31, జులై 2015, శుక్రవారం

పద్య రచన - 975 (గురుపూజ)

కవిమిత్రులారా,
గురుపూర్ణిమ శుభాకాంక్షలు!
ఈనాటి పద్యరచనకు అంశం....
గురుపూజ

21 కామెంట్‌లు:

  1. గురువు దైవము ,తండ్రియు గురువు మాత
    యన్ని రంగాల యందున మిన్న యతడు
    సాటి యుండరు పుడమిని సద్గురు వున
    కార్య ! వందనం బులుసేతు వయ్య ! మీకు

    రిప్లయితొలగించండి
  2. పద్య రచనా విధానంబు బరగఁజేసి
    మెళకువలనెల్ల నేర్పెనమేయరీతి
    మీదు కరుణాకటాక్షమ్ము మాదు విద్య
    కంది శంకరార్యులకు మా వందనమ్ముల.

    రిప్లయితొలగించండి
  3. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వందనమ్ములుసేతు నయ్య’ అని ఉండాలనుకుంటాను.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. గురుపూజందున శాంతమున్,సుఖము.నాక్రోశంబు దగ్గించు|నీ
    వరమై,జీవన యాన మార్గమయి|సంపాదించులౌఖ్యంబునే
    మరువన్ జాలని మానవత్వమును,సన్మార్గంబు జూపించుగా|
    శరణంబందునగల్గు విద్య|తగు విశ్వాసానసేవించగా|
    [కందిశంకరయ్య కమతము నందున
    పద్య పంట లందు పండజేయ?
    భావ భాగ్య ఫలము జీవన మార్గమౌ|
    గురువు పంట నెపుడు మరువ తరమ?

    రిప్లయితొలగించండి
  5. సోదర సోదరీ మణు లందరికీ గురుపూర్ణిమ శుభా కాంక్షలు
    ----------------------
    తల్లియు తండ్రియు గురువులు
    వెల్లువగా బుద్ధి నిచ్చు వేల్పు లనంగా
    చల్లని కరుణా మృతమది
    చెల్లించగ కొలత లేదు సేవల కంటెన్

    రిప్లయితొలగించండి
  6. గురువన?దివ్యశక్తి|మనకోర్కెలు దీర్చెడియుక్తి|మార్గముల్
    దరుగక జేయురక్తి|పరితాపము మాన్పెడిభక్తి|భావనల్
    వరముగ బంచుముక్తి|పరివారమునెంచగభుక్తి|నెంచగా
    అరుదుగనబ్బు సక్తి|తనువంతర మందున లక్ష్య సిద్ధియే|

    రిప్లయితొలగించండి
  7. గురుదేవులకు కవిమిత్రులకందరకూ గురుపౌర్ణమి శుభాకాంక్షలు

    పాటించఁదగెడు వాక్కుల
    మేటిగ వచియింప గల్గు మేధావులిలన్
    నేటికి గురుమూర్తులు! జవ
    దాటకనె నమస్కరించి ధారుణి నడతున్!

    రిప్లయితొలగించండి
  8. గురువులు సకలజనులయా
    దరువులు విజ్ఞానఖనులు ధరణిన కదలే
    సురులు సుచరితులు పావన
    గురుచరణమ్ముల మరువక కొలిచిన ఘనమౌ

    రిప్లయితొలగించండి
  9. గురువుగారికి నమస్కారములు
    ముందుగా గురుపూర్ణిమ శుభాకాంక్షలు
    మీ ఆరోగ్యము ఎలా వుంది మంచిగా వేళప్రకారము మందులు తీసుకోగలరని విన్నపము గురువుగారికి ఈ రోజు ప్రత్యక్షంగా పాదాభివందనముల నొనర్చలేక పోతున్నందుకు బాధపడుతున్ననూ మీ దీవెనల నర్థిస్తూ మీ వి. యస్ .ఆంజనేయులు శర్మ

    రిప్లయితొలగించండి
  10. ఒక విధంగా సందర్భం కాకపోయినా ఒక అద్భుత సమస్యాపూరణాన్ని శంకరభరణం బ్లాగులో ప్రస్తావించటం సముచితం అన్న అభిప్రాయంతో ఈ మాటలు వ్రాస్తున్నాను.

    ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున అన్న సమస్యకు, ఇది శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు చేసిన పూరణ


    సీ. దుర్యోధనుని కంటె దుర్యోగవశుఁ డౌచు బ్రాహ్మ్యమ్ము వీడి క్షాత్త్రమ్ము నూనె
    రాధేయు కంటె దురాధేయుఁడై నిరాయుధుపైని నాయుధ ముద్ధరించె
    దుశ్శాసనుని కంటె దుశ్శాసనుం డయి నిశ్శాత్రవతఁ దక్కె నిష్క్రియముగ
    శకుని కంటెను నపశకునాక్షదక్షుఁడై ధర్మపక్ష ముడిగి దాయఁగాచెఁ

    తే. జాపగురుఁ డయ్యు న్యాయ్యమ్ముఁ జాపఁజుట్టి
    వ్యూహములు వన్నె నీతినిర్వ్యూహకముగఁ
    గీడు మొత్తముఁ దా నయి; లేఁడు గాని
    ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున

    ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున అన్న సమస్యకు, ఇది శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు చేసిన పూరణ

    ఈ సమస్యనూ అద్బుతమైన వారి మరొక చాటుపద్యాన్నీ కూడా మీరు ఈమాటపత్రికలో http://eemaata.com/em/issues/201507/7031.html లింకులో చదువుకొని ఆనందించగలరు.

    రిప్లయితొలగించండి
  11. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ******
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    'కదలే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'ధరణిఁ గదులు నా...' అనండి.
    *****
    తాడిగడప శ్యామల రావు గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. రాయి వంటి మనిషి రత్నమై వెలుగును
    గురువు బోధ తోడ కరము వేగ
    శంకరయ్య గారు శంకలఁదీర్చచు
    తీర్చి దిద్దె మమ్ము తీరుగాను

    రిప్లయితొలగించండి
  14. కం.గురుడన గురుండుసద్గురు
    డుర, గురుతెరుగుముగురువెపుడుగురుడెగురుడా!
    గురికలగుణమునగూచుని
    గురిపించునుగుప్తమైనగుణముల నెన్నో .

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె:గురువు లేని విద్య గుడ్డివిద్యందురు
    గురువు బోధ యున్న గురుతు యుండు
    గురువు కరుణ యున్న కురియును వరములు
    యిలను గురువు యున్న బలము గలుగు.

    రిప్లయితొలగించండి
  16. ఆ.వె:గురువు లేని విద్య గుడ్డివిద్యందురు
    గురువు బోధ యున్న గురుతు యుండు
    గురువు కరుణ యున్న కురియును వరములు
    యిలను గురువు యున్న బలము గలుగు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ కంది శంకరయ్య గురువరులకు గురు పౌర్ణిమ శుభాకంక్షలతో ....
    గురువే తెలివికి గుర్తగు
    గురువే గుర్తించు తప్పు గురువే దిద్దున్
    గురువే చూపును వెలుగును
    గురు పౌర్నిమ నేడు జేతు గురువుకు నతులన్.





    రిప్లయితొలగించండి
  18. పదములమ్రొక్కి దీవనల భాగ్యముఁ బొందగలేకపోతి , నే
    సదమలమైన పల్కులను సమ్ముఖమందున నాలకించి, స
    మ్ముదమునుఁ బొందనైతి, నొక పోలిక లేని సభాంగణమ్మునం
    దదె కొఱ నా మనంబు, నసహాయత నుంటి, మరేమి చేయుదున్?

    ఛందశ్శాస్త్ర చర్చలో గురువుగారు అస్వస్థత కారణంగా పాల్గొనలేరన్న కొఱత శిష్యులమైన మాది.

    రిప్లయితొలగించండి