కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
దైవశక్తిని హరియించు దనుజబలము.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
దైవశక్తిని హరియించు దనుజబలము.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
వేదభూమిని వసియించు విజ్ఞులార!
రిప్లయితొలగించండిభగవదాధారితంబులీ జగములన్ని,
సత్యమియ్యది నమ్ముడు శ్రద్ధతోడ
దైవశక్తిని, హరియించు దనుజబలము.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________________________
దీను లందరి గాపాడు - స్థిరము నమ్ము
దైవశక్తిని ! హరియించు - దనుజ బలము
దిక్కు లేనట్టి నిర్భాగ్య - దీనులపుడు
దైవమును నమ్మి గొల్చిన - తపన తోడ !
_____________________________________________
నాకవాసులు వేడిరి కైక నిట్లు
రిప్లయితొలగించండిరామభద్రుడు చేపట్ట రాజ్య లక్ష్మి
నసుర నిర్మూల నెట్లు రావమ్మ లేప
దైవశక్తిని, హరియించు దనుజబలము
హరిని దలచిన ప్రహ్లాదుడనఘుడయ్యె
రిప్లయితొలగించండిసుఖములనుగాంచె, త్రికరణశుద్ధిగొలువ
దైవశక్తిని, హరియించు దనుజబలము
సకలశుభములు గలుగును శాశ్వతముగ.
ధర్మరాజాదుల ధనము దైవశక్తి
రిప్లయితొలగించండిధార్తరాష్ట్రుల సంపద దనుజబలము
అప్పుడప్పుడు పైచేయి యగుచునుండి
దైవశక్తిని హరియించు దనుజబలము
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిభక్తిభావము గొప్పగు బలముకన్న
దానవుండైన విడువక ధర్మపథము
భక్తి తత్పరులైనంత బలము కలుగు
ద్వేష చింతన కలిగిన దేవతలకు
దైవశక్తిని హరియించు దనుజబలము.
దేవతలు రాగద్వేషములకతీతులు. కానీ పురాణ కథల ప్రకారము దేవతలు అమృత పానము చేసియుండియూ దేవదానవ సంగ్రామంలో తప:శక్తి సంపన్నులైన దానవులచేతిలో అనేకమార్లు పరాజయంపాలైనారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి02)
రిప్లయితొలగించండి_____________________________________________
శివుని , బ్రహ్మను తప మతి - సేవ జేసి
కోరి పొందిన వరముల - కోపు వలన
దనుజ రాకాసి మూకల - దర్ప మెగయ
దైవ శక్తిని హరియించు - దనుజ బలము !
_____________________________________________
శ్రీ సరస్వత్యైనమః:
రిప్లయితొలగించండిశ్రీ వసంత కిశోర్ గారూ! అయ్యా! నమస్కారములు.
మీ పద్యములో "దనుజ రాకాసి మూకలు" అనే సమాసము బాగులేదు. సవరించండి. స్వస్తి.
చేయగలిగియు, మంచి పని చేయకున్న,
రిప్లయితొలగించండిమనుజ విపరీత నైజము మానకున్న,
రాక్షస ప్రవృత్తియే రాజ్యమేలు
దైవశక్తిని హరియించు దనుజబలము.
(మనుజ విపరీత నైజము అనగా మనుష్య జాతికి వ్యతిరేకంగా నడుచుకునే ప్రవృత్తి అని నా భావము)
బోధ
రిప్లయితొలగించండిమనమునందును దైవమును మనన జేసి,
పరిజనస్ఫూర్తితో ప్రజల సేవ
చేతునను నిశ్చయముతో చెలుము; నమ్ము
దైవశక్తిని; హరియించు దనుజ బలము.
(మనమునందును దైవమున్ స్మరణ జేసి అన వచ్చేమో.)
పై వ్యాఖ్యలలో శ్రీపతి శాస్త్రి గారి పద్యం లో అయిదు పాదాలు ఉన్నాయి. అలా ఎన్ని పాదాలలో పద్యం పూర్తి చేయవచ్చు? తెలియ జేయ ప్రార్ధన.(నాకు ఏదైనా పుస్తకం దొరికే వరకూ ఈ బ్లాగు ద్వారానే నేను నేర్చుకుంటున్నాను.)
రిప్లయితొలగించండికొలవ లేమయ యింతని కొలవ లేము
రిప్లయితొలగించండిదైవ శక్తిని , హరియించు దనుజ బలము
హనుమ నామము దలచిన యా క్షణంబ
రామ భక్తుల కుండును నామ మహిమ
కాలము కలసి రానట్టి వేళయందు
రిప్లయితొలగించండికమల నాభునికైనను కలుగునోటమి
మగధ భూపతికి వెఱచె మాధవుండు
దైవశక్తిని హరియించు దనుజబలము
రెందవ పాదములో గణభంగము జరిగినది. సవరించి మరల post చేస్తా
రిప్లయితొలగించండికాలము కలసి రానట్టి వేళయందు
రిప్లయితొలగించండిపద్మ నాభుడైనను మరి పారిపోవు
మగధ భూపతికి వెఱచె మాధవుండు
దైవశక్తిని హరియించు దనుజబలము!!
దైవశక్తిని హరియించు దనుజబలము
రిప్లయితొలగించండిపెచ్చు పెరిగిన వేళల, పృథివి రక్ష
జేయుటకొఱకు నవతరించి, మము కాచు
చుందువయ్య, శేషశయన! సుందరాంగ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేమాని వారికి ధన్యవాదములతో :
రిప్లయితొలగించండి02అ )
_____________________________________________
శివుని , బ్రహ్మను తప మతి - సేవ జేసి
కోరి పొందిన వరముల - కోపు వలన
దనుజ సంతతి ప్రబలును - దర్ప మెగయు
దైవ శక్తిని హరియించు - దనుజ బలము !
_____________________________________________
వామనకుమారా ! నాకు తెలిసినంత వరకూ ఆటవెలదికీ ,కందానికీ తప్ప
రిప్లయితొలగించండిమిగిలిన వాటికి, కనీసం 4 పాదాలుండే విధముగా యెన్ని పాదాలయినా వ్రాయవచ్చు !
4 రోజుల క్రితము ఏల్చూరివారు 108 పాదాలు వ్రాసారు గమనించ లేదా ?
ఇంకా వివరంగా విఙ్ఞులెవరైనా వివరించాలి !
తపము లొనరించి వరమొందు దనుజు లనగ
రిప్లయితొలగించండిభక్తుడని పొంగి మైకము రక్తి మీర
కోరి వరమిచ్చి పరుగిడె వెఱ్ఱి శివుడు
దైవ శక్తిని హరియించు దనుజ బలము
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
పద్యమునకు ఎన్ని పాదములు?
పాదము అనగా 4వ వంతు అని అర్థము. అందుచేత వాచ్యార్థము ప్రకారము 4 పాదములు ఉండవలెను. ఈ విధముగా ఉండుటే శ్రేష్ఠము. అరుదుగా కొన్ని కొన్ని సందర్భములలో 5వ పాదమును కూడా వేసిన సందర్భములునూ ఉన్నవి. అంతకంటే ఎక్కువ పాదములను వేసిన సందర్భములు కూడా ఉన్నవి. 4 పాదములు దాటినచో అట్టి పద్యమునకు మాలిక అందురు -- ఉదా: ఉత్పలమాలిక, చంపకమాలిక, మొ.వి. ద్విపదలు, సీసమాలికలు, ఉత్పలమాలికలు, చంపకమాలికలు మాత్రమే ఎక్కువ పాదాలతో నుండుట నేను చూచేను. మత్తేభమాలికలతో కావ్యమును ఒక కవి వ్రాసినట్లు విన్నాను. స్వస్తి.
పండిత శ్రీ నేమాని వారికి, శ్రీ వసంత కిశోర్ గారికి ధన్యవాదములు.నా పద్యాల గురించి కూడా కొంచెం చెప్పండి గురువు గారూ.
రిప్లయితొలగించండిఇప్పుడే మన బ్లాగు చూచినాను .ఒకింత నొచ్చుకున్నాను. నా యెడల కొంత అసంతృప్తి బ్లాగు మిత్రులలో ఉన్నట్టు గమనించినాను . శ్రీ శంకరయ్య గారు నాకు ధన్యవాదాలు అంటూనే నామీద ఒక విసురు విసిరిన మిత్రులు శ్రీ విజయకుమార్ గారికి ప్రత్యెక ధన్యవాదాలు చెప్పడం కూడా గమనించినాను.
రిప్లయితొలగించండికొంచెం ఓపికతో నేను మీముందుంచే నలుగు వాక్యాలు చదవండి.
౧ ధవ శబ్దం : మాధవ . భూధవ మొదలైన చోట్ల భర్త అనే అర్ధం లోనే వాడతాము . మిత్రులు పద్యాల్లో భార్య అనే అర్ధం లో ఎలా వాడా రబ్బా అనిపించింది . పూజ్యులు ఏల్చూరి వారు ధవా (దిర్ఘాంతమునకు ) భార్య అని అనవచ్చునన్నారు . ఒక కొత్త విషయము తెలిసినది.. కానీ ఇది పద్యంలో దోషం నివారించగల దా? చింత్యము . అల్లాగే భావి ధవ కూడాను .
౨. నాకు ఎవరినీ నొప్పించే చింతన అసలు లేదని మరోసారి మనవి చేస్తున్నాను . ఒకవేళ నొప్పిస్తే పెద్ద మనసుతో క్షమించమని వేడుకొంటున్నాను.
౩. పద్యం మీద ఉండే మమకారం తో మాత్రమే మీ బ్లాగులోనికి తొంగిచుసినాను.
౪. మిమ్మల్ని చూస్తూనే ఉంటాను కానీ మళ్లీ మీకు మరెప్పుడూ కనిపించనని మనవి చేస్తున్నాను.
౫. పేరు ఎందుకు చెప్పరాదు ? అని ప్రశ్న. నా పేరుని బట్టి నేనొక లబ్ద ప్రతిష్టు డనైతే నేను ఏమి చెప్పినా మీరు నమ్ముతారు . ధైర్యముగా చర్చించరు. కాకపోతే పట్టించుకోరు కూడాను. అందుకే చెప్పలేదు.
౬. కామెంట్ లో అలాంటప్పుడు పేరు చెప్పకుండా వ్రాసే ఆప్షన్ ఉంచనేకూడదు .
సెలవు
భవదీయుడు
-----------------
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ....
రిప్లయితొలగించండిఅసురగుణములు సురగుణం బణగియుండు
మనిషి మనసున, భక్తినే మనము నిలుప
బలము మనమునకు పెరిగి భక్తి లేపు
దైవ శక్తిని, హరియించు దనుజ బలము.
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిమీరు అపార్థం చేసుకున్నారు.
నేను విజయకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినది "అజ్ఞాత" వ్యాఖ్యల వల్ల ఈ మధ్యకాలంలో నేను పడిన ఒక ఇబ్బందిని గురించి ప్రస్తావించినందుకు.
కొద్దిరోజుల క్రితం ఎవరో "అజ్ఞాత" అశ్లీలమైన వ్యాఖ్యలు వ్రాయడమే కాక కొన్ని అశ్లీల వెబ్‌సైట్ల చిరునామాలు ఇచ్చాడు. సమయానికి నేను ఆన్‌లైన్‌లో ఉండి ఆ వ్యాఖ్యలను తొలగించాను.
అతడు మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యలు పంపుతాడేమో అని వ్యాఖ్యల మాడరేషన్ పెట్టి కొద్దిరోజులు చూసి అతడు మళ్ళీ మన బ్లాగు జోలికి రాకపోవడంతో మాడరేషన్ తొలగించాను. అదీ సంగతి. ఈ విషయాన్ని బ్లాగులోను ప్రస్తావించాను కూడా.
మీరు నిరభ్యంతరంగా, నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలను ప్రకటించవచ్చు. అసభ్యత, వ్యక్తిదూషణ లేని వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను.
మాన్యులు శ్రీ అజ్ఞాత గారికి,
రిప్లయితొలగించండిమీ వలెనే నేనుకూడా యాదృచ్ఛికంగా ఈ శంకరాభరణం బ్లాగును చూసి, శ్రద్ధావైసాదృశ్యం లేని దీని నిర్వహణ తీరును, కవిమిత్రుల అవిశ్రాంతదీక్షను, అభినందనీయదక్షతను చూసి అమితమైన ఆశ్చర్యాన్ని పొందాను. ఈ వ్యాసంగానికి వందలాదిగా పాఠకులు, ప్రశంసకులు లేకపోవచ్చు. దీని పరిధి చాలా పరిమితప్రాయమైనదే కావచ్చును. అయినా దీనిని అనారోగ్యానికి సైతం ఓర్చి నియతి తప్పకుండా శ్రీ శంకరయ్య గారు నిర్వహిస్తుండటం (నేను ఈ వ్యాసంగాన్ని చూచి ఎంతో కాలం కాలేదు కద!), పండిత శ్రీ నేమాని గురుదేవులు ప్రతివ్యాఖ్యను మంగళాదిగా, మంగళాంతంగా అందజేస్తుండటమూ, వారి వాక్కులో గోచరీభవించిన పరిశుద్ధాంతఃకరణను చూసి నాకూ పునఃపద్యరచనోత్సాహం ఉదయించి ఎంత పనుల ఒత్తిడి ఉన్నా ఇందులో పాల్గొనటం ఒక అవశ్యంభావిగా భావించాను. ఇది నిమిత్తంగా జీవితంలో ఎన్నడైనా కలుసుకొంటామో, లేదో తెలియని ఇంతమంది సహృదయవిద్వన్మణుల ఆదరానికి నోచుకోగలిగాను. శ్రీ గురుదేవుల గురుత్వాన్ని కోరి వరించాను.
మీ విమర్శసంవిధానమూ ఇదే ఆత్మీయసత్యాన్ని ఆవిష్కరిస్తున్నది. ఇది వైమర్శికమే కాని వ్యక్తినిష్ఠం కాదు. మీరు మీ పరిచయంతో సంబంధం లేకుండా పద్యపరిచాయికను, ప్రాయంతో నిమిత్తం లేకుండా అభిప్రాయాన్ని హాయిగా వెల్లడిస్తూ మార్గదీపనం చేస్తుండండి.
సరస్వతి అనుగ్రహానికి నోచుకొన్న ఏ కవి వాక్యానికైనా స్థితగతిచింతనగా అర్థాన్ని, ఆంతర్యాన్ని పరికించాలని; ఏ విధంగానూ సమర్థన సాధ్యం కానప్పుడు మాత్రమే సవరణకు ప్రయత్నించాలని నా విశ్వాసం. అందుచేతనే ప్రయోగశరణ్యం కాకున్నా ధూఞ్ ధాతువు నుంచి ధవా ప్రతీతి సాధ్యమేమో అని ఆశించాను. ఆ అర్థంలో రచితం కానందువల్ల కాబోలును శ్రీ మిస్సన్న గారు పద్యాన్ని ఉపసంహరించినట్లున్నది. భావి ధవ అంటే కాబోయే భర్తను కలిగిన అన్న చమత్కృతిని ఊహించాను.
మీ వ్యాఖ్యాపంక్తుల మూలాన అస్మదాద్యనేకులకు రచనాసక్తి కలుగుతుంది; రచనాశక్తి పెరుగుతుంది.
అజ్ఞాతనామకా లైనంత మాత్రాన విమర్శలను తొలగింప వద్దని; ఎవరూ వ్యక్తినిష్ఠంగా పరిగణింపకపోవటం మేలు. పరిపరివిధాల చర్చకు అవకాశం ఉంటుంది.
“గుణాః పూజాస్థానం గుణిషు న చ లింగం న చ వయః” – న తు నామధేయః!
తప్పయితే మన్నింప ప్రార్థన.
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు
ఇంతకు ముందటి అజ్ఞాత ఎవరో కానీ , మంచి వాదం చేశారు . "నేనో ముసుగు వేసుకువచ్చి అందరిని , దీని భావమేమి తిరుమలేశ అంటూ " అడిగేస్తాను , నేనెవరో మాత్రం మీకవసరం లేదు అంటూ . అయినా , లబ్ధ ప్రతిష్టుడో కాదో ఎవరూ చూడరు . చెప్పిన విషయం లో పస ఉందా లేదా అనేదే ఎవరైనా గమనించే అంశం . ఇక్కడ ఇంతదాకా పూరణలు కొత్తగా చేసినప్పుడు పండిత నేమాని సన్యాసిరావుగారి లాంటి కవులు , ఏల్చూరి మురళీధర రావు గారు లాంటి కవులూ కొత్తవాళ్లే . వాళ్లు వాళ్లు చెప్పే విషయాలను బట్టి , పూరణల స్థాయిని బట్టి , ప్రతిష్ట అనేది ఏర్పడుతుంది , కాబట్టి పేరు ని బట్టి ప్రతిష్ట కలిగిన వారైతే ఈపాటికి అందరూ అజ్ఞాతల అవతారం ఎత్తవచ్చు .
రిప్లయితొలగించండిరమా అనేది దీర్ఘాంతమైనప్పుడు ,రమ అనే పదం లేదా , అలాగే ధవా కూడా అయ్యుండచ్చు , నిజానికి కామెంట్లు పెట్టడానికి ఏ బ్లాగులో అయినా పేరు అవసరం లేదేమో కానీ , కామెంట్ల పేరు తో ఇతరులను - ప్రశ్నించడానికి మాత్రం పేరు అవసరమే కదా .అశరీరవాణి లాగా అజ్ఞాత లాగా నేను వేరే వాళ్లని ఏమైనా "దీని భావమేమి తిరుమలేశ" అంటానంటే బాగాలేదు.అయినా వారు రాసిన శైలిని బట్టి వారెవరో పోల్చుకోడం ఏమంత కష్టం కాదనిపిస్తోంది .
శంకరయ్య గారికి మీరు కూడా కాస్త ఆలోచించమని విన్నపం .ఇందులో అసభ్యత కాని వ్యక్తిగత దూషణ కాని ఏమాత్రం లేదని మనవి.
విజయకుమార్ .
అజ్ఞాతగారికి నమస్కారములు. అయ్యా మీ సదుద్దేశమును గ్రహింపలేని మూర్ఖుడను. పండితులమధ్యన పామరుడను. నామాటలు పట్టించుకొని మీరు బ్లాగును వీడటము సరికాదు. నేను కేవలం బ్లాగు వీక్షకుడను మాత్రమే. ఇదివరకెన్నడూ బ్లాగులో వ్రాసియుండలేదు. నిన్ననే తొలిసారిగా వ్రాశాను. యితర కవిమిత్రులెవ్వరూ మిమ్ములను అవమానించలేదు. ఈ విషయములో శ్రీ శంకరయ్య గారిని నిందింపవలదని మనవి. మీవిషయముగా కూడా మీ మంచికోరే పేరు వ్రాయమన్నను. ఎందుకనగా యిటీవల బ్లాగులో ఎవరో అజ్ఞాత అసభ్యకరమైన వ్యాఖ్యలు పెట్టినట్లు గురువుగారు తెలిపినారు. అటువంటి అనుమానాలకు అవకాశం లేకుండా వుంటుందనే భావనతో చెప్పినాను.
రిప్లయితొలగించండిమరియు శ్రీపతిశాస్త్రి గారి పద్యములో కూడా "భావిధవ" ఉన్ననూ మీరు పట్టించుకొనలేదు. అందువలన మీరు శ్రీపతిశాస్ర్తి యేమో అని కూడా నాకు అనుమానం వచ్చినది. అందువల్లనే పేరు వ్రాయమని కోరినాను.
నా అజ్ఞానమును పెద్దమనసుతో మన్నించి బ్లాగుకు మీ సేవలు యథావిధిగా కొనసాగించవలసినదిగా ప్రార్థన.
బుధజన విధేయుడు
విజయకుమార్
కదిరి, అనంతపురం జిల్లా.
తే.గీ. దైవ శక్తి ని నమ్ము సతతము దేవ
రిప్లయితొలగించండితలు దనుజులు నమ్మును వారి బాహు శక్తి
కాల మహిమవలన కొన్ని వేళ లందు
దైవ శక్తిని హరియించు దనుజ బలము
విజయకుమార్ పేరుతో వచ్చిన "అజ్ఞాత చెప్పారు" వ్యాఖ్యలోని విజయకుమార్ నేను కాదనియు, దానిక్రింద ఉన్న వివరణ నాది అనియు తెలియజేస్తున్నాను.
రిప్లయితొలగించండివిజయకుమార్
కదిరి, అనంతపురం జిల్లా
గురువుగారికి నమస్కారములు. శ్రీవిజయకుమార్ గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిప్రాజ్ఞులారా, నేను అజ్ఞాత పేరున ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.ఇతరుల పద్యములలో తప్పులను చూపించగలినంత ప్రజ్ఞా పాండిత్యములు నాకు లేవు. . గణములు, యతి ,ప్రాస విషయములలో మిత్రులు ఆత్రమున చేయు పొరపాట్లను అప్పుడప్పుదూ నా పేరుతోనె చూచించాను. ఇటువంటి పొరపాట్లను మా బ్లాగు మిత్రులు సహృదయముతోనే స్వీకరిస్తారు. కానీ అందరకీ పద్యలక్షనాలు తెలుసును. ఆత్రమున, టైపాటున జరిగే పొరపాట్లు మాత్రమే.
ఇక భావపరముగా, పద్యనిర్మాణపరముగా నేను ఏదో తోచినదానిని వ్రాస్తుంటాను. పండితవర్యులైన పెద్దలు తప్పులను సవరిస్తుంటారు. ఆవ్యాఖ్యలు నాకు మానసిక ఆనందమును కలిగిస్తుంది. ఈ బ్లాగులోని మిత్రులెవరితోనూ నాకు ముఖపరిచయము లేదు. కేవలం ఒకరకమైన కలంస్నేహం మాత్రమే. ఈ బ్లాగు పరిచయముతో నేను వ్యక్తిగతముగా విలువకట్టలేనంత మానసికానందమును పొందుచున్నాను. వీలున్నంతవరకూ వ్రాస్తూనేవుంటాను. ధన్యవాదములు.
విజయకుమార్ గారూ కదిరి నరసింహస్వామి మా ఇలవేల్పు.
నమస్కారం.పద్య పరంపరలతో బాటు భావ పరంపరలు కూడా ప్రవహిస్తున్న ఈ ప్రదేశంలో నేను కూడా నా అభిప్రాయాన్ని వ్రాయ సాహసిస్తున్నాను.
రిప్లయితొలగించండిపద్యం ఇలా కాదు.. ఇలా ఉండాలి - అని చెప్పటానికి పేరు ఎంత మాత్రం అవసరం లేదు.కానీ.. పేరు చెప్పినంత మాత్రాన నష్టమూ లేదు. పేరు చెప్పటానికి ఇష్టపడనిచో బలవంత పెట్టవలసిన అవసరమూ లేదు.విగ్రహారాధనను చేయువారు, చేయని వారు - ఇద్దరూ భగవద్భక్తులే కదా!భగవంతుడు ఇద్దరి అభ్యర్ధనలనూ మన్నించును కదా!
అయితే, ఈ భావ పరంపరలలో మా గురువు గారు శ్రీ ఏల్చూరి గారు వ్రాసిన ఒక వాక్యం నన్ను ఆలోచింప జేస్తోంది.
"ఇది నిమిత్తంగా జీవితంలో ఎన్నడైనా కలుసుకొంటామో, లేదో తెలియని ఇంతమంది సహృదయవిద్వన్మణుల ఆదరానికి నోచుకోగలిగాను" - అంటూ వారు వ్రాసిన వాక్యం నేను గుర్తుంచుకుంటాను. ఏదైనా సందర్భంలో ఎంతమంది వీలైతే అంతమందిని ఒకే వేదిక పైకి ఆహ్వానించటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
ఈ సందర్భంగా గతం లో ఒకరు ఈ బ్లాగులో వ్రాసిన ప్రశంసలు ఇక్కడ కాపీ చేస్తున్నాను. పద్యం వ్రాయటానికి ప్రయత్నించినప్పుడు, ఎవరైనా వ్రాసిన పద్యం కరెక్ట్ గా ఉందా లేదా పరిశీలించేటప్పుడు, పద్యం అర్ధం చేసుకునేటప్పుడు నేను పడే టెన్షన్ అంతా కూడా -- ఈ ప్రశంస చదివిన తరువాత తగ్గిపోయింది. మనసుకు హాయిగా కూడా అనిపించింది. మా బంధువులకు, నా ఇష్ట మిత్రగణానికి ఇదే చూపించి సంతసించాను. నా పేరు నేను ఇక్కడ వ్రాయకపోతే ఇది జరిగే అవకాశమే లేదు కదా !
రిప్లయితొలగించండివరప్రసాదు గారి ప్రశంస -
"పెద్దలకు ప్రణామాలు
అందరికి శ్రీ రామనమిశుభాకాంక్షలు, శ్రీ రామనమినాడు శంకరాభరణం బ్లాగునందు విచ్చెయు కవులను ఒక్కసారి పలుకరించి పానకప్రసాదములిచ్చి ఆనందింపజేయుటకు ఈ చిన్నప్రయత్నము .
శంకరాభరణం బ్లాగునందు మాత్రమే దొరకును
శ్రీ శంకరయ్యగారి శంకరాభరణరాగం, శ్రీ పండిత నేమనివారి పళని పంచాంమృతం,శ్రీ వసంతకిశోర్ గారి వసంతరాగం , శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారి గోళీ షోడాలు ,శ్రీ ఏల్చూరి మురళీధరరావు మురళీగానం, శ్రీ లక్ష్మీదేవి (మందాకిని) గారి మడతకాజాలు,శ్రీ ఆదిభట్ల కామేశ్వరరావు గారి ఆదితాళం ,శ్రీ డా. కమనీయం గారి కమ్మని కాఫీ(తేనీరు, ఆంగ్లపదము వచ్చినది),శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి తేనెగారెలు , శ్రీ జిలేబి గారి జిలిబిలి పలుకుల జిలేబిలు,శ్రీ లక్కరాజుగారి లాలిపాటలు, శ్రీ చింతా రామకృష్ణారావుగారి చిత్రదర్శని,శ్రీ మిస్సన్నగారి మినప సున్నుండలు, శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారి సపోటాలు ,శ్రీ శ్రీపతిశాస్త్రి గారి శ్రీఖండము, శ్రీ వామనకుమార్ గారి వడలు, శ్రీ సుబ్బారావు గారి సలివిడి,శ్రీ రాజెశ్వరి నెదునూరి గారి నేతివంటలు , శ్రీ మంద పీతాంబర్ గారి పీచుమిఠాయి
శ్రీ ఊకదంపుడు గారి ఉత్తంసము మఱియు శ్రీ అజ్ఞాత గారి అటుకుల బెల్లము అప్పుడప్పుడు దొరకును అందువలన,
అథిధులందరు అవి దొరకిన క్షణమున విని,తిని,చూచి, సేవించి ఆనందించ ప్రార్థన
తమ భవదీయుడు
వరప్రసాదు"
ఇది నా అభిప్రాయం.
మఱొక్క చిన్న విషయం: మామిడి వేంకటార్యుని శబ్దార్థకల్పతరువులో “ధవ” శబ్దం “విధూననే” అని మనము నిన్న అనుకొన్న అర్థంలోనే “త్రిలిఙ్గీ” అని ఉన్నది. ఆ ప్రకారం ధవః – ధవా – ధవమ్ అన్న మూడు రూపాలూ ఏర్పడుతాయన్నమాట. కాగా, అర్థానర్థాల ఔచిత్యనిర్ణయానికి మాత్రం కవిహృదయమే ప్రమాణమని మనవి.
రిప్లయితొలగించండివిధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు
మంచి ఆసక్తికరమైన చర్చ జరిగింది. అందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిప్రత్యేకించి ఏల్చూరి వారికి. మంచి వ్యాకరణ పాఠం చెప్పినందుకు.
ధవా అన్న దీర్ఘాంతమైన సంబోధనకు సమస్య అనువుగా లేదని నా పూరణను విరమిమ్పజేసుకొన్నానని వారికి తెలియజేసుకొంటున్నాను.
ఇక పేరు ప్రకటన. ఇప్పుడు ఇద్దరు విజయకుమార్ లు దర్శన మిస్తున్నారు.
అయినా పేరులోనేమి పెన్నిధి ఉన్నది, పెద్ద మనసున్డవలెను గానీ.
శుభమస్తు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెద్దలకు గురువులకు నమస్కారములు.
రిప్లయితొలగించండిధవ అనే పదము మీద జరిగిన చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇక అజ్ఞాతల విషయానికి వస్తే మనకు మొదటినుండీ వుండేదే కదా. కాని, చర్చించినట్లు వ్యక్తిగత ధూషణ, అసభ్య, అశ్లీల వచనాలు లేకపోతె చాలు. పద్యాలలో దొర్లే పొరబాట్లను తెలియచెప్పడాని ఎవరైన ( విషయము వున్నవారెవరైనా ) పరవాలేదు. ఇందువలన మనకు కూడ తప్పులు తెలుస్తాయి. ఇటువంటి చర్చల ద్వారా మరికొన్ని విషయాలు తెలుస్తాయి.
ముందుటికి, ఒక పాశ్చాత్య దేశములో ఒకడు ఒక చిత్ర పటాన్ని గీచి ప్రదర్శనకు పెట్టాడట. చాలామంది ఆ చిత్రపటములో ఇది బాగలేదు, అది బాగాలేదు, ఈ రంగు ఇక్కడ
పనికిరాదు, అంటూ వివిధములైన తప్పులను చూపినారట. మరుసటి రోజు, అదే చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ క్రింద ఒక NOTE వ్రాసినాడు - Those who find fault in this picture will have the responsibility to correct. ఒక్కరు కూడ తప్పును చూపడాని సాహసించలేదు.
ఇది మన పద్యరచనలో సాధ్యపడదు. ఎందుకంటే చాలామందికి పద్యలక్షణాలు తెలిసున్నా కూడా, రచన అనేది రాక పోవచ్చు. అందువలన నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా ఎవరనుకొన్నది వాళ్ళు చెప్పవచ్చు. వీలైతే పద్యము వ్రాసినవారే సరిచేయడాని ప్రయత్నిస్తారు. లేదా మనగురువు గారు, శ్రీ నేమాని మయాశయులు, ఇప్పుడు శ్రీ ఏల్చూరి గారు వుండనే వున్నారు కదా.
ఏతా వాతా, చెప్పొచ్చేదెమిటంటే, భావ వ్యక్తీకరణము సరిగా లేని నా పద్యాన్ని కూడ వెనక్కు తీసుకొంటున్నానని అంతే.
ధన్యవాదాలు.
అన్నట్లు ఈ సందర్భంలో ఒక మిత్రునికి ధన్యవాదాలు చెప్పడం మరచి పోయినందుకు చింతిస్తున్నాను.
రిప్లయితొలగించండిఅయ్యా వరప్రసాదు గారూ నా మినపసున్ని ఉండలు మీకు పసందుగా ఉన్నందుకు శతథా ధన్యవాదాలు.
శ్రీ మిస్సన్న గారికి
రిప్లయితొలగించండినమస్కారములు!
దీర్ఘాంతమైన "ధవా" శబ్దం తెలుగులోనికి వచ్చి హ్రస్వాంతంగా "ధవ" అనే ఉంటుంది. పద్యంలో "పల్లవి! ధవ!" అని ఉంటే దోషం కాదని నా భావం.
శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారి "భావి-ధవ" సమాసకల్పనమూ అంతే.
అర్థాన్వయం కారణంగా రెండిటినీ ఉపసంహరింపవలసిన ఆవశ్యకత లేదు.
ఈ అన్వయం రచయిత తెలిసే చేశారా? తెలియక చేశారా? అన్నది కూడా నిర్నిమిత్తమే. అందుకే "స్థితస్య గతి శ్చింతనీయా" అని పెద్దలన్నారు.
ఈ విధమైన నవీనార్థకల్పనమే లేకపోతే భాష ఒడ్డులను ఒఱసుకొనిపోయే ప్రవాహంగా ఎలా విస్తరిల్లుతుంది? "సరస్వత్యా స్తత్త్వం కవి-సహృదయాఖ్యం విజయతే" అని ఎందుకంటారు?
అయ్యా మురళీధరా మీరు సహృదయంతో పదేపదే శ్రమ తీసుకొని నా పూరణకు భావ శుద్ధిని ధ్రువీకరించి ఉనికిని కల్పించారు. ధన్యవాద శతము. నాకు భాషపైనా, వ్యాకరణం పైనా పట్టు లేకపోవడం వలన కలిగే ఇబ్బంది యిది.
రిప్లయితొలగించండిసెలవు.