కవిమిత్రులకు నమస్కృతులు. అత్యవసరంగా ఉదయం నాలుగు గం.కు బయల్దేరి ఇప్పుడే మిర్యాలగూడలో బస్సు దిగాను. ప్రక్కనే ఉన్న నెట్ కేఫ్ నుండి ఈనాటి సమస్యను ప్రకటించాను. ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి.
నేమాని వారు చంద్రుని ఉడుగణపతి యన్నారు. అంటే నక్షత్రగణాలకు అధిపతి అని. బాగుంది. గణేశచతుర్థినాడు మాత్రం యీ ఉడుగణపతిని చూసినట్లయితే నీలాపనిందలని గదా శాపవాక్యం.
ఇదే భావంతో మూర్తిగారు తేటగీతిలో సమస్యను యెక్కించారు. ఇదీ బాగుంది!
శ్రీ సరస్వత్యై నమః: మిత్రులారా! ఈనాటి సమస్య ఒకింత కష్టముగనే ఉన్నది. ఐనా చక్కటి మార్గము ఎంచుకొనినారు శ్రీ మూర్తి గారు. అభినందనలు. 2 పద్యములు చాల బాగున్నవి. శ్రీమతి లక్ష్మీదేవి గారు కూడా మంచి విరుపును పట్టుకొన్నారు. పద్యము చాల బాగున్నది. అభినందనలు. శ్రీ శ్యామలరావు గారు ఉత్సాహము నిచ్చుచున్నారు అందరికీ. వారి పరిష్కారము ఎట్లా ఉంటుందో చూద్దాము. స్వస్తి.
శ్రీ సరస్వత్యై నమః: మిత్రులారా! ఈనాటి సమస్యను పూరించుటకు ప్రయత్నము చేయుటే అభినందింపదగిన విషయము. అందుచే పూరించిన వారందరికీ అభినందనలు. శ్రీ మిస్సన్న గారు మరియు శ్రీ సుబ్బారావు గారు కూడా బాగుగనే పూరించేరు. శ్రీమతి రాజేశ్వరి గారి పూరణలో కొన్ని సవరణలు అవసరము -- యతి దోషములు, గణభంగము, అన్వయ సౌలభ్యము లేకుండుటలు ఉన్నవి. స్వస్తి.
చాలా రోజులై పని ఒత్తిడి మూలాన రచనలను తిలకించడానికి, సమస్యాపూరణ కార్యజాతంలో పాల్గొనేందుకు అవకాశం లేకపోయింది. ఇప్పుడే చూడగలిగాను.
శ్రీ అజ్ఞాత గారికి నమస్సులు. నా మతం – విమర్శించే ముందు కవి సంగతి అటుంచి, అర్థాన్వయం సాధ్యమా? కాదా? అని మాత్రమే చూడాలి. ఏ విధంగానూ సాధ్యం కాదంటేనే సవరణను ప్రతిపాదించాలి.
వేగ చెడు = వేగముగా చెడిపోవును అని అర్థం చెప్పవలసి రావటం వల్ల విమర్శకు తావు ఏర్పడింది.
“వేగ చెడు విఘ్నతతి” అన్నప్పుడు స్థితగతిచింతనగా - వేగన్ = వేగుట కాగానే – అంటే, ఉదయాదారభ్య – రోజంతా; విఘ్నతతిన్ = విఘ్నసమూహముచే; చెడున్ = పాడగును” అని చెప్పుకోవచ్చును.
ఆ ప్రకారం “వేగఁ జెడు” అంటే మఱింత స్పష్టంగా ఉంటుంది.
పండితుల వారికి అనేక ధన్యవాదములు. మాన్యులు శ్రీ మురళీధరరావు గారికి, నమస్సులు. మీ వంటి వారి మాటలు వినడమే మహద్భాగ్యం. ఈరోజే మాలికలో మీ వ్యాసం చదివాను. మీ రచనలు తప్పక చదివి తీరవలసినవి. మీ మాటలు వింటేనే మీ వద్ద ఎంతో నేర్చుకోవటానికి ఉంది అని తెలుస్తున్నది.
మిత్రులారా! ఈనాటి మిగిలిన పూరణలను కూడా ముచ్చటించుదాము.
1. శ్రీ వసంత కిశోర్ గారు గణపతి పూజాక్షతలను మనపై జల్లేరు. బాగున్నది. 2. శ్రీ శ్యామలరావు గారు గజవదనుని మరువరాదని జ్ఞాపకము చేసేరు. బాగున్నది. 3. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు 2 అక్షరములను కలిపి ఇదొక విధమైన పూరణ అని తెలియజేసేరు. బాగున్నది. 4. డా. ఏల్చూరి వారు ఈ మధ్య రోజులలో పని ఒత్తిడి మీద పాల్గొనలేక పోవుచున్నారు. ఈరోజైనా మనమధ్యకి మళ్ళీ రాగలిగేరు. మంచి విషయములను మంచి మనసుతో సమర్థించుటలో తమ సామర్థ్యాన్ని మనకు రుచి చూపించేరు. ఆ మంచిగుణమే అభినందించవలసినదీ, అందరూ ఆచరించవలసింది. 5. డా. కమనీయము గారు మంచి కూర్పుతో గణపతికి కుడుములను తినిపించేరు. బాగున్నది. 6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి గదిలో ముగ్గురు నివసిస్తున్నారట -- 1. విశ్వుడు, 2. తైజసుడు, 3. ప్రాజ్ఞుడు. మంచి సాంగత్యమే. శుభమస్తు. బాగున్నది.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఅత్యవసరంగా ఉదయం నాలుగు గం.కు బయల్దేరి ఇప్పుడే మిర్యాలగూడలో బస్సు దిగాను. ప్రక్కనే ఉన్న నెట్ కేఫ్ నుండి ఈనాటి సమస్యను ప్రకటించాను. ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి.
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
ఈ నాటి సమస్యకు ముందు 1 లేక 2 అక్షరములు చేర్చితే కందపద్యము 4వ పాదము అవుతుంది. అలాగే నింపుటకు ప్రయత్నించెదము. స్వస్తి.
పడుచుండ సుతుడు వేదన
రిప్లయితొలగించండికడు వగచుచు గౌరి చంద్రు గనుచును శాపం
బిడె నటుల చవితి రాతిరి
నుడుగణపతిని గన నిందలొదవును గాదే?
సకలశుభములు గల్గును, చదువులబ్బు
రిప్లయితొలగించండినమ్మి యా కాణిపాకగణపతినిగన,
నింద లొదవును గాదేమి నియతిదప్పి
చందమామను చూచిన చవితినాడు.
నేమాని వారు చంద్రుని ఉడుగణపతి యన్నారు. అంటే నక్షత్రగణాలకు అధిపతి అని. బాగుంది. గణేశచతుర్థినాడు మాత్రం యీ ఉడుగణపతిని చూసినట్లయితే నీలాపనిందలని గదా శాపవాక్యం.
రిప్లయితొలగించండిఇదే భావంతో మూర్తిగారు తేటగీతిలో సమస్యను యెక్కించారు. ఇదీ బాగుంది!
భ్ర్రాత సీతను దెచ్చి పాపమును జేసె
రిప్లయితొలగించండినాకు నికమీద నసురగణపతినిగన
నిందలొదవును గాదే?యని రఘురాము
జేరెను విభీషణుడపుడు శీఘ్రముగను
మా గిరిజకెంత సంతస
రిప్లయితొలగించండిమో, గణపతినిఁ గన! నిందలొదవును గాదే,
శ్రీగౌరి శాపఫలముగ
నాగగనపు చంద్రు గనిన, నందురు చవితిన్.
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా! ఈనాటి సమస్య ఒకింత కష్టముగనే ఉన్నది. ఐనా చక్కటి మార్గము ఎంచుకొనినారు శ్రీ మూర్తి గారు. అభినందనలు. 2 పద్యములు చాల బాగున్నవి.
శ్రీమతి లక్ష్మీదేవి గారు కూడా మంచి విరుపును పట్టుకొన్నారు. పద్యము చాల బాగున్నది. అభినందనలు.
శ్రీ శ్యామలరావు గారు ఉత్సాహము నిచ్చుచున్నారు అందరికీ. వారి పరిష్కారము ఎట్లా ఉంటుందో చూద్దాము.
స్వస్తి.
వేగముగను కొలువగరా
రిప్లయితొలగించండివో గణపతినిఁ, గన నిందలొదవును గాదే
శ్రీ గణపతి చవితిని తా-
రాగణపతివైపు చూడ రాత్రిని చెలియా!
డుంఠి గణపతి సేవించి కఠము డనగ
రిప్లయితొలగించండికావ్య కంఠు డె యతడన కాశి యందు
శుభము లిడునని కొలిచిన చవితి నాడు
గణపతిని గన నింద లొదవును గాదే !
-----------------------------------------
కటము [ KATHAMU ] = ముని
సర్వ శుభములు గలుగును శర్వ పుత్రు
రిప్లయితొలగించండిగణపతిని గన, నింద లొ దవును గాదె?
చవితి చంద్రుని చూచిన చవితి నాడు
పూజ చేసిన తల బ్రాలు బ్రోచు మనల
శంభుని తనయుడు గణపతి
రిప్లయితొలగించండికంబుకంఠి గారవమున గణాధిపు డయ్యెన్ !
అంబరమున చంద్రో దయమవ
నింబ గణపతిని గన నింద లొదవును గాదే !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________________________
నడి గగనము నీ రాతిరి
నుడు గణపతిని గన నింద - లొదవును గాదే !
కడు భక్తిని గణనాథుని
కడ సేసలు గొనిన యంత - కలకలు మాయున్ !
_____________________________________________
కలక = నింద
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
ఈనాటి సమస్యను పూరించుటకు ప్రయత్నము చేయుటే అభినందింపదగిన విషయము. అందుచే పూరించిన వారందరికీ అభినందనలు. శ్రీ మిస్సన్న గారు మరియు శ్రీ సుబ్బారావు గారు కూడా బాగుగనే పూరించేరు. శ్రీమతి రాజేశ్వరి గారి పూరణలో కొన్ని సవరణలు అవసరము -- యతి దోషములు, గణభంగము, అన్వయ సౌలభ్యము లేకుండుటలు ఉన్నవి.
స్వస్తి.
గణపతినిఁ గన నిందలొదవును గాదే యన్నది నేమాణి వారన్నట్లుగా నించుక క్లిష్టసమస్యయే! నా పరిష్కారము చూడండి.
రిప్లయితొలగించండికం. వేగ చెడు విఘ్నతతి యో
హో గణపతినిఁ గన నిందలొదవును గాదే
యీ గజ వదనుని మరచిన
సాగక కార్యములు విష్ణుశక్రాదులకున్
శ్యామలీయం వారు!
రిప్లయితొలగించండి"వేగ చెడు విఘ్నతతి" అంటే?
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గురువర్యులకు నమస్కారములు. శిష్యులపై వాత్సల్యముతో రెండూక్షరములను చేర్చిన కందపద్యపాదమౌతుందని చూపించినారు. వారు రెండు అక్షరములు చేర్చిన తరువాత "గణపతినిఁ గన నిందలొదవును గాదే" అనునది "ఉడుగణపతినిఁ గన నిందలొదవును గాదే" అని మారినది.
విడచిన రెండక్షరములు
వడివడిగా జేర్చినారు వాత్సల్యమునన్ {(లేక) పండితవర్యా}
కడపట జదువగ నిట్లగు
"ఉడుగణపతినిఁ గన నిందలొదవును గాదే"
కడపట = చివరిగా
మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి,
రిప్లయితొలగించండిచాలా రోజులై పని ఒత్తిడి మూలాన రచనలను తిలకించడానికి, సమస్యాపూరణ కార్యజాతంలో పాల్గొనేందుకు అవకాశం లేకపోయింది. ఇప్పుడే చూడగలిగాను.
శ్రీ అజ్ఞాత గారికి నమస్సులు. నా మతం – విమర్శించే ముందు కవి సంగతి అటుంచి, అర్థాన్వయం సాధ్యమా? కాదా? అని మాత్రమే చూడాలి. ఏ విధంగానూ సాధ్యం కాదంటేనే సవరణను ప్రతిపాదించాలి.
వేగ చెడు = వేగముగా చెడిపోవును అని అర్థం చెప్పవలసి రావటం వల్ల విమర్శకు తావు ఏర్పడింది.
“వేగ చెడు విఘ్నతతి” అన్నప్పుడు స్థితగతిచింతనగా -
వేగన్ = వేగుట కాగానే – అంటే, ఉదయాదారభ్య – రోజంతా;
విఘ్నతతిన్ = విఘ్నసమూహముచే; చెడున్ = పాడగును”
అని చెప్పుకోవచ్చును.
ఆ ప్రకారం “వేగఁ జెడు” అంటే మఱింత స్పష్టంగా ఉంటుంది.
ఇది నిమిత్తంగా పెద్ద లందఱికీ నమస్కారం!
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివడి రండు భక్త జనపా
రిప్లయితొలగించండిలుడు,గణపతిని గన;నింద లొదవును గాదే
ఉడుపతి జూచిన చవితిని
కుడుముల బెట్టుచు గొలువుడి యిడుముల బాయన్
-------------
యతిమైత్రి దోషాన్ని సరిస్తూ...
రిప్లయితొలగించండిమాగదిలో మువ్వురమే
యోగేశుని ముఖమును గన నుదయము నాకున్
బాగా పనులౌ నింకొక
డో గణపతినిఁ గన నిందలొదవును గాదే.
పండితుల వారికి అనేక ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాన్యులు శ్రీ మురళీధరరావు గారికి,
నమస్సులు.
మీ వంటి వారి మాటలు వినడమే మహద్భాగ్యం. ఈరోజే మాలికలో మీ వ్యాసం చదివాను. మీ రచనలు తప్పక చదివి తీరవలసినవి.
మీ మాటలు వింటేనే మీ వద్ద ఎంతో నేర్చుకోవటానికి ఉంది అని తెలుస్తున్నది.
మిత్రులారా!
రిప్లయితొలగించండిఈనాటి మిగిలిన పూరణలను కూడా ముచ్చటించుదాము.
1. శ్రీ వసంత కిశోర్ గారు గణపతి పూజాక్షతలను మనపై జల్లేరు. బాగున్నది.
2. శ్రీ శ్యామలరావు గారు గజవదనుని మరువరాదని జ్ఞాపకము చేసేరు. బాగున్నది.
3. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు 2 అక్షరములను కలిపి ఇదొక విధమైన పూరణ అని తెలియజేసేరు. బాగున్నది.
4. డా. ఏల్చూరి వారు ఈ మధ్య రోజులలో పని ఒత్తిడి మీద పాల్గొనలేక పోవుచున్నారు. ఈరోజైనా మనమధ్యకి మళ్ళీ రాగలిగేరు. మంచి విషయములను మంచి మనసుతో సమర్థించుటలో తమ సామర్థ్యాన్ని మనకు రుచి చూపించేరు. ఆ మంచిగుణమే అభినందించవలసినదీ, అందరూ ఆచరించవలసింది.
5. డా. కమనీయము గారు మంచి కూర్పుతో గణపతికి కుడుములను తినిపించేరు. బాగున్నది.
6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి గదిలో ముగ్గురు నివసిస్తున్నారట -- 1. విశ్వుడు, 2. తైజసుడు, 3. ప్రాజ్ఞుడు. మంచి సాంగత్యమే. శుభమస్తు. బాగున్నది.
అందరికీ మరొక మారు అభినందనలు.
రాగమ్మెంతయొ గద! బా
రిప్లయితొలగించండిబో! గణపతినిఁ గన!
నిందలొదవును గాదే
బాగుగ పూజలు జేయక
శ్రీగణపతి చవితి రోజు శీతలు జూడన్