కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
క్రాంతి యనఁగ కవుల కల్పన కద!
(ఈరోజు మా అబ్బాయి క్రాంతి కుమార్ వివాహం కల్పనతో జరుగనున్న సందర్భంగా)
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
క్రాంతి యనఁగ కవుల కల్పన కద!
(ఈరోజు మా అబ్బాయి క్రాంతి కుమార్ వివాహం కల్పనతో జరుగనున్న సందర్భంగా)
క్రాంతి కుమారుండు కందర్ప శతకోటి
రిప్లయితొలగించండిసుందరరూప సుశోభితుండు
విద్యా వినయ మహావిభవ సమేతుండు
నన్ని రీతుల తగినట్టి వరుడు
భారతీ సత్కృపా ప్రాప్త విద్యావతి
సౌందర్యరాశి ప్రసన్న హృదయ
కావేటి కులమున కాంతిపుంజంబునై
యలరు కల్పన వధువై చెలంగు
వారి పెండ్లి కనుల పండువ భవ్య సం
క్రాంతి పర్వ మిరు కులమ్ములకును
క్రాంతి యనగ కవుల కల్పన కద యను
నీ సమస్య కూర్చు హాస గరిమ
శుభాశీస్సులు:
రిప్లయితొలగించండిసురుచిర భాగ్య భోగ రస శోభితమౌ చిర జీవితమ్మునన్
కరము కరమ్ము వీడక సుఖమ్ముల నొందుచు వంశయుగ్మమున్
కరమలరార జేయుచును కాంతిమయాత్ములరై విశేషశ్రీ
కర మిథునమ్ము కల్పనయు క్రాంతికుమారు చెలంగుతన్ సదా!
వేగమనునదిచటి విధివిధానమ్మట
రిప్లయితొలగించండిజీవితమ్మునందు; సిరులు కురియు,
రంగవల్లికలిడు రమ్యమగు మన సం
క్రాంతి యనగకవుల కల్పన కద!
నవదంపతులకు, చూసి ఆనందించే తల్లిదండ్రులకు శుభాకాంక్షలు.
శంకర కవి సుతుడు సద్గుణవంతుడు
రిప్లయితొలగించండిక్రాంతి యనఁగ, కవుల కల్పన కద
యతని చేయి బట్టు కతన, కలియు వారి
కరము కరము మోదకరము గాదె!
ముందుగా నూత్న వధూవరులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీలు గురిపించి సద్యశశ్శ్రీలనొసగి
సుందరంబైన సంతతి నందజేసి
యిందిరాధవు డాశీస్సు లిచ్చుగాత!
క్రాంతి కల్పనలకెపుడు ఘనముగాను.
ఇక ఈనాటి సమస్యకు పూరణ
1.
శంకరాభరణంబున సంతసముగ
పూరణార్థమె యొసగిరి సౌరులొలుక
క్రాంతి కల్పనలదలచి - "క్రాంతి యనగ
కవుల కల్పన గద" యంచు క్రమముగాను.
2.
క్రమత భానుండు మేషాది రాశులందు
ఘనత జేరుటె భువిని సంక్రాంతి యనగ,
కవుల కల్పన కాదేమి వివిధగతుల
జపము తపములు నిష్ఠతో జరుపుటెల్ల.
కంది వంశ తిలకు క్రాంతి య నగ కవు
రిప్లయితొలగించండిల కల్పన కద ! ధరను లాస్య ముగను
క్రాంతి బంధ మయ్యె కల్పన తోడను
పాలు నీరువోలె బ్రతుకు గాక !
అయ్యా శ్రీ సుబ్బారావు గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యము 2వ పాదములో గణముల్య్ సరిపోవుట లేదు.
"ల కల్పన కద......"
నూతన వధూవరులకు శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిగురుని పుత్రుని నామంబు గుర్తు చెపుమ?
ఎవరి యాశీస్సులే బ్లాగు నిచ్చుచుండు?
వరుడు గురు పుత్రుడే మరి వధువు? వినుమ
క్రాంతి యనగ-కవుల-కల్పన కద
నూతన వధూవరులకు శుభాభి నందనలు
రిప్లయితొలగించండిఆర్యా!
రిప్లయితొలగించండిఈనాటి పూరణల్లో నారెండవపద్యం మూడవపాదంలో దొర్లిన పొరపాటును క్రింది విధంగా సవరించ ప్రార్థన.
"కవుల కల్పన గదయిక వివిధగతుల"
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
ఈనాటి పద్యములు సమస్యా పూరణములు అనే కంటే సమయోచితముగా నూతన వధూవరులకు శుభాశీస్సులు అనుటయే మంచిది.
1. శ్రీమతి లక్ష్మీదేవి గారు: సిరులు కురియు రంగవల్లికను గుర్తు చేయు సంక్రాంతిని వర్ణించేరు. బాగున్నది.
2. శ్రీ మిస్సన్న గారు: మంచి విరుపు నెంచుకొని నిన్నటి సమస్య పాదమును కూడా చేర్చి కూర్చేరు. బాగున్నది. మంచి ఆశీస్సులు.
3 .....మూర్తి గారు: 3 పద్యాలు వ్రాసేరు:
-- 1. శ్రీరస్తని దీవించేరు.
-- 2. సమస్య పూరణకై మంచి విరుపు చూపించేరు.
-- 3. సూర్య గమనమును పేర్కొనిరి.
పద్యాలు బాగున్నవి.
4. శ్రీ సుబ్బారావు గారు: పాలు నీరు వలె కలసి మెలిసి సంసారము సాగించాలి అని నూతన దంపతులను దీవించేరు. బాగున్నది.
5. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: క్రమాలంకరములో సమస్యను పూరించేరు. బాగున్నది.
6. శ్రీమతి రాజేశ్వరి గారు: వచనములోనె తమ దీవనలను ఇచ్చేరు. బాగున్నది.
ఈ సందర్భములో నూతన వధూవరులకు కొందరు సూచించే ఉపమానములను గూర్చి నా భావమును తెలియజేయు చున్నాను.
1. పాలు - నీరువలె: పాలు నీరు బాగుగానే కలుస్తాయి. కాని వధూ వరులలో ఏదో ఒకరు పాలు మరొకరు నీరు అనడానికి వీలు లేదు. ఇద్దరు సమానముగానే ఉండాలి. పాలు నీరు ధర్మములలో విలువలలో వేరుగా నుండేవే. అందుచేత ఈ విధమైన ఉపమానము సమగ్రము కాదేమో.
2. చిలుక గోరింక వలె: ఒక చిలుక ఒక గోరువంక జంట కాలేవు. చిలుక వధువనకు చిలుక వరుడే ఉంటుంది. అలాగే గోరువంక జంటలు కూడా. అందుచేత చిలుకల జంటల వలే మరియు గోరువంకల జంటల వలె అన్యోన్యముగా జీవించాలి అని దీవించాలి అంతే కాని ఒక చిలుకను ఒక గోరింకను కలిపి ఒక జంటగా చెప్ప కూడదు. ఇటువంటి అర్థముతోనె పూర్వము వ్రాసిన సినీమా పాటలు కూడా ఉన్నవి. అది ఎంతో దోషము. చిలుకల జంటలు మరియు గోరువంకల జంటలు దాంపత్యములో ఎంతో పవిత్రతను పాటించును జీవితాంతము అని అంటారు. అది వాని ప్రత్యేకత. స్వస్తి.
నేమాని పండితార్యా ధన్యవాదములు
రిప్లయితొలగించండిసూర్య చంద్రు లనగ సొగసులు విరజిమ్ము
రిప్లయితొలగించండికనుల కింపు గాను కనగ శోభ
భ్రాంతి వీడి మదిని పరికించి శోధించ
క్రాంతి యనగ కవుల కల్పన కద !
నేమాని పండితార్యులు పేర్కొనినట్లు మూర్తి గారి పూరణలు చాల బాగున్నవి.
రిప్లయితొలగించండివారి మూడవ పద్యంలో నాకు రెండు సందేహాలున్నవి.
౧. కవుల కల్పన ' కాదేమి ' వివిధగతుల జపము తపములు నిష్ఠతో జరుపుటెల్ల. అన్నప్పుడు సమస్య పాదం (నిర్మాణం) మారి పోలేదా అని.
౨. అదే పాదం ద్వారా మన పూర్వీకుల విజ్ఞతను వారు ప్రశ్నించ లేదు కదా అని.
శ్రీయుతులు మిస్సన్న గారికి,
రిప్లయితొలగించండినమస్కారములు
మీరన్నట్లు మొదట పొరపాటున "కవుల కల్పన కాదేమి" అని వ్రాయుట జరిగినది. కానీ తరువాత దానిని
"కవుల కల్పనగద యిక వివిధగతుల
జపము తపములు నిష్ఠతో జరుపుటెల్ల" అని సవరించుట జరినది.బహుశ: మీరు చూచియుండక పోవచ్చు. దీని ద్వారా
1. సమస్యలోని పదములకు మార్పువచ్చిన దోషము సవరించబడినది.
2. పూర్వీకుల విజ్ఞతను ప్రశ్నించు అభిప్రాయముగాని, సాహసముగాని చేయగలవాడను గాను. అందుకే ఆవిధముగా సవరించి సమర్థించుట జరిగినది.
అటుపై యుక్తాయుక్తములు పెద్దలే నిర్ణయించాలి. ధన్యవాదములు.
మూర్తి గారికి ధన్యవాదములు. నా సందేహములు తీరినవి.
రిప్లయితొలగించండిమీ సవరణను గమనించక పోవడం నా పొరబాటే.
నూతన దంపతులకు, గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, అభినందనలు !
రిప్లయితొలగించండిసుజను లెల్ల సకల శుభములు కోరఁగ
దైవ మిడును క్రొత్త దంపతులకు
శాంతి సౌఖ్యములను, సౌభాగ్యములు గూడు
క్రాంతి యనగ కవుల కల్పన గద !
శ్రీ సరస్వత్యై నమః :
రిప్లయితొలగించండిశ్రీమతి రాజేశ్వరి గారి పూరణ బాగున్నది. సూర్య చంద్రుల వెలుగులను బాహ్యదృష్టి తో గాక మనోదృష్టితో చూడాలన్నారు. మంచిది.
తమ్ముడు డా.చి.నరసింహమూర్తి పూరణ కూడా బాగున్నది. మిత్రుల శుభాకాంక్షల ననుసరించి దైవమే సకల సంపదలను నూతన దంపతులకు ప్రసాదించును అని చక్కగ చెప్పెను. శుభం భూయాత్.
స్వస్తి.
నూతన వధూవరులకు శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు !
రిప్లయితొలగించండిఆర్యా! శంకరార్యా!
రిప్లయితొలగించండిఎప్పుడూ సమస్య ఇచ్చి పద్యం రాయమంటారు గదా! ఈ సారి నెను పంపే చిత్రాన్నిచ్చి పద్యం రాయమని చెప్పండి. కొత్త రకంగా బాగుంటుంది.
టేకుమళ్ళ వెంకటప్పయ్య.
బొమ్మ అటాచ్ మెంటు కుదరలేదు. మీ మైలు లో పంపాను.