1, ఆగస్టు 2015, శనివారం

సమస్యాపూరణ - 1748 (జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

36 కామెంట్‌లు:

  1. మరణము గోరుచు మనమున
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్
    కరుణించి నదైవ మతనికి
    వరమిచ్చెను రుజను వీడి వాసిగ బ్రతుకన్




    రిప్లయితొలగించండి
  2. అరకొర వైద్యము తెలిసిన
    నరుడొక్కడు మందునిచ్చి నరకము జూపన్
    మరణమె మేలని తలచిన
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్

    రిప్లయితొలగించండి
  3. .కం:అరనిమిషంబైన చెలిని
    మరువక వెంబడి దిరుగుచు మదిలో వెతతో
    తరుణిని గనలేక మదన
    జ్వర పీడితు డొకడు గోడ జయ్యన దూకెన్
    .కం:సరియైన చికిత్స యులే
    కర కొరవైద్యంబు తోడ కస్తిం బడుచున్
    పరిపరి విధముల తిరుగుచు
    జ్వర పీడితు డొకడు గోడ జయ్యన దూకెన్
    కం:కరుణను జూపక ప్రేయసి
    తిరిగైననుచూ డకున్న తిప్పలు బడుచున్
    గిరగిర దిరుగుచు కామ
    జ్వర పీడితుడొకడు గోడ జయ్యన దూకెన్.

    రిప్లయితొలగించండి
  4. నిరతము ప్రేయసి తలపులు
    మరిమరి మనసును దహించ మక్కువ డరగా
    స్థిర చిత్తముతో విరహ
    జ్వరపీడితుఁడొకఁడు గోడఁజయ్యన దూకెన్

    రిప్లయితొలగించండి
  5. సరసానికి కామ జనిత
    జ్వరపీడితుఁడొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్!
    కొరగాని పనిన్ జేయన్
    విరిగెన్ దన కాలుఁ జేయి వేదన మిగిలెన్!

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులతో...

    (లంఘనమన్న పదమునకున్న నానార్థముల నెఱుఁగమి నేర్పడిన యనర్థము)

    జ్వరమునకు లంఘనమ్మే
    పరమౌషధ మనఁగ వినియు వైళమ చనియున్
    సరసత నెఱుఁగక మూర్ఖుఁడు
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్!

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యీ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. 'కరుణించి దైవ మతనికి' అనండి.

    రిప్లయితొలగించండి
  8. వరుసగ యాషాఢమ్ములు
    తరుణిని దూరమ్ముజేయ తాపము పెరిగెన్
    విరిబోణి కొరకు మదన
    జ్వరపీడితుఁ డొకఁడు గోడ జయ్యన దూఁకెన్

    రిప్లయితొలగించండి
  9. విరహము తోడన నొగులుచు
    జ్వర పీడితు డొకడు గోడను జయ్యన దూకె
    న్నిరవుగ గలియుట కొఱకై
    పెరవలి సీతమ్మ దనను బ్రేమించంగన్

    రిప్లయితొలగించండి
  10. సరసమునకు చేరఁ బిలిచిన
    విరిసిన మందారమైన వెలదిని జేరన్
    పరుగిడి పోవగ మదన
    జ్వరపీడితుఁడొకఁడు గోడ జయ్యన దూఁకెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరసముగ జేర బిలిచిన
      విరిసిన మందారమైన వెలదిని జేరన్
      పరుగిడి పోవగ కామ
      జ్వరపీడితుడొకడు గోడ జయ్యన దూకెన్

      తొలగించండి
    2. సరసముగ జేర బిలిచిన
      విరిసిన మందారమైన వెలదిని జేరన్
      పరుగిడి పోవగ కామ
      జ్వరపీడితుడొకడు గోడ జయ్యన దూకెన్

      తొలగించండి
  11. విరహార్తు౦డగు నూతన
    వరుడాషాడమున వధువు ప్రసువు గృహముకు
    న్నరుగగ సైచక మదన
    జ్వరపీడితుఁడొకఁడు గోడ జయ్యన దూఁకెన్

    రిప్లయితొలగించండి
  12. కరణము క్రుంగి కృశించగ
    మరణమ్మే మేలటంచు మదిని తలచుచున్
    స్థిరనిశ్చయమున నంగ
    జ్వరపీడితుఁడొకఁడు గోడఁజయ్యన దూకెన్
    కరణముః శరీరము
    అంగజ్వరముః క్షయ

    రిప్లయితొలగించండి
  13. తరుణిన్ బొందుట కొఱకై
    తెరువేదియు గానలేక తీవ్రతరంబౌ
    విరహము దహించ కామ
    జ్వరపీడితుఁడొకఁడు గోడ జయ్యన దూకెన్.

    రిప్లయితొలగించండి
  14. తరగని మోహము మదిఁ ము-
    ప్పిరిగొన జనె తులసి కుంభవృష్టిని రాత్రిన్
    బిరబిర సతిదరి వలపు
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

    రిప్లయితొలగించండి
  15. హరినామ స్మరణ మందున
    పరిసరములు కానరాని భక్తియు గలుగన్?
    శరణాగత హరినీవను
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    1)చెరవిడిన మృగము కైవడి
    పరుగెత్తెడి కీచకుండు పరకాంతలకై
    నిరతము నెమకెడి కామ
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.
    2)గిరిజనుడు రుజను గాంచక
    తిరుగగ గాత్రమున కాక తీవ్రము కాగా
    యెరుగక సూదుల మందును
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

    రిప్లయితొలగించండి

  17. శ్రీగురుభ్యోనమ:

    తఱచుగ పథ్యము లుండగ
    మురిపించెడు విందు జూడ మోహము కలుగన్
    మరి వైద్యు డడ్డు చెప్పగ
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

    రిప్లయితొలగించండి
  18. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో "వరుసగ నాషాఢమ్ములు.." అనండి.
    మూడవపూరణ మొదటిపాదంలో గణదోషం. "సరసముగ జేర బిలిచిన" అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మూడవపాదంలో గణదోషం. "తరుణిఁ గనలేక మదన|జ్వర..." అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో "మక్కువ యడరన్" అనండి.
    *****
    గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదం చివరి "త" గురువై గణదోషం. "సరసమున కామజనిత|జ్వర..." అనండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "గృహమునకై" అనాలి. అక్కడ "ప్రసువింటికి తా| నరుగగ" అనండి.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "వలపు జ్వర"మన్నప్పుడు "పు" లఘువే. "వలపున్ |జ్వర...' అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. "హరినామ స్మరణమ్మున" అనండి.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ కామజ్వరము లాగ వలపుజ్వరము కాదా?

    రిప్లయితొలగించండి

  20. నిన్నటి సమస్యతో సహా ..
    భరత ధరిత్రి హైందవులు బాధలు దూరము జేయునంచు
    శ్రీ హరికరుణా కటా క్షమునకై తపియింతురు, క్రై స్తవుల్ సదా
    పరమ పవిత్రుడైన ప్రభువా! యని యేసును వేడుకొందు రా
    తురకలు జేతుర బ్బురముతోడ నవాజు సదా రహీముకున్.

    కరమొప్పు యవన యువకుడు
    మరులుప్పొంగగ నటునిటు మతి చెడి వీథుల్
    తిరుగుతు నిత్యము కామపు
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

    రిప్లయితొలగించండి
  21. సరసమున కామజనిత
    జ్వరపీడితుఁడొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్!
    కొరగాని పనిన్ జేయన్
    విరిగెన్ దన కాలుఁ జేయి వేదన మిగిలెన్!

    రిప్లయితొలగించండి
  22. ఛందశ్శాస్త్రము రీతుల గురించి, లోతుల గురించి చక్కటి ఉపన్యాసము జరిగింది. శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారు శ్రమకోర్చి వచ్చి ప్రసంగించినందుకు సభికులందరూ చాలా చాలా సంతోషించారు.
    ఆడియో రికార్డ్ జరిగింది. ఒక వారంలోపల ఛందస్సు గ్రూప్ లో అప్లోడ్ చెయ్యడం జరుగుతుంది.
    ముప్ఫై నుంచి నలభై వరకూ ఉన్న సభికుల్లో ఎక్కువభాగం శ్రద్ధగా ప్రసంగం ఆలకించారు. ఇద్దరు ముగ్గురు సందేహాలను అడిగి తీర్చుకున్నారు.
    ప్రసంగంలో భాగమైన గర్భకవిత్వానికి అప్పటికప్పుడు ఉదాహరణగా వక్తకు కృతజ్ఞత చెప్తూ Chinta Rama Krishna Rao గారు ఒక తేటగీతి, కందం ఇమిడి ఉన్న ఉత్పలమాలను ఆశువుగా వ్రాసి చదివి వినిపించారు.
    కార్యక్రమ నిర్వాహకులైన Jyothi Spreadinglight , Ramu itikyal, prithvi, projector ఇచ్చి సహకరించిన Srinivas Udumudi గారికీ, సభను ప్రారంభించిన Kasturi Sudhimati
    పరిచయవాక్యాలు చెప్పిన Dileep Miriyala గారికీ ,
    శ్రద్ధగా పాల్గొన్న సభికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
    లక్ష్మీదేవి.

    రిప్లయితొలగించండి


  23. కొరివి పిశాచము పట్టెను
    చురుకుగ వదిలింతునేను చూడుండనుచున్
    మరివీపుననే మోదగ
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్.

    రిప్లయితొలగించండి
  24. గురువుగారికి నమస్సులు.

    శ్రీమతి లక్ష్మిదేవిగారు చెప్పినట్లుగా చందశ్శాస్త్రము గురించి సుదీర్ఘంగా శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారు ప్రసంగించినారు. ఎన్నెన్నో క్రొత్తవిషయాలను తెలుసుకొనే అవకాశము కల్పించినందుకు కార్యనిర్వాహకులకందరికి పేరుపేరునా ధన్యవాదములు. శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారు చేసిన పరిశోధనలు, క్రొత్త వృత్తాలను సృష్టించడములో మెళకువలు బహుధా ప్రశంసనీయము.

    ఈ కార్యక్రమము ద్వారా పెద్దలు గురుతుల్యులైన శ్రీ చింతా రామకృష్ణరావుగారి, శ్రీమతి లక్ష్మీదేవిగారి, శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయనరెడ్డి గార్ల ముఖపరిచయము చాలా ఆనందాన్ని యిచ్చినది.

    ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అభిలషిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  25. బిరబిర సంపన్నుడవగ
    దొరతనమునగాక నొకడు,దొంగగ మారెన్
    వెఱపెరుగక తా,లక్ష్మీ
    జ్వర పీడితుడొకడు గోడ జయ్యన దూకెన్

    పరకాంత నొకతె నందగ
    తరుణమునకై చూచుచుండి,తానములాడే
    తరుణినిగని కామమునన్
    జ్వర పీడితుడొకడు గోడ జయ్యన దూకెన్

    ఎఱుగక దోసము లేవియు
    చెఱలోనను పడినయతడు,చేటనియనకన్
    పరువెత్తి తాను భయమన్
    జ్వర పీడితుడొకడు గోడ జయ్యన దూకెన్

    జ్వరమున పధ్యపు నియమము
    భరమయె నొకనికి,కనుగొని పాయసమొకటన్
    పరులెరుగక తానుతినక
    జ్వరపీడితుడొకడు గోడ జయ్యన దూకెన్

    భరమగు నుగ్రపు వాదుల
    చెఱనుండియు గావ జనుల,సేననునొకడున్
    పరమైన దేశభక్తను
    జ్వరపీడితుడొకడు గోడ జయ్యన దూకెన్

    రిప్లయితొలగించండి
  26. గురుదేవుల సూచన తో సవరించిన పద్యము

    విరహార్తు౦డగు నూతన
    వరుడాషాడమున వధువు ప్రసువింటికి తా
    నరుగగ సైచక మదన
    జ్వరపీడితుఁడొకఁడు గోడ జయ్యన దూఁకెన్

    రిప్లయితొలగించండి
  27. ఖరహర ప్రియ రాగమ్మున
    తరచుగ పాటలను పాడి తన్మయ మవునా
    పొరుగింటి పిల్ల రాగా
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్

    రిప్లయితొలగించండి
  28. వరమగు భాగ్యపు నగరిని
    కరవను నొక పిచ్చికుక్క గమ్మున రాగన్
    పరుగిడి లుంగిని వీడుచు
    జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్

    రిప్లయితొలగించండి