కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
బెదరె దుశ్శాసనుం గని భీముఁ డపుడు.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
బెదరె దుశ్శాసనుం గని భీముఁ డపుడు.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండి15-4-2012 (ఆదివారం) నాడు మా అబ్బాయి వివాహం. ఆ పనుల్లో వ్యస్తుణ్ణై ఉండడం వల్ల బ్లాగుకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేక పోతున్నాను. మన్నించండి.
కర్ణుడే గెల్చె క్రీడి వివర్ణుడయ్యె
రిప్లయితొలగించండిబెదరె దుశ్శాసనుం గని భీముడపుడు
యమతనూజుండు చనెను సన్యాసి యగుచు
ననుచు దుర్యోధనుడు కల గనెను వేడ్క
రాక్షసత్వాన సభకీడ్చి రభస చేయు
రిప్లయితొలగించండిదుస్ససేనుని చర్యకు ద్రుపదపుత్రి
బెదరె, దుశ్శాసనుంగని భీముడపుడు
రౌద్రముననూగి చంపగ ప్రతినబూనె.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఘోషయాత్రను చేయగ ఘోరముగను
చావు దెబ్బలు కోర్చె దుశ్శాసనుండు
బెదరె దుశ్శాసనుం, గని భీముఁ డపుడు
గేలి జేయుచు కాపాడె కృపను జూపి
సవరణ
రిప్లయితొలగించండిఘోషయాత్రను చేయగ ఘోరముగను
చావు దెబ్బలు కోర్చి దుశ్శాసనుండు
బెదరె, దుశ్శాసనుం గని భీముఁ డపుడు
గేలి జేయుచు కాపాడె కృపను జూపి
శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారూ నిన్నటి సమస్య గూర్చి మీ ప్రశంసలకు కృతజ్ఞతలు. శుభాశీస్సులు. స్వస్తి.
రిప్లయితొలగించండిదుస్స సేనుడు సిగ బట్ట ద్రుపద పుత్రి
రిప్లయితొలగించండిబెద రె , దుశ్శా శనుం గని భీ ము డపుడు
రౌద్ర మూర్తి యై చంపగ నుద్య మించె
ఆలి రక్షణ ముఖ్యము హరున కైన
ప్రతిన తీరంగ వక్షంబు పట్టి చీల్చి
రిప్లయితొలగించండిరుధిర మానంగ నుంకించి ధ్రోహి వీని
తనువు నిలువెల్ల విషమేమొ యనుచు చాల
బెదరె దుశ్శాసనుం గని భీముఁ డపుడు
అన్న మాట పాలించెద ననగ సభయె
రిప్లయితొలగించండిబెదిరె దుశ్శాసనుంగని; భీముడపుడు
రౌద్రరూపము దాల్చి వీరమును జూపి
ప్రతిన చేసె "తీసెద నీదు ప్రాణ"మంచు.
అయ్యా శ్రీ శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిచాలా మంచి శుభ వార్త తెలియజేసేరు. అభినందనలు. శుభం భూయాత్.
శ్రీ శంకరయ్య గారికి నమస్కారం.
రిప్లయితొలగించండిమంచి శుభవార్త తెలియజేశారు. అభినందనలు.
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
నేటి సమస్యను గురించి మంచి మంచి పూరణలే వచ్చేయి.
మన బ్లాగులోని సభ్యులందరికి సమస్యాపూరణలో చేయితిరిగినది అని హాయిగా చెప్పగలను. అందరికి పేరు పేరునా శుభాభినందనలు. చాల మంది నా పూరణలు చూచి అభినందించుటతో నాకు చాలా ఉత్సాహముగా నుంటున్నది. ఈరోజు పూరణలను ముచ్చటించుదాము:
1. శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారు: బాగున్నది మీ పూరణ. ద్రుపదపుత్రి బెదెరె అని బాగుగా విరిచేరు.
2. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: ఘోషయాత్రలో దుశ్శాసనుడు చావుదెబ్బలు తిని బెదిరె అని పూరించేరు. బాగున్నది.
3. శ్రీ సుబ్బా రావు గారు: ద్రుపదపుత్రి బెదిరె అని మంచి విరుపుతో వ్పూరించేరు. బాగున్నది.
4. శ్రీ శ్యామలరావు గారు: ఈ మధ్య వీరు చాల బిజీ అయ్యేరు. మళ్ళీ ఈనాడు కనిపించేరు. చాలా సంతోషము. వీరు ఇంకా ఇంకా ప్రోత్సాహమును అభ్యుదయ కవులకు గూర్చాలి అని కోరుచున్నాను. దుశ్శాసనుని శరీరమంతా విషమేమో అని భీముడు భయపడెను అని సమర్ధించిన విధానము చాలా బాగున్నది. వీరి పద్యము కూర్పు భావము చాలా బాగున్నవి.
5.శ్రీమతి లక్ష్మీదేవి గారు: వీరు మంచి ఉత్సాహమును నింపుచున్నారు సభ్యులందరికి ఆదర్శముగా. కౌరవ సభయె బెదరె అని చక్కగా పూరించేరు.
ఒడ్డి ఒడ్డోలగమ్మున కీడ్చి తెచ్చె
రిప్లయితొలగించండిపంచ భర్తృక లుండిన ఫలిత మేమి
భీత హరిణిగ దిక్కులు పిక్కటిల్ల
బెదిరె దుశ్శానుం గని భీము డపుడు .!
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువు గారూ ! మంచి శుభ వార్త చెప్పినందులకు ధన్య వాదములు. వధూ వరులకు + మీ దంపతు లిరువురికీ శుభా కాంక్షలు
imou dampatii chiram vardhitaam
రిప్లయితొలగించండిamitaa nandou bhuuyoo vardhitaam
గురువు గారూ సంతోషం. శుభమగు గాక.
రిప్లయితొలగించండిశంకరార్యా ! సంతోషం.నూత్న వధూవరులకు అభినందనలు.
రిప్లయితొలగించండిచేత బట్టుక కృష్ణను చీరె లాగు
నటన జూపక జీవించు నటుని జూచి
రయము నాపగ నాటక రంగ మందు
బెదరె దుశ్శాసనుం గని భీముఁ డపుడు
శంకరార్యా ! శుభాభినందనలు !
రిప్లయితొలగించండి