క్రితంలో ఒక తల్లి అక్రమ సంబంధం కలిగి, పరపురుషుని ఎదుట సొంతకూతుర్ని హింసించిందని చదివిన వార్త ఆధారంగా : కం. దహియించెడు కామమ్మున దుహితను హింసించె జార్ణి దుర్వ్యసు నెదుటన్ మహిలోతలపన్ తగనా మహిళను దూషించువాడు మాన్యుడు జగతిన్
పండిత నేమానివారికి నమస్కారములు.ఇప్పుడే మీ నిన్నటి వ్యాఖ్యను చూచేను.అర్ధ జ్ఞానము గలవాడినంటూ చులకన చేసేరు.కొద్దిగా మనసు నొచ్చుకున్నా మరేం పర్లేదు, మీరు పెద్దవారు కదా , అనవచ్చును . కాకపోతే నా సందేహం పాద పద్మాలకు అర్థం చెప్పమని కాదు, అసలు 'పద్మ పాదాలు ' అని పూర్వ ప్రయోగం ఎక్కడైనా ఉందా - పద్మ యొక్క పాదాలనో పద్మము యొక్క పాదాలనో షష్ఠీ వస్తే వస్తుంది తప్ప , పద్మముల వంటి పాదములు అని ఎలా వస్తుంది అన్నది నా ప్రశ్న . పద్మముల వంటి పాదములు అనే విగ్రహవాక్యానికి - పాదపద్మాలు అనే ఉపమానోత్తర పద కర్మధారయమే సరిపోతుంది. లేదా గురువుగారు శంకరయ్య మాష్టారు చెప్పినట్టు పాదములనెడి పద్మాలు అన్నా రూపకమే అవుతుంది మరి కొత్తగా ఈ ' పద్మ పాదాలు ' యెలా వచ్చిందీ అని మాత్రమే నేను సందేహించాను. పూర్వకవి ప్రయోగం కొరకు అడిగాను . ఆ లెక్కన ' అబ్జ నేత్రాలు , పద్మ నేత్రాలు ' కూడా ఉన్నాయా ? నేను ' పద్మ పాదుడు ' గురించి లేవనెత్తింది కూడా బహువ్రీహి గురించే . ' అబ్జ నేత్ర , పద్మ నేత్ర ' కూడా ఉంటాయి అయితే బహువ్రీహిగా కానీ నేత్రాలకు ఉపమానం గా కాదు అని అభిప్రాయం. క్షమించాలి .అందువలననే పై అర్థం వచ్చేలా "పద్మ పాదములు " అనే పూర్వ కవి ప్రయోగం కొరకు అడిగేను . కిశోర్ కుమార్ .
శ్రీ సరస్వత్యై నమః : శ్రీ కిశోర్ కుమార్ గారికి ఆశీస్సులు. నేను రచించిన పద్యములలో ప్రయోగములు వ్యాకరణ శుద్ధములా కావా అన్నవి పాఠకులందరకి తెలుసు - శ్రీ శంకరయ్య గారికి బాగా తెలుసు. మీరు వేసిన ప్రశ్నలన్నింటికీ నేనూ సమాధానము ఇచ్చేను, శ్రీ శంకరయ్య గారు కూడా వివరణ ఇచ్చేరు. రాను రాను మీ ప్రశ్నలు పెరుగుతున్నవే కాని - మీకు తృప్తి కలుగుట లేదు.
పరమేశ్వరుని పద్మ పాద రసము అనే ప్రయోగము గురించి అసలు ప్రస్తావన. ఇది మీకు వచ్చిన సందేహము కాదు. ఇతరులు ఎవరో మీచేత వ్రాయించుచున్నారు అనుటకు ఇంతకంటే నిదర్శనము అక్కరలేదు. పరమేశ్వరుని పద్మ పాదములు అనే సమాసమునకు 3 విధములైన అర్థములు కూడా చక్కగా సరిపోతున్నవి. ప్రతి ప్రయోగమునకు పూర్వ కవి ప్రయోగము చూపించ వలసిన అవసరము నాకు లేదు. స్వస్తి.
అయ్యా నేను చదువుకున్నది ఎం.ఏ తెలుగు . తెలుగు పండిత శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాను . కనుక నాకింక వేరెవరో చెప్పి వ్రాయించుటతో పని లేదు. పూర్వకవి ప్రయోగం అడిగింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు , అసలింతవరకూ సాహిత్యం లో యెక్కడా , 'పద్మ పాదములు ' అని వినని కారణం చేతనే . అసలు అది ఏ సమాసమవుతుందా అని ఆలోచించి ఏలాగునా సమర్థించలేక మిమ్మల్ని అడిగేను. మరీ బొత్తిగా సంధులూ సమాసాలు రాకుండా ఈ బ్లాగులోకే రావలసిన అవసరం లేదు కదా , మీరు 'పూర్వకవి ప్రయోగాలు చూపించవలసిన అవసరం లేదు ' అని కుండ బద్దలు కొట్టిన తరువాత ఇంకా మాట్లాడడానికేమున్నది ? తథాస్తు .
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, నరసింహ మూర్తి గారి ప్రయోగంలో ఏ దోషమూ లేదు. బాలవ్యాకరణం ప్రకీర్ణక పరిచ్ఛేదం 20వ సూత్రం.... ‘చుక్పరక రువర్ణంబునకు ముందఱి దువర్ణంబు నుత్వంబునకు లోపంబు విభాష నగు, నగుచోఁ దత్పూర్వంబు గురువు గాదు’ ఉదాహరణగా అద్రుచు, ఎద్రుచు, పద్రుచు పదాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆచ్ఛిక (అచ్చ తెలుగు) పదాలు. ఇక ‘కద్రువ’ సంస్కృతపదం. దీనికి పై సూత్రం వర్తించదు. నన్నయ గారి ఉదాహరణలు చూడండి.... తరలం. విమలసత్త్వులఁ గోరెఁ గద్రువ వేవురం గడు వేడ్కతో (ఆది.2-3) సీ. కద్రువ కొడుకుల కడకేఁగి యేను మి మ్మందఱ వేఁడెద నన్నలార (ఆది. 2-34) చం. ఇడుగడఁ జేయుచుం గడు సహింపక కద్రువ వానిఁ బిల్చి నా (ఆది.2-42) కం. ఆ కద్రువపుత్రు లశన మయ్యెడు నాకున్ (ఆది.2-116) పై ఉదాహరణలలో ‘కద్రువ’ శబ్దంలోని ‘క’ గురువే. మీ సందేహం తీరిందనుకుంటాను.
గురువు గారికి ధన్యవాదములు. శాస్త్రి గారూ , నేనేమీ అనుకోను . తప్పనిపిస్తే చక్కగా చెప్పండి. అందరి సందేహాలు తీరుతాయి. తీర్చడానికి పెద్దలు గురువులు ఉన్నారు గదా !
నేను ఈ బ్లాగును ఒక కవితా వేదిక గా అనుకోవటం లేదు. ఒక కవితా పాఠశాలగా అనుకుంటున్నాను. కనుక విద్యార్ధులమైన మేము చేసే తప్పిదాలను గురువు గారి ద్వారా దిద్దుకోవటానికే నేను ఈ బ్లాగు పాఠశాలకు రోజూ వస్తున్నాను. ఈ రోజు సమస్యను పూరించటానికి ప్రయత్నించి విసిగి, సమస్యను నాకనుగుణంగా మార్చుకొని ఒక పద్యం వ్రాయటానికి ప్రయత్నించాను. గురువుగారు మరియు ఇతర ప్రాజ్ఞులు చిత్తగించ ప్రార్ధన. (శ్రీ వసంత కిశోర్ గారి comment విని చాలా రోజులైంది. "వామన కుమారా" అంటూ వారు చేసే సంబోధం నాకు చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది.)
శ్రీ సరస్వత్యై నమః: శుభాశీస్సులు. మీరు మిక్కిలి ఆసక్తితోనే అడుగుచున్నారు - కనుక నాకు తెలిసిన విషములను వివరించున్నాను. తెలుగులో నా విద్యాభ్యాసము పి.యు.సి. వరకు మాత్రమే. ఉపమాన పూర్వపద కర్మధారయము మీరు ఎరుగనిది కాదు. వ్యాకరణ పాఠ్యాంశములలో మీరు చూడగలరు. నేను నా మిత్రులను తెలుగు సంస్కృతములలో ఉపన్యాసకులుగా పనిచేసిన వారిని సంప్రదించి సందేహ నివృత్తి గావించుకొనినాను. మా మిత్రులు శ్రీ వారణాసి వేంకటేశ్వర శాస్త్రి గారు (శతావధాని - విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు) ఈ ప్రయోగము చేసిరి అని నేను ఎరుగుదును. "కంజ పదమ్మున కంజలించెదన్" అని వారు శతావధాన సభలలోను అష్టావధాన సభలలోను ప్రార్థన పద్యములలో వాడుచుండెడివారు. ఇప్పుడైనా మీరు ఉపమాన పూర్వ పద కర్మధారయ వ్యాకరణ ప్రతిపాదితమే అని ఒప్పుకుంటారా? స్వస్తి.
కవిమిత్రులారా, ఈరోజు పండిత నేమాని వారు ‘మధ్యాక్కర’లో సమస్యను పూరించారు. దీని లక్షణం కొందరికి తెలియక పోవచ్చునని ఇక్కడ ఇస్తున్నాను. మధ్యాక్కర లక్షణం.... ప్రతిపాదంలో మొదట 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, తరువాత 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం మొత్తం ఆరు గణాలు. నాలుగవ గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉంది. కనుక ప్రాసయతి నిషేధం. ఇంద్రగణాలలో ఐదుమాత్రల గణాలైన నగ, సల, ర, త గణాలు ప్రయోగిస్తే పద్యం నడక బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. * పండిత నేమాని వారూ, కందపాదాన్ని మధ్యాక్కరలో ఇమిడ్చిన మీ పూరణ అందరికీ ఆదర్శప్రాయమైనది. బయట పులి, ఇంట్లో పిల్లి వంటి పరిస్థితిని చక్కగా వివరించారు. ధన్యవాదాలు. * సత్యనారాయణ మూర్తి గారూ, చక్కని విరుపుతో నీతిపద్య మనదగ్గ పూరణ చెప్పారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, కద్రువ ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. విద్రువ, విదురుపు ఈ శబ్దలను ఏ అర్థంతో ప్రయోగించారో అర్థం కాలేదు. * ఊకదంపుడు గారూ, చక్కని భావంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * మిస్సన్న గారూ, ‘దుర్యోధన ఉవాచ’ అన్నట్టు మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీరూ స.నా. మూర్తి గారి బాటే పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘జార్ణి, దుర్వ్యసుడు’ శబ్దాల ప్రయోగమే ఇబ్బంది పెడుతున్నది. ‘దుహితను హింసించె చపల దుర్వ్యసను కడన్’ అందామా? * కిశోర్ కుమార్ గారూ, ‘పద్మనయనాలు’ ప్రయోగం విని ఉంటారు. ‘ఆమెవి పద్మనయనాలు, కంబుకంఠం, కుంభస్తనాలు, సింహమధ్యం, రంభోరువులు’ అంటారు కదా! అలాగే పద్మపాదాలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, దుర్మహిళను ఆశ్రయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. అయినా, సహనం కోల్పోయి నపుడు అలా అలా బయటకు వెళ్ళి రావడమే కాని మీ మరదలిని దూషించే ధైర్యం నాకెక్కడిది?
వామన కుమార్ గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు. కాని సమస్య పాదాన్ని మనకు అనుకూలంగా మార్చుకొనడం తగదు. మీరు ‘పద్యరచన’ శీర్షికలో కొంతకాలం పద్యాలు వ్రాయడం మంచిదని నా సలహా. 1,3 పాదాలలో మూడవ (బేసి) గణాలు జగణాలయ్యాయి. అది గణదోషం. నా సవరణ... బహుకష్టములను పొందియు .......... ఇహలోక మార్గదర్శియె ...........
నమస్కారములు ఇదీ ఇంటింటి సమస్యే ! . అందుకే కాసేపు అలా చెప్పులేసుకుని బయట తిరిగి వస్తారు. కానుకలు గుడా తెస్తారు. [ సందర్భాన్ని బట్టి . ] ఇల్లాలి కోపం చల్లారు తుందని ఎంతైనా మంచి తనం మగవాళ్ళ సొత్తు
మధ్యాక్కర:
రిప్లయితొలగించండిమహిళను దూషించువాడు మాన్యుడు జగతిన్ నిజమ్ము
బహుబంధనములు గల్గించి పట్టిలాగుచునుండు ననుచు
బహు విధముల వేదికపయి పల్కు ప్రగల్భాలు గాని
మహినట్టి వాడె భార్యయెడ మసలు నెంతయు వినయమున
బహుదుర్గతులను గనునిక
రిప్లయితొలగించండిమహిళను దూషించువాడు, మాన్యుడు జగతిన్
మహితాత్ముండన బరగును
మహిళను పూజించువాడె మహినెల్లపుడున్.
మహిలో తాటక పూతన
రిప్లయితొలగించండిమహిళలనే రామ కృష్ణ మాన్యులె చంపెన్
మహిలో నటువంటి చెడ్డ
మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.
అయ్యా శ్రీ గోలి వారూ!
రిప్లయితొలగించండిమీ పద్యము 3వ పాదములో గణభంగము (3వ గణము జగణము) అయినది. సరిజేయండి.
పండిత నేమాని వారూ ధన్యవాదములు.... సవరణ తో...
రిప్లయితొలగించండిమహిలో తాటక పూతన
మహిళలనే రామ కృష్ణ మాన్యులె చంపెన్
మహిలో చెడు వర్తన గల
మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.
మిత్రుల పూరణ లద్భుతము !
రిప్లయితొలగించండిఅహికుల దహనముఁ గోరెను
విహితమ్మగు బందె మాడి విద్రువ తోడన్
సహనము విడి కద్రువ యా
మహిళను దూషించు వాఁడు మాన్యుఁడు జగతిన్ !
[గుడ్డి కన్నా మెల్లమేలన్నట్టు]
రిప్లయితొలగించండిసహియింపలేక వలదన,
దహనమొనర్చగఁదలంచు దైత్యగణమ్ముల్
రహియించుచోట, "పెరయై"
మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.
[దహనమొనర్చగఁదలంచు = Acid తో]
మహిలో నేవురు భర్తల
రిప్లయితొలగించండిమహిళను సతి యనుట తగదు మానుము తండ్రీ
సహియింప జాల పాండవ
మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్.
మహిలో నాశన మొం దును
రిప్లయితొలగించండిమహిళను దూషించు వాడు , మాన్యుడు జగతిన్
మహిళల యున్నతి గోరుచు
మహిళల బ్రేమించు వాడు మదిలో నెపుడున్ .
క్రితంలో ఒక తల్లి అక్రమ సంబంధం కలిగి, పరపురుషుని ఎదుట సొంతకూతుర్ని హింసించిందని చదివిన వార్త ఆధారంగా :
రిప్లయితొలగించండికం. దహియించెడు కామమ్మున
దుహితను హింసించె జార్ణి దుర్వ్యసు నెదుటన్
మహిలోతలపన్ తగనా
మహిళను దూషించువాడు మాన్యుడు జగతిన్
పండిత నేమానివారికి నమస్కారములు.ఇప్పుడే మీ నిన్నటి వ్యాఖ్యను చూచేను.అర్ధ జ్ఞానము గలవాడినంటూ చులకన చేసేరు.కొద్దిగా మనసు నొచ్చుకున్నా మరేం పర్లేదు, మీరు పెద్దవారు కదా , అనవచ్చును . కాకపోతే నా సందేహం పాద పద్మాలకు అర్థం చెప్పమని కాదు, అసలు 'పద్మ పాదాలు ' అని పూర్వ ప్రయోగం ఎక్కడైనా ఉందా - పద్మ యొక్క పాదాలనో పద్మము యొక్క పాదాలనో షష్ఠీ వస్తే వస్తుంది తప్ప , పద్మముల వంటి పాదములు అని ఎలా వస్తుంది అన్నది నా ప్రశ్న .
రిప్లయితొలగించండిపద్మముల వంటి పాదములు అనే విగ్రహవాక్యానికి - పాదపద్మాలు అనే ఉపమానోత్తర పద కర్మధారయమే సరిపోతుంది. లేదా గురువుగారు శంకరయ్య మాష్టారు చెప్పినట్టు పాదములనెడి పద్మాలు అన్నా రూపకమే అవుతుంది
మరి కొత్తగా ఈ ' పద్మ పాదాలు ' యెలా వచ్చిందీ అని మాత్రమే నేను సందేహించాను. పూర్వకవి ప్రయోగం కొరకు అడిగాను .
ఆ లెక్కన ' అబ్జ నేత్రాలు , పద్మ నేత్రాలు ' కూడా ఉన్నాయా ? నేను ' పద్మ పాదుడు ' గురించి లేవనెత్తింది కూడా బహువ్రీహి గురించే .
' అబ్జ నేత్ర , పద్మ నేత్ర ' కూడా ఉంటాయి అయితే బహువ్రీహిగా కానీ నేత్రాలకు ఉపమానం గా కాదు అని అభిప్రాయం. క్షమించాలి .అందువలననే పై అర్థం వచ్చేలా "పద్మ పాదములు " అనే పూర్వ కవి ప్రయోగం కొరకు అడిగేను .
కిశోర్ కుమార్ .
శ్రీ సరస్వత్యై నమః :
రిప్లయితొలగించండిశ్రీ కిశోర్ కుమార్ గారికి ఆశీస్సులు. నేను రచించిన పద్యములలో ప్రయోగములు వ్యాకరణ శుద్ధములా కావా అన్నవి పాఠకులందరకి తెలుసు - శ్రీ శంకరయ్య గారికి బాగా తెలుసు. మీరు వేసిన ప్రశ్నలన్నింటికీ నేనూ సమాధానము ఇచ్చేను, శ్రీ శంకరయ్య గారు కూడా వివరణ ఇచ్చేరు. రాను రాను మీ ప్రశ్నలు పెరుగుతున్నవే కాని - మీకు తృప్తి కలుగుట లేదు.
పరమేశ్వరుని పద్మ పాద రసము అనే ప్రయోగము గురించి అసలు ప్రస్తావన. ఇది మీకు వచ్చిన సందేహము కాదు. ఇతరులు ఎవరో మీచేత వ్రాయించుచున్నారు అనుటకు ఇంతకంటే నిదర్శనము అక్కరలేదు. పరమేశ్వరుని పద్మ పాదములు అనే సమాసమునకు 3 విధములైన అర్థములు కూడా చక్కగా సరిపోతున్నవి. ప్రతి ప్రయోగమునకు పూర్వ కవి ప్రయోగము చూపించ వలసిన అవసరము నాకు లేదు. స్వస్తి.
అయ్యా నేను చదువుకున్నది ఎం.ఏ తెలుగు . తెలుగు పండిత శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాను . కనుక నాకింక వేరెవరో చెప్పి వ్రాయించుటతో పని లేదు. పూర్వకవి ప్రయోగం అడిగింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు , అసలింతవరకూ సాహిత్యం లో యెక్కడా , 'పద్మ పాదములు ' అని వినని కారణం చేతనే . అసలు అది ఏ సమాసమవుతుందా అని ఆలోచించి ఏలాగునా సమర్థించలేక మిమ్మల్ని అడిగేను. మరీ బొత్తిగా సంధులూ సమాసాలు రాకుండా ఈ బ్లాగులోకే రావలసిన అవసరం లేదు కదా , మీరు 'పూర్వకవి ప్రయోగాలు చూపించవలసిన అవసరం లేదు ' అని కుండ బద్దలు కొట్టిన తరువాత ఇంకా మాట్లాడడానికేమున్నది ? తథాస్తు .
రిప్లయితొలగించండిసహకారంబులజేయక
రిప్లయితొలగించండిసహనంబిసుమంతలేక, సర్వంబాశా
వహియై వర్తించెడు దు
ర్మహిళను ధూషించువాడు మాన్యుడు జగతిన్.
శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండితప్పుగా అనుకోకూడదని మనవి. ఎక్కడో చదివినట్టు గుర్తు, విద్రుచు, కద్రువ అనేవి "భ" గణములు కావని, అవి "న" గణములని.
విజ్ఞులు / గురువర్యులు తెలుపవలసినదిగా ప్రార్థన.
అహరహము తగవు లాడుచు
రిప్లయితొలగించండిగహనముగా పనులుచేసి గాసించు మదిన్ !
సహనము గోల్పోయి తుదకు
మహిళను దూషించు వాడు మాన్యుడు జగతిన్ !
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినరసింహ మూర్తి గారి ప్రయోగంలో ఏ దోషమూ లేదు.
బాలవ్యాకరణం ప్రకీర్ణక పరిచ్ఛేదం 20వ సూత్రం....
‘చుక్పరక రువర్ణంబునకు ముందఱి దువర్ణంబు నుత్వంబునకు లోపంబు విభాష నగు, నగుచోఁ దత్పూర్వంబు గురువు గాదు’
ఉదాహరణగా అద్రుచు, ఎద్రుచు, పద్రుచు పదాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆచ్ఛిక (అచ్చ తెలుగు) పదాలు.
ఇక ‘కద్రువ’ సంస్కృతపదం. దీనికి పై సూత్రం వర్తించదు. నన్నయ గారి ఉదాహరణలు చూడండి....
తరలం. విమలసత్త్వులఁ గోరెఁ గద్రువ వేవురం గడు వేడ్కతో (ఆది.2-3)
సీ. కద్రువ కొడుకుల కడకేఁగి యేను మి
మ్మందఱ వేఁడెద నన్నలార (ఆది. 2-34)
చం. ఇడుగడఁ జేయుచుం గడు సహింపక కద్రువ వానిఁ బిల్చి నా (ఆది.2-42)
కం. ఆ కద్రువపుత్రు లశన మయ్యెడు నాకున్ (ఆది.2-116)
పై ఉదాహరణలలో ‘కద్రువ’ శబ్దంలోని ‘క’ గురువే.
మీ సందేహం తీరిందనుకుంటాను.
అహికుల దహనముఁ గోరెను
రిప్లయితొలగించండివిహితమ్మగు బందె మాడి విదురుపు తోడన్
సహనము విడి కద్రువ యా
మహిళను దూషించు వాఁడు మాన్యుఁడు జగతిన్ !
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, కద్రువ వద్ద మరి కొంచెము వత్తి చదువుకొండి .
గురువు గారికి ధన్యవాదములు. శాస్త్రి గారూ , నేనేమీ అనుకోను . తప్పనిపిస్తే చక్కగా చెప్పండి. అందరి సందేహాలు తీరుతాయి. తీర్చడానికి పెద్దలు గురువులు ఉన్నారు గదా !
రిప్లయితొలగించండినేను ఈ బ్లాగును ఒక కవితా వేదిక గా అనుకోవటం లేదు. ఒక కవితా పాఠశాలగా అనుకుంటున్నాను. కనుక విద్యార్ధులమైన మేము చేసే తప్పిదాలను గురువు గారి ద్వారా దిద్దుకోవటానికే నేను ఈ బ్లాగు పాఠశాలకు రోజూ వస్తున్నాను.
రిప్లయితొలగించండిఈ రోజు సమస్యను పూరించటానికి ప్రయత్నించి విసిగి, సమస్యను నాకనుగుణంగా మార్చుకొని ఒక పద్యం వ్రాయటానికి ప్రయత్నించాను. గురువుగారు మరియు ఇతర ప్రాజ్ఞులు చిత్తగించ ప్రార్ధన.
(శ్రీ వసంత కిశోర్ గారి comment విని చాలా రోజులైంది. "వామన కుమారా" అంటూ వారు చేసే సంబోధం నాకు చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది.)
బహుకష్టములనుభవించి
ఇహపర సుఖములను నరులకిచ్చెడు మగువన్
ఇహలోకపు మార్గదర్శి
మహిళను దూషించవలదు మాన్యులు జగతిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిa traial
రిప్లయితొలగించండిశ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. మీరు మిక్కిలి ఆసక్తితోనే అడుగుచున్నారు - కనుక నాకు తెలిసిన విషములను వివరించున్నాను. తెలుగులో నా విద్యాభ్యాసము పి.యు.సి. వరకు మాత్రమే. ఉపమాన పూర్వపద కర్మధారయము మీరు ఎరుగనిది కాదు. వ్యాకరణ పాఠ్యాంశములలో మీరు చూడగలరు. నేను నా మిత్రులను తెలుగు సంస్కృతములలో ఉపన్యాసకులుగా పనిచేసిన వారిని సంప్రదించి సందేహ నివృత్తి గావించుకొనినాను. మా మిత్రులు శ్రీ వారణాసి వేంకటేశ్వర శాస్త్రి గారు (శతావధాని - విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు) ఈ ప్రయోగము చేసిరి అని నేను ఎరుగుదును. "కంజ పదమ్మున కంజలించెదన్" అని వారు శతావధాన సభలలోను అష్టావధాన సభలలోను ప్రార్థన పద్యములలో వాడుచుండెడివారు. ఇప్పుడైనా మీరు ఉపమాన పూర్వ పద కర్మధారయ వ్యాకరణ ప్రతిపాదితమే అని ఒప్పుకుంటారా? స్వస్తి.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిఈరోజు పండిత నేమాని వారు ‘మధ్యాక్కర’లో సమస్యను పూరించారు. దీని లక్షణం కొందరికి తెలియక పోవచ్చునని ఇక్కడ ఇస్తున్నాను.
మధ్యాక్కర లక్షణం....
ప్రతిపాదంలో మొదట 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, తరువాత 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం మొత్తం ఆరు గణాలు. నాలుగవ గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉంది. కనుక ప్రాసయతి నిషేధం.
ఇంద్రగణాలలో ఐదుమాత్రల గణాలైన నగ, సల, ర, త గణాలు ప్రయోగిస్తే పద్యం నడక బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
*
పండిత నేమాని వారూ,
కందపాదాన్ని మధ్యాక్కరలో ఇమిడ్చిన మీ పూరణ అందరికీ ఆదర్శప్రాయమైనది. బయట పులి, ఇంట్లో పిల్లి వంటి పరిస్థితిని చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
చక్కని విరుపుతో నీతిపద్య మనదగ్గ పూరణ చెప్పారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
కద్రువ ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
విద్రువ, విదురుపు ఈ శబ్దలను ఏ అర్థంతో ప్రయోగించారో అర్థం కాలేదు.
*
ఊకదంపుడు గారూ,
చక్కని భావంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
‘దుర్యోధన ఉవాచ’ అన్నట్టు మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీరూ స.నా. మూర్తి గారి బాటే పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘జార్ణి, దుర్వ్యసుడు’ శబ్దాల ప్రయోగమే ఇబ్బంది పెడుతున్నది.
‘దుహితను హింసించె చపల దుర్వ్యసను కడన్’ అందామా?
*
కిశోర్ కుమార్ గారూ,
‘పద్మనయనాలు’ ప్రయోగం విని ఉంటారు. ‘ఆమెవి పద్మనయనాలు, కంబుకంఠం, కుంభస్తనాలు, సింహమధ్యం, రంభోరువులు’ అంటారు కదా! అలాగే పద్మపాదాలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
దుర్మహిళను ఆశ్రయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
అయినా, సహనం కోల్పోయి నపుడు అలా అలా బయటకు వెళ్ళి రావడమే కాని మీ మరదలిని దూషించే ధైర్యం నాకెక్కడిది?
వామన కుమార్ గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
కాని సమస్య పాదాన్ని మనకు అనుకూలంగా మార్చుకొనడం తగదు.
మీరు ‘పద్యరచన’ శీర్షికలో కొంతకాలం పద్యాలు వ్రాయడం మంచిదని నా సలహా.
1,3 పాదాలలో మూడవ (బేసి) గణాలు జగణాలయ్యాయి. అది గణదోషం. నా సవరణ...
బహుకష్టములను పొందియు
..........
ఇహలోక మార్గదర్శియె
...........
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
భార్యా బాధితులకు తప్పదు మరి :
01)
___________________________________
అహరహము భర్త తెగడుచు
బహు బాధల పెట్టు చుండు - భార్యల కెదురై
సహనము సమసిన క్షణమున
మహిళను దూషించువాఁడు - మాన్యుఁడు జగతిన్ !
___________________________________
సహియింపవలెను తప్పుల
రిప్లయితొలగించండిసహచరి తన ధర్మపత్ని సాద్విని మగడున్
మహి నటు చేయక యెట్లగు
మహిళను దూషించువాడు మాన్యుడు జగతిన్?
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఅక్కయ్య గారి బాటే మీరూ పట్టారు. బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
ప్రశ్నార్థకంగా మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిఇదీ ఇంటింటి సమస్యే ! . అందుకే కాసేపు అలా చెప్పులేసుకుని బయట తిరిగి వస్తారు. కానుకలు గుడా తెస్తారు. [ సందర్భాన్ని బట్టి . ] ఇల్లాలి కోపం చల్లారు తుందని ఎంతైనా మంచి తనం మగవాళ్ళ సొత్తు
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిగురుభ్యోనమః
రిప్లయితొలగించండిధన్యవాదములు. తమరి సవరణ బాగుంది.
శ్రీ గురుభ్యోనమః ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమహిలో కైకేయి వలెన్
రిప్లయితొలగించండినహినహి యని పోరుపెట్టు నారీమణినిన్
సహనము తోడన్, కొట్టక
మహిళను, దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్
అహరహము పొన్ను కోరుచు
రిప్లయితొలగించండిదహనము గావించి సుఖము దాహము తోడన్
ఇహమున పరమున కడ్డిడు
మహిళను దూషించువాఁడు మాన్యుఁడు జగతిన్