21, ఏప్రిల్ 2012, శనివారం

సమస్యాపూరణం - 684 (చెప్పునకు లభించె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

చెప్పునకు లభించె చెఱకు తీపి.

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.


10 కామెంట్‌లు:

  1. సద్గురుని పాదుకలటంచు చాల భక్తి
    తనర బూజించి యభిషేకము నొనరింప
    పాలు పానకముల తోడ భక్తు లటుల
    గురుని చెప్పునకు లభించె చెరకు తీపి

    రిప్లయితొలగించండి
  2. చెప్పు చేరియుండె చెత్తకుప్పను భామ
    చేరి వేసె నందు చెరకు పిప్పి
    కుక్క చెప్పు బట్టి మెక్కుచు నుండగా
    చెప్పునకు లభించె చెఱకు తీపి.

    రిప్లయితొలగించండి
  3. పరమ భక్తి గలిగి భర్తను సేవించు
    భార్య దెచ్చె క్రొత్త పాద రక్ష
    పాలు పోసి కడిగి భక్తిగా తొడిగిన
    చెప్పునకు లభించె చెఱకు తీపి
    --------------------------------------
    పరమ దాహ మేసి పానీయము నుత్రాగ
    చెఱకు బండి వాని చెంత నిలచె
    గ్లాసు జారి పడగ యీసురో మనిచూడ
    చెప్పునకు లభించె చెఱకు తీపి

    రిప్లయితొలగించండి
  4. (వాల్మీకి పరముగా)

    దారి దోపిడి జేయునతండొకండు
    వినె మహర్షుల బోధ పొందెను మహోప
    దేశమును తపమొనరించి తేజమొంది
    వరలె చెప్పునకు లభించె చెరకు తీపి

    రిప్లయితొలగించండి
  5. భక్తిభరితుండు భరతుండు పాదుకలనె
    హర్షమును బొంది రాముడే యంచు దలచి
    గద్దె నెక్కించి పాలించి ఘనత నందె
    ధరను చెప్పునకు లభించె చెరకు తీపి.

    రిప్లయితొలగించండి
  6. చెరకు రసము కాక జేయు చుండం గను
    బాన లోన చెప్పు పడుట వలన
    చెప్పునకు లభించె చెరకు తీ పి యకట
    తినగకుక్క , తెలిసె తీ పి యనుచు .

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    ___________________________________


    చేదె లక్ష కోట్లు - చేతివాటము తోడ
    తండ్రి పదవి యూత - తనయు డపుడు !
    చెత్త చుట్టు నేడు - చేరెను కుక్కలు !
    చెప్పునకు లభించె - చెరకు తీపి !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  8. గురువు గారికి ,గురువర్యులందరికి నమస్కారములు
    నేటి రాజకీయ నాయకులకు మహనీయుల కిచ్చిన గౌరవము నిచ్చుట జూచి ఈ విధముగా జెప్పను
    -----------
    నేడు నీతిలేని నేతలకిచ్చిన
    విలువ జూచి జెప్పు విజ్ఞులెల్ల
    కలియుగంబునందు ఖలుడు ధరించిన
    చెప్పునకు లభించె చెఱుకు తీపి|

    రిప్లయితొలగించండి
  9. బట్టలకు దేహరక్షణ భాగ్య, మికను
    పాదరక్షణ భారంబు మేదినిపయి
    నరయ చెప్పునకు లభించె, చెరకు తీపి
    వలెను మధురమా రెండింటి భవము జూడ.

    రిప్లయితొలగించండి
  10. గుండా సహదేవుడు గారి పూరణ....

    రంగితోడిరాజు రాసక్రీడలఁదేల
    చెఱకుఁ దోటఁజేర చెలిని బిల్చ
    సందెవేళజంట'విందుకై'పనిజెప్ప
    చెప్పులకు,లభించె చెఱకు'తీపి'

    రిప్లయితొలగించండి