28, ఏప్రిల్ 2012, శనివారం

పద్య రచన - 10


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

27 కామెంట్‌లు:

 1. తన ప్రాణమ్ముల పాలి మృత్యువగు సీతాదేవి యంచున్ మన
  మ్మున నెంతేని దలంపకే కుమతి గొంపోయెన్ దశాస్యుండు సీ
  తను జోరుంబలె యేగి యట్టియెడ నత్యంత ప్రతాపమ్ముతో
  వినువీధిన్ వడి నడ్డగించె నతనిన్ వీశుండు రక్తాక్షుడై

  తన శక్తిన్ ప్రభు భక్తి జూపి ఘన యుద్ధంబందు పౌలస్త్యు డా
  సెను పక్షంబుల విక్రమ మ్మలరగా జెండాడుచున్ స్యందనం
  బును గూల్చెన్ పొడిచెన్ శిరమ్ములపయిన్ బోరాడి పోరాడి కూ
  లెను ధాత్రీస్థలి నా జటాయువు మదిన్ శ్రీరాము ధ్యానించుచున్

  రిప్లయితొలగించండి
 2. క్రూరాత్మా! విను నీకు మూడె, క్షితిజన్ గొంపోవుచున్నాడవా?
  యీ రామామణి లోకమాత, నిలుమా, యీరీతి నీధామమున్
  చేరంబోగలవా?యటంచు మిగులన్ చింతించి వేగంబుగా
  వారింపన్ ధృతిబూని దాకెనపుడున్ వానిన్ జటాయుం డికన్.

  దశకంఠుండను, దానవుండ, ఘనుడన్ ధైర్యప్రతాపంబులన్
  దిశలెల్లం బరికించి చూచిన నికన్ దీటెవ్వరున్నారు? నీ
  వశమా నన్నడగించు టంచు కినుకన్ వైచెన్ విహంగాగ్రణిన్
  నిశిసంచారుడు నిర్జరారి యసితో నిందాప్రసంగంబులన్.

  రిప్లయితొలగించండి
 3. రావణాసురు సీతను రధము పైన
  నపహ రించుకు బోవంగ నపుడు పక్షి
  అయ్య! వలదని పలుమార్లు నడ్డు బడగ
  పక్షి రెక్కలు నరికెను పాపి యగుచు .

  రిప్లయితొలగించండి
 4. అయ్యా శ్రీ సుబ్బారావు గారూ!
  మీ పద్యములో మొదటి పాదము:
  "రావణాసురు సీతను రథము పైని" అనుటలో అన్వయము బొత్తిగా బాగు లేదు. అందుచేత ఈ విధముగా మార్చితే కొంతలో కొంత బాగుంటుంది అనుకొనుచున్నాను:

  "రావణుం డవనిజాతను రథము పైని"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ నేమాని వారికి నమస్కారములు .మీ సూ చనకు కృతజ్ఞు డను
  మీ రు సూ చిం చినట్లు మార్చు కొందును .

  రిప్లయితొలగించండి
 6. ఆయువు తీరుట వలననె
  ఆయమ సీతమ్మ బట్టి యసురుడె వెడలెన్
  సాయము జేయగ రాగ జ
  టాయువునే నరికె నప్పు డాకస మందే.

  రిప్లయితొలగించండి
 7. ----- రావణుడు జటాయువును గూల్చుట -----

  కం. పదితలల పురుగు పడతిని
  వదలక గ్రసియించు చుండె పాపమ్మని తా
  మది నెంచి జటాయువు వెస
  నెదిరించె నిశాచరేంద్రు డెంద మదరగన్

  ఉ. పక్కియ వెంత సాహసము పావకుపై శలభంబు వోలె నీ
  వెక్కుడు వేగ మొప్ప నను నెవ్వనిగా గమనించి యీగతిన్
  ముక్కున జీల్చ వచ్చితివి ముక్కలు జేయదె చంద్రహాస మీ
  వెక్కడె సౌరి చాల డని హేళన చేసి సురారి గొట్టినన్.

  ఆ.వె. రివ్వు మనుచు సోకి రెక్క తెగిన పక్షి
  బొబ్బలిడుచు కూలె భూమి మీద
  దైవనిర్ణయంబు బోవదు ప్రాణంబు
  దాశరథిని జూచు దనుక నిలచు.

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులకు,

  లోగడ శ్రీనేమానివారు నా షష్టిపూర్తి సందర్భమును గూర్చి అడిగినారు.
  ఈ మే నెల 3వ తారీఖ గురువారం నాడు ఉగ్రరథశాంతి కార్యక్రమం అని మా పురోహితులవారు సెలవిచ్చినారు.1952లో జన్మించిన నాకు 2012లో 60 సంవత్సరములు నిండుచున్నవి.

  తాడిగడప శ్యామలరావు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శ్యామలీయము గారికి మీ షష్టిపూర్తి సందర్భమున శుభాకాంక్షలు. మీకు దీర్ఘాయుష్షు, సంపూర్ణారోగ్యము, సకల శుభములు, మీ కుటుంబ సభ్యులకు సకల సౌకర్యములు సమకూర్చాలని భగవంతునికి మా ప్రార్ధనలు.

  రిప్లయితొలగించండి
 10. కుటిల రావ ణుండు గొనిపోవ సీతను
  వెంబ డించి పోరె విహగ నాధు.
  అగ్ర దైత్యు డనగ నాగ్రహము మెండగు
  రెక్క విఱిచె నంత చక్క బడగ
  ----------------------------------------------
  గురువులు క్షమించాలి .నా దంతా కిట్టింపు పధ్ధతి కదా ! ప్చ్ ! ఎన్ని తప్పులుం టాయో ?

  రిప్లయితొలగించండి
 11. నమస్కారములు
  శ్రీ శ్యామలీయం గారికి " సష్టి పూర్తి సందర్భము గా హృదయ పూర్వక శుభా కాంక్షలు "

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరిగారూ, మీ పద్యంలో చివరి రెండు పాదాలలో స్వల్పమార్పుల చేస్తే:
  కుటిల రావణుండు గొనిపోవ సీతను
  వెంబ డించి పోరె విహగ నాధు
  డుగ్ర దైత్యు డతని కాగ్రహమే మెండు
  రెక్క విఱిచె నంత పక్కి బడగ

  రిప్లయితొలగించండి
 13. గన్నవరపు నరసింహ మూర్తి గారికి, నేదునూరి రాజేశ్వరి గారికి నా కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 14. నమస్కారములు
  ధన్య వాదములు శ్యా మలీయం గారు !

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని గారూ,
  మీ పద్యాలు చిత్రానికి ప్రాణం పోసాయా అన్నట్లుంది. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  నిందాప్రసంగాల ప్రసక్తితో మీ పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  నేమాని వారి సూచనను గమనించారు కదా!
  *
  గోకి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అందమైన కందంలో మీ భావాన్ని చక్కగా ఇమిడ్చారు. అభినందనలు.
  *
  శ్యామలీయం గారూ,
  ముందుగా మీకు నా పక్షాన, బ్లాగు మిత్రుల పక్షాన శుభాకాంక్షలు.
  చక్కని ఖండిక మీ ‘జటాయు వధ’ రచన. చాలా బాగుంది. అభినందనలు.
  ‘పోవదు’ పదప్రయోగం చింత్యం. ‘పోవు ప్రాణంబులు’ అంటే?
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  పండిత నేమాని వారి సవరణలను గమనించారు కదా!

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమాని గారు!
  సుబ్బారావు గారికి మీరు సూచించిన పాదంలో గణ భంగం, సమాస దోషం ఉన్నాయి. మొదటి ఇంద్ర గణంలో ఒక లఘువు ఎక్కువయింది. అలాగే ’అవనిజాత’ కాదు ’అవనీజాత’ అని గమనించండి. అవని - ’ఈకారాంతం’ కదా!
  సుబ్బారావు గారు!
  మీ పద్య పాదాన్ని ఇలా సవరించుకోండి.
  "రావణు డవనీజాతను రథము పైన"

  రిప్లయితొలగించండి
 17. ఓరి దురాత్మ జానకిని యో యబలన్ గొనిపోవు చుంటివా
  చోరుని వోలె మూడె నిదె చూడుము నీకని వాడి చంచువున్
  భూరి ప్రచండ వాయుబల పూరిత పక్షములన్ నఖమ్ములన్
  పోరె జటాయు వత్తరిని బ్రోవగ రావణునుండి మైథిలిన్.

  భూమిజ యాశావహయై
  యేమో నాపాలి దైవ మీ పక్షీంద్రుం -
  డేమో యని తలపోసె-
  న్నేమందుము దైవ లీల లేరికి యెరుకల్.

  కోపము తోడ రావణుడు ఘూర్నిలుచు న్నొర నుండి ఖడ్గము-
  న్నూపున లాగి పక్షముల నొక్కొక వేటున నేసె నంతటన్
  పాపము నేల కూలినది పర్వతమట్టుల నెత్తు రోడుచు-
  న్నాపులు గయ్యయో వనము నందలి దేవతలెల్ల భీతిలన్.

  పుడమి రాలి నట్టి పులుగును గని సీత
  కనులు మూసికొనెను కార బాష్ప
  ధార లవధి లేక జారిపోయెను గుండె
  అంధకార మాయె నామె కెల్ల.

  రిప్లయితొలగించండి
 18. శ్యామలీయం గారూ! సష్టి పూర్తి శుభా కాంక్షలు.

  రిప్లయితొలగించండి
 19. ఈ పోవదు అనే పదప్రయోగం గురించి కొంచెం విచారణ చేయవలసి యున్నది. ఈ 'పోవదు' అనే పదంతో google search చేయగా లభించిన రెండు ప్రమాణములు క్రింద చూపుతున్నాను.

  ద్రోణాచార్యుని మరణంబు విని ధృతరాష్ట్రుండు పరితపించు ఘట్టంలో తిక్కన పదప్రయోగం చిత్తగించండి
  తే. నట్టె యచ్చెరు విది దైవ మగ్గలంబు
  పౌరుషముకంటె ద్రోణునిపాటు వినియు
  వేయిపఱియలై పోవదు ఱియి గాఁగ
  నోపు నాగుండెయే మని యుమ్మలింతు

  అలాగే పోతనగారి భాగవత ప్రథమస్కంధం 6వ అధ్యాయంలో 125వ పద్యం.
  కం.నావలని కోర్కి యూరక
  పోవదు విడిపించు దోషపుంజములను మ
  త్సేవం బుట్టను వైళమ
  భావింపఁగ నాదుభక్తి బాలక! వింటే.

  రిప్లయితొలగించండి
 20. శ్యామలీయం గారూ,
  నిజమే. మీ ప్రయోగం సరియైనదే. నేను పొరబడ్డాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 21. మిస్సన్న గారూ,
  ఆలస్యంగా ప్పందించినా చాలా మంచి ఖండికను అందించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  జటాయువు:

  ___________________________________


  01)

  రామ లక్ష్మణు లిద్దరు - రయము వెడల
  పర్ణశాలను జేరెను - పడతి సీత
  నపహరించిన దుర్మార్గు - డకట కదలె
  రావణాసురు డంతట - లంక జేర !

  02)

  గగన మార్గాన నేగెడి - ఖలుని గాంచి
  పక్షిరాయడు జటాయు - వడ్డు పడెను
  కాళ్ళతోడను రావణు - క్రమ్ముకొనెను
  సీత విడిపింప తనశక్తి - యూతమవగ !

  03)

  పక్షి రెక్కల ఖండించె - పాపి యకట
  పక్షి రాయడు రక్తము - కుక్షి తడుప
  కుప్ప కూలెను , నేలపై - యప్పళించె !
  రాము కెరిగింప రావణు - రాక గూర్చి !
  ___________________________________

  April 30, 2012 4:44 AM

  రిప్లయితొలగించండి