24, ఏప్రిల్ 2012, మంగళవారం

పద్య రచన - 7కవిమిత్రులారా,


పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. సీ.
  ఒకచేత నసిబట్టి సకలారి సంఘాల
  నధికతేజంబుతో నణచినావు,
  ఒకచేత ఘంటంబు(లేఖిని) ఒప్పుగా ధరియించి
  కవివరేణ్యుల మించి ఘనతగాంచి
  ఆముక్తమాల్యదాద్యనుపమ కృతులను
  బహుసమర్థతతోడ బలికినావు,
  అష్టదిగ్గజములం చలరారు కవులతో
  సాహితీ సభలెన్నొ జరిపినావు
  తే.గీ.
  "దేశభాషల జూడంగ తెలుగులెస్స"
  యనెడు సూక్తికి సార్థక్య మందజేయు
  "సాహితీ సమరాంగణ సార్వభౌమ!
  విష్ణుసన్నిభ! నరసింహ కృష్ణరాయ!

  రిప్లయితొలగించండి
 2. శ్రీ మూర్తి గారి సీసము చాల బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. ఆముక్తమాల్యదాఖ్యము
  నామూలాగ్రము పఠింప నానందమగున్
  భూమీశ ! కృష్ణరాయా !
  కైమోడ్పులు స్వీకరింపు కవిరాజమణీ !

  రిప్లయితొలగించండి
 4. మహాస్రగ్ధర:

  జయ భూపా! కృష్ణరాయా! జయ సరసగుణా! శత్రుగర్వాపహారీ!
  జయ ప్రాజ్ఞా! ఆంధ్రభోజా! జలజహితరుచా! సాహితీ సార్వభౌమా!
  జయ శ్రీవిష్ణుస్వరూపా! జయ సుకవివరా! సాక్షరానందమూర్తీ!
  జయ దేవేంద్రాభ రాజత్ సకల విభవ! ధీసార తేజోనిధానా!

  రిప్లయితొలగించండి
 5. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  అద్భుతమైన పద్యం చెప్పారు. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  రాయలపై కందం అందంగా ఉంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  కృష్ణరాయల సమస్త సద్గుణాలను మనోజ్ఞంగా చిత్రించిన మీ పద్యం ఉదాత్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. విజయ నగర సామ్రాజ్య వైభ వమ్ము
  సాహితీ క్షేత్ర మేలిన సార్వ భౌమ
  విష్ణు చిత్తీయ మనుకృతి విరచి తమ్ము
  విష్ణు పదముల కర్పించె కృష్ణ రాయ

  రిప్లయితొలగించండి
 7. శ్రీయుతులు మిస్సన్న గారు, రాజేశ్వరిగారు శ్రీకృష్ణదేవరాయలగురించి చక్కగా చెప్పారు. బాగున్నది. రాజేశ్వరిగారి పద్యం మొదటి పాదంలో ఒక అక్షరం కనిపిస్తున్నట్లు లేదు. గమనించగలరు.
  ఆర్యా!
  పండిత వర్యా!
  బహుచక్కనిదీ స్రగ్ధర
  యహహా! నేమానివర్య! అతిమథురంబై
  మహితాద్భుత సత్పదగుణ
  సహితంబై వెలుగుచుండె సత్కవివినుతా!

  రిప్లయితొలగించండి
 8. అయ్యా!
  బహు చక్కని అనే సమాసము మంచి ప్రయోగము కాదు. దుష్ట సమాసము అగును. బహు రమ్యము, బహు సుందరము మొదలగు నటుల మారిస్తే బాగుంటుంది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. ఆర్యా!
  క్షమించగలరు,
  "బహురమ్యంబీస్రగ్ధర" - గా మార్చుతున్నాను. ధన్యవాదములు

  రిప్లయితొలగించండి