11, ఏప్రిల్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 674 (కనరాని విశేషములను)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కనరాని విశేషములను కవి కాంచుగదా!

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. వనచరులకు, ఖేచరులకు
  ఘనులౌ సన్ములకింక ఖద్యోతునకా
  యనిలున కమరులకైనను
  కనరాని విశేషములను కవి కాంచు గదా!

  రిప్లయితొలగించండి
 2. సత్యనారాయణ మూర్తిగారు,
  రెండవ పాదంలో ఒక అక్షరం మాయమయినట్టుంది.

  దినకరునకు, దివిటీలకు,
  మనసెఱిగిన వానికైన, మానినికైనన్,
  మనమున విరియు మరులలో
  కనరాని విశేషములను కవి కాంచు గదా!

  మరులు గొన్న మనసులు తెలియలేని విషయాలను కూడా కవి అయితే అందంగా వర్ణించగలడు.

  రిప్లయితొలగించండి
 3. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఏప్రిల్ 11, 2012 7:18:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  వినిపించును మనసారా
  ఘనమగు యీ సృష్టిలోని కమ్మదనంబుల్
  మనసది చక్షువుకాగా
  కనరాని విశేషములను కవి కాంచుగదా!

  రిప్లయితొలగించండి
 4. మనమున పొంగిన భావము
  దనుజులు , దివిజులు , గగనము , తారాపధమున్ !
  కనులకు విందొన రించగ
  కనరాని విశేష ములను కవి గాంచు కదా !

  రిప్లయితొలగించండి
 5. వనముల సౌందర్యములను,
  కనదగు కాంతామణులను, కాంచనశిలలన్
  ఘనమగు బాహుబలమ్ముల,
  కనరాని విశేషములను కవి కాంచుగదా!

  రిప్లయితొలగించండి
 6. ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూ,
  టైపు చేయటంలో ఒక అక్షరం మాయమైంది. సవరిస్తున్నాను.

  వనచరులకు ఖేచరులకు
  ఘనులౌ సన్మునులకింక ఖద్యోతునకా
  యనిలునకమరులకైనను
  కనరాని విశేషములను కవి గాంచు గదా!

  రిప్లయితొలగించండి
 7. శ్రీ సరస్వత్యై నమః :
  మిత్రులందరికి శుభాభినందనలు. ఈ నాటి పూరణలన్నీ బాగున్నాయి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. విమలాంతఃకరణుడు లో
  కముల హితుడు క్రాంతదర్శి కనరాని విశే
  షములను కవి కాంచుగదా!
  సుమనోవందితుడు సర్వ శుభ వీక్షణుడున్

  రిప్లయితొలగించండి
 9. మనముననూహలు చెలగన్,
  జనులవలోకనము చేయజాలని కథలన్,
  యినుడైనను యీ జగతిన
  కనరాని విశేషములను కవిగాంచుకదా.

  రిప్లయితొలగించండి
 10. మనుజుల ,పండిత వర్యుల
  దనుజుల , మఱి మునుల కెల్ల , దల్లుల కైనన్
  వినుమది , తలపుల యందున
  కన రాని విశేషము లను కవి కాంచు గదా !

  రిప్లయితొలగించండి
 11. వనజభవుడు, గణపతియును,
  వనజాప్తుడు, శుక్రుడు కవి వరులనగ యశం
  బును గనిరిక సామాన్యులు
  కనరాని విశేషములను కవి కాంచు గదా

  (వివరణ: పురాణ కవులలో ప్రసిద్ధి కెక్కినవారు
  (1) బ్రహ్మ; (2) గణపతి; (3) సూర్యుడు; (4) శుక్రుడు మొదలగువారు,)

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శ్రీ పండిత నేమానివారికి నమస్కారములతో
  మీ సున్నితమైన హెచ్చరికలకు శతకోటివందనములు.
  కొండల మాటున గాంచెను కనకపురాశులు, ఇది ఇప్పటివరకు ఎవ్వరు కనుగొనలేక పోయినారు.అధికారమందున తాను జేసిన పాపపు పనులను(సంపాదనను) అందరికిపంచి, ఇంతటి మహానుబావుడు లేడు కదా యను రీతిన పరిపాలించిన రాజుపై
  --------
  జనులకు బంచెను ఘనతను
  కనరాని విశేషములను కవికాంచుగదా?
  యనురీతిన, రాజసమున
  కనకపు రాశులను గాంచె కరిశిఖరములన్

  రిప్లయితొలగించండి
 13. అనుమానపునడుము,ఫణికి
  మణి, వెన్నెలదినెడుపక్షి, మరియు సుతునిగాం
  చినతల్లియవస్థలనుచు
  కనరాని విశేషములను కవికాంచుగదా!

  రిప్లయితొలగించండి
 14. కం. కను నింద్రుని వైభవమును
  కను కర్ణుని యీవి క్రీడి ఘనవిక్రమమున్
  కను నొడయని యందెవ్వరు
  కనరాని విశేషములను కవి గాంచు కదా.

  రిప్లయితొలగించండి
 15. ధనరాశులు వెచ్చించియు,
  ఘనయశములు పొందియైన కాలత్రయమున్
  కనగల శక్తిని గలిగియు
  కనరాని విశేషములను కవి కాంచు గదా!

  రిప్లయితొలగించండి
 16. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మహాకవి వాల్మీకి :

  01)
  _____________________________________________


  కనలే డిను డైనను మరి
  కనలే డింద్రుడు సురలును - కనలే రెవరూ !
  కనుగొన నేరికి శక్యము
  కనరాని విశేషములను? - కవి కాంచు గదా!
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 17. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా!
  ఈనాటి సమస్య కవులకు ప్రోత్సాహకరముగా నున్నది. అన్ని పూరణలు చాలా బాగుగనున్నవి. పాల్గొనిన వారందరికీ శుభాభినందనలు.
  1. శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారికి
  2. శ్రీమతి లక్ష్మీదేవి గారికి
  3. శ్రీ శ్రీపతి రావు గారికి
  4. శ్రీమతి రాజేశ్వరి గారికి
  5. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారికి
  6. శ్రీ సుబ్బారావు గారికి
  7. శ్రీ వరప్రసాదు గారికి
  8. శ్రీ శ్యామలరావు గరికి
  9. శ్రీ వసంత కిశోర్ గారికి

  సర్వే జనాః సుఖినోభవంతి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. వినదగునెవ్వరు చెప్పిన
  వినదగు సత్కవుల వాణి విషయవిశేషం
  గనదగు నెవ్వరు చూపిన
  కనరాని విశేషములను కవి గాంచుగదా!

  రిప్లయితొలగించండి
 19. ఘన వరగజ గమనుడు గజ
  మును మును బ్రోవంగ వచ్చు ముచ్చట వ్రాసెన్
  గని నట్టుగ మన పోతన
  కనరాని విశేషములను కవి కాంచు గదా!

  రిప్లయితొలగించండి
 20. గోలి హనుమచ్ఛాస్త్రిగారూ,
  మీ పూరణ సందర్భోచితంగా చాలా బాగున్నది.

  రిప్లయితొలగించండి
 21. ఘనులును నీచులు ప్రజలును
  మునులును యోగులు యతులును ముమ్మూర్తుల్లున్
  ధనికులు పేదలు రాజులు
  కనరాని విశేషములను కవి కాంచుగదా!

  రిప్లయితొలగించండి
 22. మినుముల పచ్చడి తోడన్
  తినుటకు లేకున్న నెయ్యి తిప్పలు పడుచున్
  ఘనమగు కైతల కన్నుల
  కనరాని విశేషములను కవి కాంచుగదా!

  రిప్లయితొలగించండి