23, ఏప్రిల్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 683 (పది కథలు చెప్పగలవాడె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


పది కథలు చెప్పగలవాడె పండితుండు.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న పనుల వత్తిడి వల్ల ఎంత ప్రయత్నించినా సమస్యను పోస్ట్ చేయలేక పోయాను. క్రమం తప్పకుండా రోజు కొక సమస్యను ఇవ్వాలనుకున్న నా నియమం తప్పింది. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  హరికథా పండితుడు :

  01)
  ___________________________________


  పలుకు పలుకున తేనెల - పంట నద్ది
  పదము పదమున నాట్యమ్ము - పదును బెట్టి
  పట్టు వీడని కథనమ్ము - నట్టె నిలిపి
  పది కథలు చెప్పగలవాడె - పండితుండు !

  ___________________________________

  రిప్లయితొలగించండి
 3. అంశమేదైన జ్ఞానబోధాశయముగ
  రసము లెల్లను నింపుచు నసదృశముగ
  జనుల నలరింప జేసి ప్రశంసలందు
  పది కథలు జెప్పగలవాడె పండితుండు

  రిప్లయితొలగించండి
 4. కథకుడనెడి యశము పొందు, ఘనత నందు
  కరము తన్మయభావాన హరిని దలచి
  పదికథలు చెప్పగలవాడె, పండితుండు
  భావ మాధుర్యమునుగాంచి భళిర! యనును.

  రిప్లయితొలగించండి
 5. వేదశాస్త్రాలు చదివిన విజ్ఞుడైన
  ఘనత గనలేడు ప్రస్తుత కాలమందు
  మాయమాటలు పలుకుచు మమత జూపి
  పదికథలు చెప్పగలవాడె పండితుండు.

  రిప్లయితొలగించండి
 6. శాస్త్ర విజ్ఞాన మెంతయు చాలకున్న,
  కావ్యరచనా ధురీణుండు కాకయున్న
  చక్కగా పఠితలకు నాసక్తి కల్గు
  పది కథలు చెప్పగలవాడె పండితుండు.

  రిప్లయితొలగించండి
 7. వేదవిఙానమంతయుపాదుకొన్న భారతపురాణగాథలుమేరువంత చూడనొకటైనమార్గముఁ జూపెడుతలు
  పది,కథలుచెప్పగలవాడె పండితుండు

  రిప్లయితొలగించండి
 8. కధకు డగు నయ్య ! కమ్మగ, క్రమము తోడ
  పది కధలు చెప్ప గల వాడె , పండి తుండు
  భాష మీ దన పరి పూ ర్ణ పట్టు గలిగి
  వేద వేదాంత సారపు వేత్త యగు చొ

  రిప్లయితొలగించండి
 9. హ.వేం.స.నా.మూర్తి గారూ మీ పూరణ

  "వేదశాస్త్రాలు చదివిన విజ్ఞుడైన
  ఘనత గనలేడు ప్రస్తుత కాలమందు"

  చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 10. రమ్య మైనట్టి ప్రేమలు రక్తి నొసగు
  ఉల్ల మలరింఛి జనులు రంజిల్లు నటుల
  ఎల్లి పిల్లికి జతబెట్టి కల్ల బొల్లి
  పది కదలు చెప్ప గలవాడె పండి తుండు

  రిప్లయితొలగించండి
 11. దైవ చింతన కలిగిన ధన్యు డనుచు
  కదలు కధలుగ నల్లిన కావ్య ములను
  భక్తి పధమందు ప్రీతిగ భర్గు చెంత
  పది కధలు చెప్ప గలవాడె పండి తుండు .

  రిప్లయితొలగించండి
 12. వసంత కిశోర్ గారూ,
  హరికథాపితామహుని ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  ప్రశంసార్హమైన కథలు చెప్పేవాడు పండితుడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు.
  మీ రెండవ పూరణ వ్యంగ్యార్థ భరితమై శోభిస్తున్నది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  కమనీయ భావాలు మీ సొంతం. చక్కని పూరణ. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  ప్రశంసార్హమైన ప్రయత్నం మీది. అభినందనలు.
  "చూపెడు తలు పది..."?
  *
  సుబ్బారావు గారూ,
  మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ మొదటి పూరణలోని వక్రోక్తి అదిరింది.
  రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. గాలి మేడలు తమగూర్చి, కల్ల బొల్లి
  నిందలెన్నియొ ప్రత్యర్ధి నేత గూర్చి
  యల్లి రాజకీయాలలో నారిదేరి
  పది కథలు చెప్పగలవాడె పండితుండు

  రిప్లయితొలగించండి
 14. పండిత నేమాని వారూ,
  కాలోచితమైన మీ వ్యంగ్యాత్మక పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. నమస్కారములు.
  ఈ రోజూ కుడా సమస్య కనుపిం చక పొతే , ఫోన్ చేద్దామనుకుంటూ , కంప్యూటర్ దగ్గరకు వచ్చాను. ఇంకేం ? బోలెడు ఆనంధం . హమ్మయ్య. ! ఇక నుంచీ రోజూ ఈ పిలుపు వినవచ్చును. ధన్య వాదములు తమ్ముడూ !

  రిప్లయితొలగించండి
 16. భాష తెలిసిన వారలే బాగ తగ్గె
  ఉప్పుకప్పుర పద్యంబు నప్ప జెప్పి
  సగము తెలుగును వ్రాయగా సరస కవియు
  పది కథలు జెప్ప గలవాడు పండితుండు.

  రిప్లయితొలగించండి
 17. హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి