24, ఏప్రిల్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 684 (చేఁప చన్నులలోఁ బాలు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

చేఁప చన్నులలోఁ బాలు చెంబెఁ డుండె.

ఈ సమస్యను పంపిన రాజేశ్వరి అక్కయ్య గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

 1. పచ్చి గడ్డిని తినిపించి, పగలు రాత్రి
  కుడితి త్రాగించి, దరిచేరి కూర్మితోడ
  మేను కడిగెను గేదెకు, దాని పొదుగు(చన్ను)
  చేప, చన్నులలో బాలు చెంబె డుండె.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మూర్తిగారి స్ఫూర్తితో :

  01)
  ___________________________________


  చేనుదరినున్న పచ్చిక - తాను మేసి
  చెరువులో నున్న నీటిని - కరువుదీర
  ఆరగించిన తెల్లని -యావు పొదుగు
  చేఁప , చన్నులలోఁ బాలు - చెంబెఁ డుండె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 3. కుడితి త్రాగించి , లాలించి కూర్మి తోడ
  పచ్చ గడ్డిని మరియును వట్టి గడ్డి
  మాటి మాటికి తినిపించి మేటి పొదుగు
  చేప చన్నులలో పాలు చెం బె డుండె

  రిప్లయితొలగించండి
 4. 02)
  ___________________________________


  పసరు గడ్డిని కడుపార - మెసవి నట్టి
  పవనమును పొట్ట నిండుగ - పరవ లోన
  పానమును జేసి నట్టిదౌ - పాడియావు
  చేఁప , చన్నులలోఁ బాలు - చెంబెఁ డుండె !

  ___________________________________
  పరవ = కాలువ

  రిప్లయితొలగించండి
 5. కన తిమింగలమొక చేప కాదె నీట
  క్షీరదమ్మది బిడ్డకు క్షీరమిడును
  బిడ్డ యాకటితో జేరి పెదవు లాన
  చేఁప చన్నులలోఁ బాలు చెంబెఁ డుండె.

  రిప్లయితొలగించండి
 6. మత్స్యమూర్తిగ విష్ణువు మసలు నపుడు
  మత్స్య రూపిణియై లక్ష్మి మగని గొలిచె
  శిశువు మారుడు తల్లిని చేరు వేళ
  చేప చన్నులలో బాలు చెంబెడుండె

  రిప్లయితొలగించండి
 7. గొల్ల వాడిచ్చె గదయని నల్ల యావు
  పసుపు కుంకుమ లలదినే భక్తి గాను
  కుడితి త్రాగించి గోమాత కడుపు నిండ
  చేఁప చన్నులలోఁ బాలు చెంబెఁ డుండె
  -------------------------
  నేతి బీరల యందుండు నేయి కరణి
  కలి యుగమ్మున మంచిని కనగ తరణి
  కడలి యంచులు తాకిన గగన సరణి
  చేఁప చన్నులలోఁ బాలు చెంబెఁ డుండె !
  ---------------------------
  ఇక్కడ చేప = నీటిలోని చేప

  రిప్లయితొలగించండి
 8. గుండా సహదేవుడు గారి పూరణ....

  ఆదిఅవతార యెయ్యది హరియుఁదాల్చె?
  నోట పూతన ప్రాణమెచ్చోటఁ బీల్చె?
  స్వామి గోపికింటను దూర ఏమియుండె?
  చేప, చన్నులలోఁ ,బాలు చెంబెడుండె.

  రిప్లయితొలగించండి
 9. ఒక విదేశ యువతి దాల్చి యొప్పు మీర
  చనులపై చేప చిత్రాలు చాల పొంగె
  చిన్ని తనయుడు పాలకై చేరు నెడను
  చేప చన్నులలో బాలు చెంబెడుండె

  రిప్లయితొలగించండి
 10. పై పద్యములో భావమునకు స్ఫూర్తి:
  కొన్ని దేశాలలో స్త్రీలు (పురుషులు కూడా) శరీరము నిండుగా పచ్చబొట్టువంటి రీతిలో ఎన్నొ బొమ్మ్నలు వేయించుకొనుచున్నారు.

  రిప్లయితొలగించండి
 11. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  వైవిధ్యంగా పొదుగు చేపించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మూర్తి గారి దారి పట్టినా మీ ప్రత్యేకతను చాటే మంచి పూరణలు చెప్పారు. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  క్షీరదాలైన చేపల్ని పట్టేశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మనోహరమైన ఊహతో ఉదాత్తమైన పూరణ నందించారు.
  టట్టూ ప్రస్తావనతో మీ రెండవ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  ఈ మధ్య తమ్ముడికి సవరణలు సూచించే శ్రమ తప్పించారు. ధన్యవాదాలు.
  *
  గుండా సహదేవుడు గారూ,
  ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. నమస్కారములు
  నేనిచ్చిన సమస్యను నచ్చి ప్రచురింఛి నందులకు , గురువులకు ధన్య వాదములు.
  ఇక............ "శ్రమ " ...........అంటే ........ప్చ్ !

  రిప్లయితొలగించండి
 13. పితుకగానిచ్చు ప్రతిరోజు బిందెడిపుడు
  రోగమేమాయె పాలనీ వేళ జూడ
  మూతి వెట్టుచు దూడేమొ మురిపెమలర
  చేప, చన్నులలో పాలు చెంబెడుండె?

  రిప్లయితొలగించండి
 14. హనుమచ్ఛాస్త్రి గారూ,
  బిందెడు పాలు చెంబెడైనాయా? బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి