    కంటి చూపు లోనె కైపును గలిగించు
    నాతిఁబొగడ తరమె నలువ కైన

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. రంభ యనుకొంటి మరినిన్ను రామ ! నేను
    భువికి వచ్చి న భూలోక పొలతి వైన
    నీదు సొగసుద నమునకు నెమ్మి తోడ
    పలుకు చుంటిని జోహార్లు భామ ! నీకు

    రిప్లయితొలగించండి
  7. ఘనుడు వడ్డాది పాపయ్య కరము మహిమ?
    కాక నాతని చిత్రంపు కలము గరిమ?
    బ్రహ్మ మత్సర గ్రస్తుడౌ ప్రజ్ఞ గాదె!
    వందనాలయ్య పాపయ్య వంద సార్లు

    వర్ణ శోభితంబరయ సౌవర్ణ శోభి
    తంబు, రేఖల సోకులు తరచి జూడ
    మెరుపుతీగెల మేలిమి మించు కొసలు
    కనుల నార్పదరమె దాని గాంచు నపుడు

    రిప్లయితొలగించండి
  8. గోపాలా! నీ మ్రోలన్
    దీపము వెలిగించుచుంటి దీనదయాళా!
    చూపుమయా నీదు దయని
    పాపయ్య నగాసు దెల్పె ప్రహ్లాదముగన్!!!

    నగాసు = చిత్రము

    రిప్లయితొలగించండి
  9. చిన్నగ నవ్వు మోవియును చెన్నులనిమ్మడజేయు కన్నులున్
    సన్నని సూటి నాసికయు చక్కదనమ్ముల చెక్కుటద్దముల్
    పన్నగమంటి వాలుజడ బంగరు వన్నెలనీను గాత్రమున్
    కన్నియకిచ్చె బ్రహ్మ తన కందువజూపెడు కాంక్షమీరగన్

    రిప్లయితొలగించండి
  10. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘భూలోకపొలతి’ అనడం దుష్ట సమాసం. ‘భూలోక ముగ్ధవైన’ అందామా?
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘కాక యాతని’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దయని’ కాదు... ‘దయను’ అనండి.
    *****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
    ‘వంటి’ని ‘అంటి’ అన్నారు. ‘పన్నగమైన వాలుజడ...’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  11. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం చిత్రమంత అందంగా ఉంది. అభినందనలు.
    ‘మనసును+ఉయ్యాల’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘మెల్లగ హృదయమ్ము|నుయ్యాల లూపెడి...’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. ఫద్యరచన ;వడ్డాది వారి సుందరి
    సొమ్ము లలంక రించు కొని సోకులు జూపెడి వన్నెలాడి! దీ
    పమ్మును సంజ వేళ పరి భాసిల జేసి మురారి కై ప్రతీ
    తమ్ముగ వేచి యున్న చరితార్ధవు రాధవు గావొ? వేణు గా
    నమ్ము విన౦గనౌను యిక నాథుని జాడ నెరు౦గ జాలకన్

    రిప్లయితొలగించండి
  13. దీపము వెట్టి యో రమణి! దిక్కుల వెల్గగఁ జేయుచుంటివో,
    యే పని నున్ననైన, పతి యింటికి నెప్పుడు వచ్చునోగదా,
    పాపమటంచు వేచితివొ! భాగ్యపు రాశిగ, దీపమీవుగా ,
    చూపుల నవ్వువెల్గులను సొత్తుగ గల్గిన సుందరాంగివై,
    తాపముఁ దీర్చి శాంతమది దక్కగ భర్తకు నిల్చియుంటివో!

    రిప్లయితొలగించండి
  14. దీపము వెట్టి యో రమణి! దిక్కుల వెల్గగఁ జేయుచుంటివో,
    యే పని నున్ననైన, పతి యింటికి యెప్పుడు వచ్చునోగదా,
    పాపమటంచు వేచితివొ! భాగ్యపు రాశిగ, దీపమీవుగా ,
    చూపుల నవ్వువెల్గులను సొత్తుగ గల్గిన సుందరాంగివై,
    తాపముఁ దీర్చి శాంతమది దక్కగ భర్తకు నిల్చియుంటివో!

    రిప్లయితొలగించండి
  15. యవ్వన భావాలు-రువ్వెడియందమా
    -------కళ్ళ కాంతుల చేత కసరుటేల?
    నల్లనిజడయందు మెల్లగ మల్లియల్
    ------తొంగిచూడగలుగు రంగమేల?
    నుదుటిపాపిడి బొట్టు-నెదుటియూహలు దట్టు
    ------జడబిళ్ళగనుపించు జనుల కేల?
    తెల్లటి చీరేల?మెల్లగహృదయమ్ము-
    --------నుయ్యాలలూపెడి యునికి యేల?
    కట్టు,బొట్టు జతగ కాటుక కళ్ళతో
    పట్టుదప్ప నట్టి ఫైట నుంచి
    అతివయందమంత మితముగ బంచుట?
    తెలుగు,వెలుగు మగువ దెలుపనెంచి|

    రిప్లయితొలగించండి
  16. అందము లంటియున్న మరియాదను సాకెడి చీరకట్టుతో
    కుందన బొమ్మలా మెరియు కూర్పుల నేర్పున?జ్వోతివెల్గులో
    పొందికలందు పుట్టుకకు పోకడ నిల్పెడి యవ్వనంబుకున్
    సుందరి చూపు లెంచగ?వసుందర యందున లేరులేరికన్|

    రిప్లయితొలగించండి
  17. దీపపు కాంతిలో యవతి దివ్యముగా వెలుగొందుచున్న దా
    రూపసి కందమబ్బెడు స్వరూపమునిచ్చన బ్రహ్మదేవుడా
    చూపు మరల్చలేని తన సోయగమంతయు చూడముచ్చటౌ
    నాపక సృస్టిచేయుమిక నందముచిందెడు హౌసుకత్తెలన్!

    రిప్లయితొలగించండి
  18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కుందనపు బొమ్మ’ అనడం సాధువు.

    రిప్లయితొలగించండి
  19. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. వంటింటిఁ దీర్చి దిద్దుచు
    కంటికి రెప్పైతనయులఁ గాచుచు, పతికిన్
    వెంట యనుకూలవతియన
    నింటికి నిల్లాలె దీప మీజగతిఁ గనన్!

    రిప్లయితొలగించండి
  21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. చంద్ర బింబ మంటి చక్కని నగుమోము
    కలికి కన్నులందు వెలుగు లేమొ
    దీప కాంతి మించి దేదీప్య మానమై
    దీప్తి నొసుగు చుండ దీపమేల?

    రిప్లయితొలగించండి
  23. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వంటి’ని ‘అంటి’ అన్నారు. ‘చంద్రబింబము సరి/ చంద్రబింబ మైన’ అనండి.

    రిప్లయితొలగించండి
  24. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. చంద్ర బింబ మంటి చక్కని నగుమోము
    కలికి కన్నులందు వెలుగు లేమొ
    దీప కాంతి మించి దేదీప్య మానమై
    దీప్తి నొసుగు చుండ దీపమేల?

    రిప్లయితొలగించండి
  26. చక్కని రూపురేఖలును సన్నని మధ్యము వేణీ భారమున్
    చెక్కిలిసోయగమ్ముఁగన చిక్కును మానస మంబుజాక్షిపై
    నెక్కడి ముద్దుగుమ్మ! కరమింపుగ దీపముఁబెట్టుచుండె తా
    మక్కువ తోడుతన్ మదిని మాధవుఁదల్చుచు మోద మొందుచున్

    రిప్లయితొలగించండి