27, ఏప్రిల్ 2012, శుక్రవారం

పద్య రచన - 9


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. దేవవ్రతుడు దాశరాజుతో :

    01)
    ___________________________________


    పంచ భూతాల సాక్షిగా - పలుకు చుంటి
    పరిణయమ్మాడ నా తండ్రి - పడుచు నీదు
    నీదు మనుమడె యువరాజు - నిక్కువముగ
    నిజము నిజమిది నామాట - నిజము నమ్ము !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  2. అంతకు ముందుగా దాశరాజు దేవవ్రతునితో :


    02)
    ___________________________________


    పడుచు నిమ్మని యడిగిన - పడుచువాడ
    పడుచు నిచ్చిన మారాజ , - ప్రభువునకును
    నాదు మనుమడె యువరాజ, - వాదు లేక
    నీదు రాజ్యమ్ము పాలింప - నీయ గలను !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  3. నీ మనుమడే రాజ్యము నేల గలడన్న దేవవ్రతునితో దాశరాజు:

    03)
    ___________________________________


    నీవు యొప్పిన యొప్పునే - నీదు భార్య ?
    నీదు పిల్లలు నీమాట - కాదు యనిన
    నీదు మాటలు చెల్లునే - నిశ్చయముగ ?
    నిజము పల్కుము మారాజ, -నిర్ణయంబు !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  4. పిమ్మట దేవవ్రతుడు దాశరాజుతో :

    04)
    ___________________________________


    నీదు మాటల గలదులే - నిజము కొంత
    గాన , నే నిక పెండ్లినే - మాను కొనుదు !
    సూర్య చంద్రుల సాక్షిగా - నార్య , వినుము
    పలుకు చుంటిని నామాట - పరమ గరుణ !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  5. మరల దేవవ్రతుడు దాశరాజుతో :

    05)
    ___________________________________


    శంక లన్నియు తీరెనా - సాధు చరిత
    శంక లేకను నా తండ్రి - శంతనునకు
    సత్యవతినిచ్చిపరిణయం - సలుపు మయ్య !
    సకల ధర్మము లెరిగిన - సజ్జనుండ !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  6. అటు పిమ్మట దేవవ్రతునితో దాశరాజు:

    06)
    ___________________________________


    అనిన వినినంత దాశరా - జపుడు బల్కె
    ధర్మ మూర్తివి మారాజ, - తరుణి నికను
    శంత రాజుకు నిత్తు నే - శంక వలదు !
    సకల శుభములు బడయుమో - సత్య వ్రతుడ !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  7. మనమున నిల్పి శంతనుడు మానిని యోజనగంధి విశ్వమో
    హన శుభలక్షణాంగన నహర్నిశమున్ వివశత్వమొందగా
    తనయుడు జాహ్నవీసుతుడు తండ్రి పరిస్థితి గాంచి చింత దీ
    ర్చెను ప్రమదమ్ము గూర్చెను విశేష యశోవిభవాభిరాముడై

    చనె గాంగేయుడు దాశరాజు కడకున్ సౌజన్య మేపారగా
    వినిచెన్ తండ్రి మనోరథ మ్మతనికిన్ వేడ్కన్ దదీయాత్మజా
    తను దానంబిడుమయ్య తండ్రికని శుద్ధ స్వాంతుడై వేడి యా
    తని ప్రత్యుత్తరమున్ గ్రహించి యనె నత్యంత ప్రమోదమ్ముతో

    విను నీ దౌహిత్రుండే
    తనరు మహీనాథు డగుచు తథ్యము నేనొ
    ల్లను రాజ్యము, పరిణయమే
    నిననుచు శపథమ్ము జేసె నిండు మనముతో

    ఒనరించెను తగు శపథం
    బును భీష్మమ్ముగ నటంచు పుడమి నతని పే
    రును భీష్ముడనుచు నొప్పెను
    వినువీధిన్ గురిసె పుష్పవృష్టి యతనిపై

    రిప్లయితొలగించండి
  8. అప్పుడు దివి నుండి దేవతలు :

    07)
    ___________________________________


    దేవతలు గూడి దివినుండి - దీవెనలను
    దేవ వ్రతునకు భీష్ముగా - దిక్కు లదర
    నామ మొనరించి రావేళ - నయము గాను
    దేవ దుంధుబుల్ మోగించి - దీప్తి వెలయ !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  9. వసంత కిశోర్ గారూ,
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    కందుల వరప్రసాద్ గారూ,
    మిస్సన్న గారూ,
    ఇంత వరకు మీరు ‘శంకరాభరణం’లో ప్రకటించవలసిందిగా పంపిన సమస్యలను ఒక చోట చేర్చి ఒక్కొక్కరి పేర విడివిడిగా ఫైళ్ళు తయారు చేసి సేవ్ చేసి పెట్టాను. మీ మీ మెయిల్ చిరునామాలకు పరిశీలనార్థం పంపాను. ఒకసారి మీ మెయిల్స్ చెక్ చేసుకొని మీరు పంపిన సమస్యలలో ఏమైనా తప్పిపోయాయా గమనించి, అవసరమైన సవరణలు చేసి పంపవలసిందిగా మనవి.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీరు పంపిన సమస్యలు కూడా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  10. ఘనుడాదిత్యుడు, పంచభూతములు సాక్ష్యంబౌచు వీక్షించగా
    విను సత్యంబిది, దాశరాజ! పలుకుల్ వేరేల? యుద్వాహమున్
    మనమందైనను దల్పబోను కనుకన్ మాన్యన్, సుతారత్నమున్
    ననుగన్నట్టి మహాత్ముకిమ్ము దయతో నామాటలాలింపుమా!

    మాట దప్ప బోను, మార్తాండహిమకరుల్
    గతులు దప్పవచ్చు గాని యనుచు
    స్థిరతబూని నిల్చి దేవవ్రతుడు తాను
    ప్రతిన బూనె నంత భళి యనంగ.

    రిప్లయితొలగించండి
  11. పెద్దలకు నమస్కారం,
    ఆర్యా!
    "ఘనుడాదిత్యుడు" అనే పద్యంలో ఉదయం తొందరలో "మనమందైనను","మహాత్ముకిమ్ము" అనే పదాలు వాడటం జరిగింది. ఇటువంటి పదాల సాధుత్వాసాధుత్వాలగురించి గతంలో కొంత చర్చ జరిగినట్లు గుర్తుకు వచ్చి పద్యాన్ని క్రింది విధంగా మార్చి వ్రాస్తున్నాను. యుక్తాయుక్తాలు పరిశీలించవలసినదిగా ప్రార్థన.

    ఘనుడాదిత్యుడు, పంచభూతములు సాక్ష్యంబౌచు వీక్షించగా
    విను సత్యంబిది దాశరాజ! పలుకుల్ వేయేల, "యుద్వాహమం
    చనబోనెప్పుడు, దాల్చబోను మదిలో" నార్యన్, సుతారత్నమున్
    ననుగన్నట్టి మహానుభావునకు సన్మానంబుగా గూర్చుమా!

    రిప్లయితొలగించండి
  12. సత్యవతి నిమ్ము నాతండ్రి శంతనునకు
    శాంత నుండను గోరుదు సజ్జ నుండ !
    అడ్డు రాబోను నతనికి నంచు పలికి
    ధర్మ నిరతుని నమ్ముము దాస రాజ !

    రిప్లయితొలగించండి
  13. మత్స్య గంధిని మనువాడ మనసు పడిన
    శంతనుని కోర్కె దీర్చుము హితము గోరి
    బ్రహ్మ చారిగ నేనుండి ప్రతిన బూని
    నీదు మనుమడె రాజౌను వాదు లేల ?

    రిప్లయితొలగించండి
  14. వసంత కిశోర్ గారూ,
    మీ ఏడు పద్యాలను కలిపితే ఒక చక్కని ఖండిక అవుతున్నది.
    మూడవ పద్యంలో ‘నీవు యొప్పిన, కాదు యనిన’ అని యడాగమం వేసారు. ‘నీవె యొప్పిన, కాదటన్న’ అంటే సరి.
    ఐదవ పద్యంలో ‘పరిణయం’ అని ముప్రత్యయానికి బదులు అనుస్వారం పెట్టారు. ‘పెండ్లిని సలుపు’ అందాం.
    ఆరవ పద్యంలో ‘శంత రాజు’ అన్నారు. ‘శంతనునకు నే నిచ్చెద’ అంటే బాగుంటుందని నా సూచన.
    మొత్తానికి మంచి పద్యాలను అందించారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ ‘భీష్మప్రతిజ్ఞ’ ఖండిక మిమ్మల్ని ‘యశోవిభవాభిరాములను’ చేయడానికి అన్ని విధాల అర్హమై ఉన్నది. ఇంత చక్కని పద్యాలని అందించినందులు ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    అద్భుతమైన పద్యాలు మీవి. చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘శంతనుని కోర్కె దీర్చుము శంక వీడి’ అందాం.

    రిప్లయితొలగించండి
  15. దాశ రాజ మీ మనసునం దాశ గని వి
    వాహ మాడననింటిదే వ్రతము నాకు
    వ్రతము దప్పిన నే దేవవ్రతుడ గాను
    కూతు నిమ్మయ్య మాతండ్రి కోర్కె దీర.

    రిప్లయితొలగించండి
  16. చిన్న సవరణ తో...

    దాశ రాజ మీ మనసునం దాశ గని వి
    వాహ మాడననంటిదే వ్రతము నాకు
    వ్రతము దప్పిన నే దేవవ్రతుడ గాను
    కూతు నిమ్మంటి మాతండ్రి కోర్కె దీర.

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !

    దాశరాజు(జానపదుడు) ఇలాగే పలుకుతాడు "శంతరాజు"/మారాజు/పెద్దరాజు " అని నా ఉద్దేశం .
    రాజు తగిలించకుండా వఠ్ఠి పేరుతో రాజు గురించి చెప్పడం
    (శంతనునకు అని) దాశరాజుకు సాధ్యమా ? అదీ యువరాజుతో ?

    రిప్లయితొలగించండి