12, జులై 2010, సోమవారం

సమస్యా పూరణం - 36

కవి మిత్రులారా!
ఈరోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను.

12 కామెంట్‌లు:

  1. 'కలి యుగాంత'మనుచు గందరగోళంబు
    సృష్టి జేసి, ప్రెస్సు చెప్పె సోది!
    అట్టి రోజు వచ్చి, హాయిగా గతియించె -
    ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను!

    రిప్లయితొలగించండి
  2. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు. సరిగ్గా నేను ఊహించిన విషయాన్నే మీరు ఎన్నుకొని సమస్యను పూరించారు. నేను మరో విషయం ఆలోచించాలి.

    రిప్లయితొలగించండి
  3. వార్తఁ జెప్ప కుండ వ్యాఖ్యలు జేయుచు
    విలువులకు నిలువుగ శిలువ వేయ
    జనులు మీడియాను చడమడ తిట్టగ
    ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను!!

    రిప్లయితొలగించండి
  4. జిగురు సత్యనారాయణ గారూ,
    మంచి పూరణ. ధన్యవాదాలు. రెండవపాదంలో "విలువలకు" బదులుగ "విలువులకు" అని టైపాటు జరిగింది. గమనించండి.

    రిప్లయితొలగించండి
  5. వాడు గెలుచుననిరి వీడు ఓడుననిరి
    అన్ని కల్ల లాయె నెన్నికలల
    బుస్సుమన్న పొంగు ఉస్సురనుచు కుంగ
    ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను

    రిప్లయితొలగించండి
  6. చదువరి గారూ,
    చక్కని పూరణ పంపారు. అభినందనలు.
    నేను మనసులో ఒక విషయాన్ని ఊహించుకొని ఈ సమస్య సిద్ధం చేసాను. ఆచార్య ఫణీంద్ర గారు అదే భావంతో పూరణ పంపారు. సరే .. ఆ విషయాన్ని వదులుకొని మరో విషయాంతో నా పూరణ వ్రాసుకున్నాను. సరిగ్గా అలాటి భావంతో మీరు పద్యం వ్రాసారు. నా పద్యం కంటే మీరు వ్రాసిందే ఉచితంగా ఉంది. అందుకే నా పూరణను ఇవ్వడం లేదు. ఇస్తే చూసినవాళ్ళు నేను మీ పద్యాన్ని "కాపీ" కొట్టానని కచ్చితంగా అనుకొనే అవకాశం ఉంది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    ప్రళయ మొచ్చి చచ్చు - ప్రజలందరంచును
    పెద్ద వార్త లొచ్చె - పేప రందు !
    బుస్సు మన్న నీటి - బురద పాముల రీతి
    ప్రెస్సు మీడియాలు - తుస్సు మనెను !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  8. కిశోర్ జీ ! 'ప్రళయ మొచ్చి' ... 'ఒ' ఇంకా మిమ్మల్ని వదలలేదండీ !

    రిప్లయితొలగించండి
  9. శాస్త్రీజీ ! నిజమే సుమా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01అ)
    _____________________________________

    ప్రళయ మందు చచ్చు - ప్రజలందరంచును
    పెద్ద వార్త లొచ్చె - పేప రందు !
    బుస్సు మన్న నీటి - బురద పాముల రీతి
    ప్రెస్సు మీడియాలు - తుస్సు మనెను !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  11. ఇంటిలోన స్పీడుయింటరునెట్టుండు
    సెల్లుఫోనువార్తచెవులజేరు
    నెట్టురాజ్యమేలనేడుతిరుగులేక,
    ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను

    రిప్లయితొలగించండి
  12. భారతీయ ఘనత పంచగా పెంచగా
    భాష మాధురిమల భాసురముగ
    పెంచ లేక నేడు పెనుబూత మైనట్లు,
    ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను

    రిప్లయితొలగించండి