1, ఏప్రిల్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 664 (రామనామ మనిన)

కవిమిత్రులారా,

శ్రీరామ నవవి పర్వదిన శుభాకాంక్షలు.

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రామనామ మనిన రక్తి రాక్షసులకు.

(ఈ సమస్యను తేటగీతి, ఆటవెలఁది, ఉత్సాహ తదితర చ్ఛందాలలో పూరించవచ్చు)

19 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు ఉదయం లేచే సరికే కరెంటు లేదు. ఇప్పుడే వచ్చింది. అందువల్ల ఆలస్యం జరిగింది. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారి వ్యాఖ్య ......

    శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు సుదీర్ఘమైన 108 పాదముల చంపకమాలికను శ్రీరామచంద్రునికి పుష్పహారముగా సమర్పించుకొనిరి. అది నిత్య పారాయణమునకు తగినట్లుగా నున్నది. మొన్న ఆ మాలికను మన బ్లాగులో అందరము చూచేము. వారిని అభినందిస్తూ ఈ పద్యమును మన బ్లాగులో ప్రకటింపగలరు.

    పరమోత్సాహము మానసాంబుజమునన్ భాసిల్లగా శ్రీమదే
    ల్చురి వంశాభరణుండు రాఘవునిపై స్తోత్రంబు గావించె సుం
    దరమౌ చంపకమాలికాకృతి మహానందంబుతో భక్తులం
    దరు పారాయణ చేయు నామములతో ధన్యుండతండెంతయున్.

    రిప్లయితొలగించండి
  3. గురువువర్యులకు మరియు కవిమిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

    రామనామమనిన రక్తి రాక్షసులకు
    లోద్భవుడు భక్తుడు విభీషణోత్తమునికి,
    ఇతర రాక్షసగణములిదెఱుగలేక
    చింతజెందుచునుండిరి చివరిదాక.

    రిప్లయితొలగించండి
  4. అఘవిదూరుడు(విదారుడు) రాముడే నంచు నమ్మి
    ముక్తి గోరెడు శ్రీరామ భక్తులకును
    రామనామ మనిన రక్తి, రాక్షసులకు
    మహిని ప్రాణాంతకంబు దుర్మార్గులగుట.

    రిప్లయితొలగించండి
  5. దశగళుండును నీలకంధరుని పరమ
    భక్త గణ్యుండు దైత్యుల ప్రభువు పరమ
    సాధ్వి మండోదరీ సాధు హృదయ
    రామనామ మనిన రక్తి రాక్షసులకు.

    రిప్లయితొలగించండి
  6. ఆత్మీయులందరికీ పావన శ్రీరామ నవమీ పర్వదిన సర్వ శుభాకాంక్షలు!

    అనిర్వచనీయమైన వాత్సల్యాతిరేకంతో ఈ శుభపర్వాన ఆశీర్వదించి నన్ను ధన్యధన్యుని కావించిన శ్రీ గురుచరణులకు విహితానేకపాదప్రణామములు.

    ఈనాటి సమస్యకు నా పూరణమిది: అశోకవనిలో శోకసంతప్తయై ఉన్న జానకితో విభీషణుని కూతురు త్రిజట అంటున్న మాటలు:

    రామనామ మనిన రక్తి - రాక్షసుల కులం బాఁచి, యవని ధర్మంబుఁ గాచు
    రామనామ మనిన రక్తి - రాక్షసుల కుపథ మాపి, దాంపత్యవిధము నేర్పు
    రామనామ మనిన రక్తి - రాక్షసుల కునీతిఁ ద్రోచి, ఋతము విజ్ఞాతపఱచు
    రామనామ మనిన రక్తి – రాక్షసులకుఁ, దత్పక్షులకు శాంతిసాధనముఁ జూపుఁ

    బణఁతి జానకి! రాత్రి స్వప్నంబు నందుఁ
    గంటి! నమ్ము మీ త్రిజట వాక్యమ్ము నీవు!
    రక్తి నాకు, మా తండ్రికి; రట్టు కెట్లు
    రామనామ మనిన రక్తి, రాక్షసులకు!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  7. ఆత్మీయులందరికీ పావన శ్రీరామ నవమీ పర్వదిన సర్వ శుభాకాంక్షలు!

    అనిర్వచనీయమైన వాత్సల్యాతిరేకంతో ఈ శుభపర్వాన ఆశీర్వదించి నన్ను ధన్యధన్యుని కావించిన శ్రీ గురుచరణులకు విహితానేకపాదప్రణామములు.

    ఈనాటి సమస్యకు నా పూరణమిది: అశోకవనిలో శోకసంతప్తయై ఉన్న జానకితో విభీషణుని కూతురు త్రిజట అంటున్న మాటలు:

    రామనామ మనిన రక్తి - రాక్షసుల కులం బాఁచి, యవని ధర్మంబుఁ గాచు
    రామనామ మనిన రక్తి - రాక్షసుల కుపథ మాపి, దాంపత్యవిధము నేర్పు
    రామనామ మనిన రక్తి - రాక్షసుల కునీతిఁ ద్రోచి, ఋతము విజ్ఞాతపఱచు
    రామనామ మనిన రక్తి – రాక్షసులకుఁ, దత్పక్షులకు శాంతిసాధనముఁ జూపుఁ

    బణఁతి జానకి! రాత్రి స్వప్నంబు నందుఁ
    గంటి! నమ్ము మీ త్రిజట వాక్యమ్ము నీవు!
    రక్తి నాకు, మా తండ్రికి; రట్టు కెట్లు
    రామనామ మనిన రక్తి, రాక్షసులకు!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  8. భక్తి శ్ర ద్ద ల సేవించు భక్తుల కిల
    రామ నామ మనిన రక్తి , రాక్షసులకు
    గుండె దడ దడ లాడును గుండె పోటు
    కతన , నెవరి కైన కలుగు కాలు భయము

    రిప్లయితొలగించండి
  9. ఉత్సాహ:
    రామ నామ మఖిల భువన రంజకమ్ము సర్వదా
    రామ నామమే విశేష రక్ష సాధుకోటికిన్
    రామ నామమే మహాఫలమ్ము వైరభక్తిలో
    రామ నామ మనిన రక్తి రాక్షసులకు నేనియున్

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులకు మరియు కవివర్యులకుశ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
    గత నాలుగైదు రోజులుగా బ్లాగు శ్రీ రామ నామముతో పావనమవుతున్నందులకు
    మిగుల సంతసముగా నున్నది.
    తే.గీ. రామ రామన్న నామమ్మే ప్రేమ బల్క
    పాప కూపంబు జనులకు జూప దనియు
    రామ నామ మనిన రక్తి, రాక్షసులకు
    సూటి బాణ మై వదలక కాటి కంపు!

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ.....

    అందరకూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

    రామ రావణ సైన్యమ్ము రంగ మందు
    అనికి నిలిచెను, రామరా మను కపులకు
    రామనామ మనిన రక్తి, రాక్షసులకు
    రావణాసుర నామమ్ము రక్తి గొలుపు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సంపత్కుమార్ శాస్త్రి గారికి ,

    ఈ నాటి పూరణ లలో మీ పూరణ బాగున్నది. రాక్షసుల కులోద్భవుడు అనడానికి బదులు రాక్షస కులోద్భవుడు అని ఉంటే చాల బాగుండేది . సమస్య ఆ వెసులుబాటు ఇయ్యలేదు .అయినా రాక్షసుల కులము అని కొనసాగిస్తే - ఉదా . ౨వ పా . లమున బుట్టిన అంటూ పద్యం అల్లితే ఇంకా బాగుండేది .
    ఆలోచించి సవరిస్తారా?

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులారా,
    శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి పరిచయం మన బ్లాగు ద్వారా కలగడం, వారితో సహచర్యం లభించడం వంటి భాగ్యం ఆ వాగ్దేవీకటాక్షప్రసాదమే కాని వేరొండు కాదు. వారి వ్యాసాలు మనకు అవశ్య పఠనీయాలు, జ్ఞానానందదాయకాలు. వాటిని క్రింద పేర్కొన్న చిరునామాల ద్వారా చదివి ఆనందించి, అభినందించ వలసిందిగా మనవి.

    http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr12/vanmayacharitralo.html

    http://magazine.maalika.org/2012/03/19/%E0%B0%AE%E0%B0%B1%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%AA%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని వారూ,
    శ్రీ ఏల్చూరి వారు తప్పక అభినందనీయులు. వారి ప్రతిభను ప్రశంసించగల శబ్ద భావ సంపద నాకు లేదు. వారికి సర్వ శుభాలు కలుగు గాక!
    ఉత్సాహంగా వైరభక్తిని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అజ్ఞాత గారు చెప్పినట్లు మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సత్య నారాయణ మూర్తి గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    "రాముడే నంచు" అన్నారు. అక్కడ "రాముడే యంచు" అంటే నిర్దోషంగా ఉంటుంది.
    *
    మిస్సన్న గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    కాని ఎందుకో అన్వయం కుదరనట్లు తోస్తున్నది. మరొకసారి పరిశీలించండి.
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని ప్రస్తావించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    అయితే మీ సీసపద్యంలో 3, 4 వ పాదాలలో గణ దోషం ఉంది. ఒకసారి పరిశీలించండి.
    ఎత్తుగీతిలో "పడఁతి"కి ... "పణఁతి" అని టైపాటా?
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    devjisaha (గుండా సహదేవుడు ?) గారూ,
    "రామపదమందు మరుగుమం దేమి కలదొ?" అన్నారు మా గురువు గారు. అది ఎప్పుడు ఎన్నిసార్లు తలచుకొన్నా అనిర్వచనీయమైన ఆనందాన్ని కల్గిస్తుంది.
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "రంగమందు అనికి" అని విసంధిగా, "రామ రామ +అను" అన్నచో యడాగమం రావలసి ఉండగా సంధి చేసారు. వీలైతే సవరించండి.
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. రామ నామ మనిన రక్తి రామదూత కెన్నడున్
    రామ నామ మనిన రక్తిరా గనంగ శబరికిన్
    రామ నామ మనిన రక్తి రావణానుజునకు నౌ
    రామనామ మనిన రక్తి రాక్షసులకు వింతయా!

    రిప్లయితొలగించండి
  16. రామ మహిమను దెలిసిన రావ ణుండు
    కోరి మరణించి తరియించ పోరు సలిపి
    శాప నిష్కృతి కలిగించు పాప హరము
    రామ నామ మనిన రక్తి రాక్షసులకు

    రిప్లయితొలగించండి
  17. మాన్యులు శ్రీయుత శంకరయ్య గారికి
    నమోవాకములు.

    ఎల్లలు లేని నిండైన మీ ఆత్మీయతకు, ఆదరణకు, సహృదయతకు, సౌజన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ జన్మలో చేసికొన్న పుణ్యమో ఈ రూపంలో ఫలించి, మీరు పఱిచిన వెలుగుబాటలో నేను నడక నేర్చుకొన గలుగుతున్నాను.

    పద్యపాదాలను ఇలా సవరించాను:

    రామనామ మనిన రక్తి - రాక్షసుల కులం బాఁచి, యవని ధర్మంబుఁ గాచు
    రామనామ మనిన రక్తి - రాక్షసుల కుపథ మాపి, దాంపత్యవిధము నేర్పు
    రామనామ మనిన రక్తి - రాక్షసుల కునీతిఁ ద్రోచి, ఋతము జ్ఞాతపఱచు
    రామనామ మనిన రక్తి – రాక్షసులకుఁ, దాచ్ఛీల్యశాంతిసాధనముఁ జూపుఁ

    బణఁతి జానకి! రాత్రి స్వప్నంబు నందుఁ
    గంటి! నమ్ము మీ త్రిజట వాక్యమ్ము నీవు!
    రక్తి నాకు, మా తండ్రికి; రట్టు కెట్లు
    రామనామ మనిన రక్తి, రాక్షసులకు!

    "పణఁతిని గొనిపోయి పంక్తికంపంక్తికంధరుఁడు,
    రణమునఁ జావఁడే రఘురాము చేత"
    - అని, బాణాల శంభుదాసు ద్విపద సారంగధర చరిత్ర.

    పునస్తే నమస్తే!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    రామ నామ మనిన రచ్చ - రక్కసులకు
    రామ నామ మన్న రభస - రాక్షసులకు
    రావణుని గూడి తోడుగ - లయము జెంద !
    రావణుని వీడి ,భయమది - రగులుకొనగ
    రాముని మనమున దలచి - రక్షకుడని
    రాము చెంతకు జేరి శ - రణ మనంగ
    రామ నామమన్న రక్తి - రాక్షసులకు !
    _____________________________________________
    రచ్చ= కలకలము
    రభస = అల్లరి

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ లేటెస్ట్ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    నా మాటను మన్నించి సవరించినందుకు ధన్యవాదాలు.
    అవగాహన లేక తొందరపడి "పణఁతి" శబ్దం టైపాటు అనుకున్నాను. మన్నించండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి