వీరచరితమనే సంస్కృత నాటకంలో వాలి రావణుని ప్రోద్బలంతో రాముణ్ణి ఎదుర్కొని మరణిస్తాడు. (చెట్టుచాటు నుండి ధీరోదాత్త నాయకుడు బాణం వేయడం దృశ్యకావ్యంలో అనౌచిత్యమని ఈ కల్పన). ఆ నాటకానుసారం -
ఎవరెవరికి నమస్కరిసున్నారు? వాలి రామాభిముఖుడై నమస్కరిస్తున్నాడు. బాగుంది. తారాసుగ్రీవులు వాలికి నమస్కరిస్తున్నారు. చిత్రకారుడి ఉద్దేశం అందరూ రాముడికి నమస్కరిస్తున్నారని అయితే చిత్రం అట్లాగు రాలేదు. తారాసుగ్రీవులు రామాభిముఖులై లేనే లేరు. వాలి ప్రక్కన అతడి ఆయుధం గద ఉన్నది. సుగ్రీవుడి గద చిత్రంలో లేదు. పెద్ద దోషం కాదు కాని ఉంటే సరిగా ఉండేది. వాలి సుగ్రీవుల ఒడళ్ళపై యుద్ధ్దపు గుర్తుగా గాయాలేమీ లేవు. ఇరువురూ బడలినట్లే లేరు. సుగ్రీవుడు బడలినట్లుండటెమే న్యాయం. వాలి వక్షస్థలంపైన రామబాణం నాటి ఉంది కాని ఒక్క చుక్క రక్తం కూడా లేదు. అది తప్పు. ముఖ్యంగా చిత్రంలోని తారతో సహా యెవరి ముఖంలోనూ కించిత్తుగా కూడా విషాదపు ఛాయలు లేవు. ఇదీ తప్పే. వాలి గద వాలి తోకపైన ఉన్న తీరుకూడా తప్పే. వాలి పడిపోయాక అతడిగద అతడి తోకపైన పడి ఉంటే తోకలో ఒక భాగం గద పైకి ఉండటం జరుగదు కదా. అన్నట్లు సుగ్రీవుడి మెడలో పూలమాల యేదీ - రాముడు ఆనవాలుగా వేసినది? తీసి వేసాడనుకోవాలా? ఈ చిత్ర నేపధ్యం కూడా ఒక చిన్న పచ్చిక మైదానం (lawn) లాగా ఉన్నది కాని అరణ్యభూమిలాగా లేనే లేదు. వాలి సుగ్రీవులు అచ్చం ఒకలాగే ఉండాలి - ఇది మాత్రం దాదాపుగా సిధ్ధించినట్లే.
వసంత కిశోరులవారూ రామచంద్రుకున్ అన్నది సరైన ప్రయోగం కాదండీ రామచంద్రునకున్ అన్నదే సాధువు. కాబట్టి మార్పు చేయండి తగినట్లు. అదీ గాక మీ ముందుగ హెచ్చరించితివి... పద్యం నాకు సరిగా అన్వయం కుదరటం లేదు. ఒక వేళ పొరబడుతున్నానేమో. అలాగే ముందుగ జెప్పితేని.. పద్యం నడక, అన్వయం రెండూ కొంచెం ఇబ్బండి పెడుతున్నాయి. వారి మూడ పద్యం పొందెద స్వర్గమే... లో గాచుమో బదులు గావుమో అంటే బాగుంటుంది. అలాగే దుర్విధిన్ అనేబదులు దుస్థితిన్ అంటే బాగుంటుంది. వందిత సుందర ప్రయోగం యతికోసమేనని స్పష్టమే కాని సుగమంగా లేదు నాకు.
సంపత్కుమారులవారి పద్యం ధారాశుధ్ధితో ఉన్నది.
మూర్తిగారి పాపము చేసినావయిన... పద్యంలో సోదరుడున్ సతి చేసిరంజలుల్ అన్నప్ప్పుడు ఇతరులెవ్వరో పద్యంలో స్పష్టం గావటంలేదు గద. కొంచెం పద్యం సరిజేయవలసి ఉంటుంది.
నేమానివారి స్వామిన్ బంపితికాదె... పద్యంలో 'జాగొనరింప వద్దనెను' బదులుగా 'జాగొనరింప బోకుమనె' అంటే నడక మరింత బాగుంటుందని నా అభిప్రాయం.
రవి గారి రావణాసురు డుసి గొల్ప ... పద్యంలో సంధి విసంధులు రెండూ పాటించారు. ఫరవాలేదు. పద్యం బాగుంది.
జిలేబీ గారి ప్రత్యేక వచన కవితలో 'వందన పరివారం' కన్నా 'వందనం పరివారం' అంటే సబబు.
శ్రీ సరస్వత్యై నమః : మిత్రులారా! మన మిత్రులు శ్రీ శ్యామలరావు గారు మంచి సూచనలను చేస్తున్నారు. సంతోషము. నేను వ్రాసిన పద్యములో వారి సూచన ప్రకారము -- ఫలాన పదములను మార్చితే ఇలాగ -- ఇంకా నడక బాగుంటుంది అని. సాధారణముగా ఒక కవిగా నేను నా పద్యమును ప్రకటించేను అంటే అన్ని విధాలా నేను బాగున్నది అనుకొనిన తరువాతనే కదా. మిత్రులు గుణ దోషాలను సూచించుట సబబే, కాని నడక బాగుండుట కొరకై పదములను మార్చాలి అంటే ఎలాగ. నాకంటే ఒక గొప్ప కవి తప్పకుండా ఇంకా మంచి పదములను వేయకలడు. అందులో సందేహములేదు. నా సత్తువ ఎంతో నేను అంతే చేయగలను. అందుచేత ఇటువంటి విషయములలో సూచనలను చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచించుట మంచిది. మన శంకరయ్య గారు ఒక పరిష్కర్తను పెట్టి అన్ని పద్యములను అన్ని కోణములలో బాగున్నవి అని చెప్పినపుడే ప్రచురిస్తే బాగుంటుందేమో?
నేమానివారి స్వామిన్ బంపితికాదె... పద్యంలో 'జాగొనరింప వద్దనెను' బదులుగా 'జాగొనరింప బోకుమనె' అంటే నడక మరింత బాగుంటుందని నా అభిప్రాయం చెప్పినది వారి పద్యపు నడకలో లోపమున్నదని చెప్పటం కాదన నా మనవి. ఇది కేవలం వ్యక్తిగతమైన (అంటె subjective) అభిప్రాయం మాత్రమే. కాని నేనౌ అసాధ్యమైన పదాన్ని కాని పదబంధాన్ని కాని సూచించలేదు కదా. శంకరయ్య గారు ఒక పరిష్కర్తను పెట్టి మరింతగా కష్టపడటం కంటే నాబోంట్లు కాస్త ఒళ్ళు దగ్గరుంచుకొని వ్యాఖ్యానవిమర్శనాదికక్రియలకు దిగటం మరింత సమంజసంగా ఉంటుందని అనుకుంటున్నాను. This is again my subjective opinion. నేను నేమాని వారి స్థాయికి చేరుకోవటానికి చాలా తపస్సు చేయాలి కాని వారి కన్నా గొప్ప కవుల వ్రాయలను ఊహించటంలాంటి పనులు చేసే సాహసానికి పూనుకోవటం అనూహ్యం. నేమాని వారు నన్ను మన్నించాలి.
అయ్యా! శ్రీ శ్యామలరావు గారూ! అజ్ఞాత గారి సూచనలను వేనినీ మనము పట్టించుకొన నక్కరలేదు. ఆకాశరామన్నలను మనము మన్నించనక్కరలేదు. మీరు ఎప్పటివలెనే ఉత్సాహముతో మన బ్లాగుకి మేలుచేస్తూ ఉండాలి అని నా ఆకాంక్ష. స్వస్తి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండివాలి చివరి మాటగా తారతో :
01)
______________________________________________
ముందుగ హెచ్చరించితివి ! - మూర్ఖత , నేడిటు నేలగూలితిన్ !
నిందను సేయబోకు మిక - నీరజ నేత్రుని ! నిర్మలాత్మతో
వందన మాచరించి , చను - బాలుని తోడుత రామచంద్రుకున్ !
పొందెద వీవు శాంతి నిక - పూజలొనర్చిన పుణ్యమూర్తికిన్ !
______________________________________________
నా వద్ద ఉన్న "కళ్యాణ రాఘవము" కావ్యంలో చివరి పుట లేదు. దానికోసం ప్రయత్నిస్తున్నాను. అందువల్ల చివరి భాగం పోస్ట్ చేయడం ఆలస్యం అవుతున్నది. మన్నించండి.
రిప్లయితొలగించండివాలి శ్రీరామునితో.............
రిప్లయితొలగించండిన్యాయంబేయిది కానగా శరమునన్యాయంబుగావైచితే
నీయుద్ధప్రతిభావిశేషములు దుర్నీతిన్ ప్రకాశించునే
వేయంజూచిన యుద్ధమందునశరాభీలప్రవాహంబునన్
కాయంబున్నడగించమెచ్చెదుభవత్కాదంబసంవిద్యలన్.
వాలి ముందుగా శ్రీరామునితో :
రిప్లయితొలగించండి02)
______________________________________________
ముందుగ జెప్పితేని, బహు - మూర్ఖపు రావణు లంక కేగి , నే
సుందరమైన రూపమును - శోభయు గల్గిన నీదు భార్య, నీ
ముందుకు దెచ్చి యుండెడిని; - మోహన రూపుడ , నిర్వివాదమున్ !
తొందర నేల నీ విటుల - తూపును నా యెద గ్రుచ్చినాడవో ?
______________________________________________
పాపము చేసినావయిన భానుజ! దాశరథీశరాహతిన్
రిప్లయితొలగించండిదీపిలె నీదు దేహమిక, దివ్యత చేకురు శాశ్వతంబుగా
నా పరమాత్ముడీగలుగు నంతట సద్గతులంత మోక్షమున్
జూపు నటంచు వాలికట సోదరుడున్ సతి చేసిరంజలుల్.
శా. స్వామిన్ బంపితికాదె స్వర్గమునకున్ క్షత్రాధినాథా కృపా
రిప్లయితొలగించండిధామా నన్నును వేగ బంపుమటకే ధర్మమ్ము నీకౌను, నా
స్వామిన్ గొల్చుచు నుందునే నచటనే భావ్యంబు నాకయ్యదే
రామా! జాగొనరింపవ ద్దనెను తారాదేవి దుఃఖమ్ముతో
వీరచరితమనే సంస్కృత నాటకంలో వాలి రావణుని ప్రోద్బలంతో రాముణ్ణి ఎదుర్కొని మరణిస్తాడు. (చెట్టుచాటు నుండి ధీరోదాత్త నాయకుడు బాణం వేయడం దృశ్యకావ్యంలో అనౌచిత్యమని ఈ కల్పన). ఆ నాటకానుసారం -
రిప్లయితొలగించండిరావణాసురుడుసి గొల్ప రయము మీర
రామ చంద్రుని మూర్కొని - ప్రాణ ములను
కోలు పోయె గదా వాలి! గొప్ప వైరి
వాసి అల్ప మిత్రుని కంటె పరిగణింప.
వాలి మరల శ్రీరామునితో :
రిప్లయితొలగించండి03)
______________________________________________
పొందెద స్వర్గమే నిపుడు - పూజ్యుడ , నీవిటు సంహరింపగన్ !
అందుకు చింత లేదు , మరి - యాలిని , బిడ్డను గాచుమో ప్రభో !
చందన చర్చనాదులను - చక్కగ చేయగ లేని దుర్విధిన్
వందన మాచరింతు నిదె - వందిత సుందర, యందుకొమ్మికన్!
______________________________________________
తిరుగు లేని బాణం
రిప్లయితొలగించండినేలకూలిన ప్రాణం
వందన పరివారం
ఒక తనువు నేల కొరిగి
తన పరివారాన్ని స్వామికి
అంకితం చేసిన వైనం
సూక్ష్మం లో పరమార్థం
తనువు వదిలినా ఇతరులకు
మేలు చేకూర్చు జన్మయే ధన్యం !
జిలేబి.
ఈ చిత్రంలో చాలా చిన్నా పెద్దా దోషాలున్నాయి.
రిప్లయితొలగించండిఎవరెవరికి నమస్కరిసున్నారు? వాలి రామాభిముఖుడై నమస్కరిస్తున్నాడు. బాగుంది. తారాసుగ్రీవులు వాలికి నమస్కరిస్తున్నారు. చిత్రకారుడి ఉద్దేశం అందరూ రాముడికి నమస్కరిస్తున్నారని అయితే చిత్రం అట్లాగు రాలేదు. తారాసుగ్రీవులు రామాభిముఖులై లేనే లేరు. వాలి ప్రక్కన అతడి ఆయుధం గద ఉన్నది. సుగ్రీవుడి గద చిత్రంలో లేదు. పెద్ద దోషం కాదు కాని ఉంటే సరిగా ఉండేది. వాలి సుగ్రీవుల ఒడళ్ళపై యుద్ధ్దపు గుర్తుగా గాయాలేమీ లేవు. ఇరువురూ బడలినట్లే లేరు. సుగ్రీవుడు బడలినట్లుండటెమే న్యాయం. వాలి వక్షస్థలంపైన రామబాణం నాటి ఉంది కాని ఒక్క చుక్క రక్తం కూడా లేదు. అది తప్పు. ముఖ్యంగా చిత్రంలోని తారతో సహా యెవరి ముఖంలోనూ కించిత్తుగా కూడా విషాదపు ఛాయలు లేవు. ఇదీ తప్పే. వాలి గద వాలి తోకపైన ఉన్న తీరుకూడా తప్పే. వాలి పడిపోయాక అతడిగద అతడి తోకపైన పడి ఉంటే తోకలో ఒక భాగం గద పైకి ఉండటం జరుగదు కదా. అన్నట్లు సుగ్రీవుడి మెడలో పూలమాల యేదీ - రాముడు ఆనవాలుగా వేసినది? తీసి వేసాడనుకోవాలా? ఈ చిత్ర నేపధ్యం కూడా ఒక చిన్న పచ్చిక మైదానం (lawn) లాగా ఉన్నది కాని అరణ్యభూమిలాగా లేనే లేదు. వాలి సుగ్రీవులు అచ్చం ఒకలాగే ఉండాలి - ఇది మాత్రం దాదాపుగా సిధ్ధించినట్లే.
ఇకపోతే పద్యం వ్రాయాలి కదా,
మ. ఇలలో కర్మము దైవమై నడపు నా కీరీతి దుర్బుధ్ధినిం
తలకుం గట్టిన దైవమే తుదకు నీదౌ తీవ్రబాణాగ్నికిన్
దొలగం జేయుచు మోక్షమిచ్చెనిటు నా దోషంబులం గాల్చుచున్
సెలవో దాశరధీ దయామృతనిధీ సీతామనోనాయకా
వసంత కిశోరులవారూ
రిప్లయితొలగించండిరామచంద్రుకున్ అన్నది సరైన ప్రయోగం కాదండీ రామచంద్రునకున్ అన్నదే సాధువు. కాబట్టి మార్పు చేయండి తగినట్లు. అదీ గాక మీ ముందుగ హెచ్చరించితివి... పద్యం నాకు సరిగా అన్వయం కుదరటం లేదు. ఒక వేళ పొరబడుతున్నానేమో. అలాగే ముందుగ జెప్పితేని.. పద్యం నడక, అన్వయం రెండూ కొంచెం ఇబ్బండి పెడుతున్నాయి. వారి మూడ పద్యం పొందెద స్వర్గమే... లో గాచుమో బదులు గావుమో అంటే బాగుంటుంది. అలాగే దుర్విధిన్ అనేబదులు దుస్థితిన్ అంటే బాగుంటుంది. వందిత సుందర ప్రయోగం యతికోసమేనని స్పష్టమే కాని సుగమంగా లేదు నాకు.
సంపత్కుమారులవారి పద్యం ధారాశుధ్ధితో ఉన్నది.
మూర్తిగారి పాపము చేసినావయిన... పద్యంలో సోదరుడున్ సతి చేసిరంజలుల్ అన్నప్ప్పుడు ఇతరులెవ్వరో పద్యంలో స్పష్టం గావటంలేదు గద. కొంచెం పద్యం సరిజేయవలసి ఉంటుంది.
నేమానివారి స్వామిన్ బంపితికాదె... పద్యంలో 'జాగొనరింప వద్దనెను' బదులుగా 'జాగొనరింప బోకుమనె' అంటే నడక మరింత బాగుంటుందని నా అభిప్రాయం.
రవి గారి రావణాసురు డుసి గొల్ప ... పద్యంలో సంధి విసంధులు రెండూ పాటించారు. ఫరవాలేదు. పద్యం బాగుంది.
జిలేబీ గారి ప్రత్యేక వచన కవితలో 'వందన పరివారం' కన్నా 'వందనం పరివారం' అంటే సబబు.
శ్రీ శ్యామలీయం గారూ,
రిప్లయితొలగించండిశతథా ధన్యవాదాలండీ.
శ్రీ సరస్వత్యై నమః :
రిప్లయితొలగించండిమిత్రులారా!
మన మిత్రులు శ్రీ శ్యామలరావు గారు మంచి సూచనలను చేస్తున్నారు. సంతోషము. నేను వ్రాసిన పద్యములో వారి సూచన ప్రకారము -- ఫలాన పదములను మార్చితే ఇలాగ -- ఇంకా నడక బాగుంటుంది అని. సాధారణముగా ఒక కవిగా నేను నా పద్యమును ప్రకటించేను అంటే అన్ని విధాలా నేను బాగున్నది అనుకొనిన తరువాతనే కదా. మిత్రులు గుణ దోషాలను సూచించుట సబబే, కాని నడక బాగుండుట కొరకై పదములను మార్చాలి అంటే ఎలాగ. నాకంటే ఒక గొప్ప కవి తప్పకుండా ఇంకా మంచి పదములను వేయకలడు. అందులో సందేహములేదు. నా సత్తువ ఎంతో నేను అంతే చేయగలను. అందుచేత ఇటువంటి విషయములలో సూచనలను చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచించుట మంచిది. మన శంకరయ్య గారు ఒక పరిష్కర్తను పెట్టి అన్ని పద్యములను అన్ని కోణములలో బాగున్నవి అని చెప్పినపుడే ప్రచురిస్తే బాగుంటుందేమో?
స్వస్తి.
నేమానివారి స్వామిన్ బంపితికాదె... పద్యంలో 'జాగొనరింప వద్దనెను' బదులుగా 'జాగొనరింప బోకుమనె' అంటే నడక మరింత బాగుంటుందని నా అభిప్రాయం చెప్పినది వారి పద్యపు నడకలో లోపమున్నదని చెప్పటం కాదన నా మనవి. ఇది కేవలం వ్యక్తిగతమైన (అంటె subjective) అభిప్రాయం మాత్రమే. కాని నేనౌ అసాధ్యమైన పదాన్ని కాని పదబంధాన్ని కాని సూచించలేదు కదా. శంకరయ్య గారు ఒక పరిష్కర్తను పెట్టి మరింతగా కష్టపడటం కంటే నాబోంట్లు కాస్త ఒళ్ళు దగ్గరుంచుకొని వ్యాఖ్యానవిమర్శనాదికక్రియలకు దిగటం మరింత సమంజసంగా ఉంటుందని అనుకుంటున్నాను. This is again my subjective opinion. నేను నేమాని వారి స్థాయికి చేరుకోవటానికి చాలా తపస్సు చేయాలి కాని వారి కన్నా గొప్ప కవుల వ్రాయలను ఊహించటంలాంటి పనులు చేసే సాహసానికి పూనుకోవటం అనూహ్యం. నేమాని వారు నన్ను మన్నించాలి.
రిప్లయితొలగించండిమిత్రులారా!
రిప్లయితొలగించండిశ్రీ సంపత్కుమార శాస్త్రి గారు తమ పద్యములో ఈ క్రింది విధముగా సంధిని చేసేరు:
కాయంబున్ + అడగించె = కాయంబున్నడగించె
నేను భావించుట ఎలాగ అంటే:
కాయంబున్ + అడగించె = కాయంబునడగించె అవుతుంది అని.
విజ్ఞులు దీనిని విశదీకరించగలరు. స్వస్తి.
తేలగ తెలివియె తలలో
రిప్లయితొలగించండిమేలుగ సుగ్రీవుడాయె మును మిత్రుడవన్
వాలిని రాముడు గూల్చగ
వాలెను ధర వాని తెలివి వాలము నందే.
శ్యామలీయంగారు ఆ పని చేయండి స్వామి, సర్వేజనాస్సుఖినో భవంతు
రిప్లయితొలగించండిశ్యామలీయంగారూ ! చక్కని సలహాలకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఆ చిత్రంలో ఉన్నది సుగ్రీవుడు కాదు అంగదుడని నా అభిప్రాయం !
అజ్ఞాత గారు "ఆ పని చేయండి" అన్నారు నన్ను. కాని యే పనో అర్థం కావటం లేదు. మన్నించాలి.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ శ్యామలరావు గారూ!
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారి సూచనలను వేనినీ మనము పట్టించుకొన నక్కరలేదు. ఆకాశరామన్నలను మనము మన్నించనక్కరలేదు. మీరు ఎప్పటివలెనే ఉత్సాహముతో మన బ్లాగుకి మేలుచేస్తూ ఉండాలి అని నా ఆకాంక్ష. స్వస్తి.
వాలి పలికెను తుదిశ్వాస విడుచు నపుడు
రిప్లయితొలగించండివలదు వైరము నేనుడువ బదులు నీకు
నాదు పట్టిని తారను బేధ మనక
కాచి రక్షించు మోరామ కరుణ జూపి !