26, ఏప్రిల్ 2012, గురువారం

సమస్యాపూరణం - 686 (సుగ్రీవుని యెడమకాలు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.

ప్రసిద్ధమైన ఈ సమస్యను సూచించిన
రాజేశ్వరి అక్కయ్య గారికి
ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

 1. శంకరార్యా ! ఈ సమస్య నింతకు ముందెప్పుడో ఇచ్చినట్లు గుర్తు !

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  వాలిసుగ్రీవుల వేషాలలో వెళ్తున్న వారిలో :

  01)
  ___________________________________


  కుగ్రామము నొక రోజున
  అగ్రజుతో గూడి నడచు - యనుజుని కెదురై
  ఉగ్రముతో మీద కురికి
  సుగ్రీవుని యెడమకాలు - శునకము గఱచెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 3. శ్రీ వసంత కిశోర్ భావమునే గైకొని నేనిటుల పూరించేను:

  చిత్ర వేష ధారణమును జేసి యొకడు
  ప్రథమ బహుమతి గొనుచు సంబరమునొంది
  వడిగ నరుగు సుగ్రీవుని యెడమ కాలు
  శునకము గరచెన్ గోపాన జూచి చూచి

  రిప్లయితొలగించండి
 4. ఆర్యా!
  వసంత కిశోర్ గారూ!
  నమస్కారం. మీ "కుగ్రామా"న్నే నేను కూడా వాడుకుంటున్నాను.

  అగ్రేసరుడై యరుల
  న్నిగ్రహ మొనరించినట్టి నిర్మలమతి నో
  కుగ్రామంబున శిలయగు
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.

  రిప్లయితొలగించండి
 5. అవును వసంత మహోదయా ఇదే వెదికపై యీ సమస్యను యిదివరలో యిచ్చారు.

  రిప్లయితొలగించండి
 6. ఆగ్రహరహితుం డాతడు
  విగ్రహమా సుందరంబు, వీధిని తిరిగే
  యగ్రేసర నామముగల
  సు"గ్రీవుని" యెడమకాలు శునకము గఱచెన్.

  (అతని పేరు అగ్రేసరుడని, అతడు సు-గ్రీవుడు=మంచి(అందమైన)మెడ కలవాడనే భావంతో.

  రిప్లయితొలగించండి
 7. ఆగ్రా జూచుట కేగితి
  నాగ్రాలో జరిగె ఘటన నయ్యో పాపం
  నీ గ్రో జాతికి జెందిన
  సుగ్రీ వుని యెడమ కాలు శునకము గరచెన్ .

  రిప్లయితొలగించండి
 8. నిజమే! ఇది 26-6-2011 నాడు ‘చమత్కార పద్యాలు - 87’ శీర్షిక క్రింద ‘మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 31’ లో ఇవ్వబడింది. నాకు అనుమానం వచ్చి సమస్యా పూరణలలో వెదికితే దొరకలేదు. ఇవ్వలేదేమో అనుకొని మళ్ళీ ఇచ్చాను. ఇది నా మతిమరుపు వల్ల జరిగిన పొరపాటు. మన్నించండి!
  మోచెర్ల వెంకన్న పూరణ......
  కం.
  అగ్రారపు నడివీథిని
  నిగ్రహముగ బొమ్మలాట నేర్పుగ నాడన్
  విగ్రహము లెత్త మఱచిన
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.
  (శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)

  ఆనాటి కవిమిత్రుల పూరణలు ఇవి................

  గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ.........
  ఏ గ్రీవుండయితేనేం
  మా గ్రామమునందు కుక్క మహ పిచ్చిదిగా !
  ఉగ్రముతో అదలించగ
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ !!

  నాగరాజు రవీందర్ గారి పూరణ.........
  వ్యగ్రత డ్రామా కోసము
  సుగ్రీవుని వేషమేసి చురచుర బోవన్
  డిగ్రీ కాలేజి వెనుక
  సుగ్రీవుని యెడమ కాలు శునకము గఱచెన్ !

  మిస్సన్న గారి పూరణ........
  (మధువన ధ్వంసరచనా సందర్భం లో)
  ఆగ్రహమున దధిముఖు పై
  నుగ్రంబుగ వానరములు యురికెను, ఒక వృ-
  క్షాగ్రంబున కపి యఱచెను:
  ' సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ '.

  మంద పీతాంబర్ గారి పూరణ.........
  కుగ్రామపు వేడుకలో
  నిగ్రహమును వీడి ,కామ నిషలో దిఱుగ
  న్నుగ్రాకృతిదాల్చి,నుఱికి
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ '.

  మందాకిని గారి పూరణ.......
  వ్యగ్రతఁ నేపరుగిడితిని
  సుగ్రీవుని నాటకమునుఁ సోమయ నాడన్.
  ఉగ్రతఁ గనుచుంటినినేఁ
  సుగ్రీవుని, యెడమకాలు శునకము గఱచెన్

  వసంత కిశోర్ గారి పూరణ.......
  వ్యగ్రుండై వెళ్ళు నపుడు
  అగ్రణియౌ పాత్రధారి - యా శుని తోకన్
  ఉగ్రణియై , తొక్కిన యా
  సుగ్రీవుని యెడమకాలు - శునకము గఱచెన్ !

  శ్రీపతిశాస్త్రి గారి పూరణ......
  నిగ్రహమును కోల్పోవగ
  నాగ్రహమున కుక్కయొకటి యరచుచు పారెన్
  విగ్రహముల చాటును గని
  సుగ్రీవుని యెడమకాలు శునకము కొరికెన్

  ఆనాటి పూరణలు, వాటిపై విశ్లేషణలు, చర్చలు క్రింది url ద్వారా వీక్షించవచ్చు.
  http://kandishankaraiah.blogspot.in/2011/06/87.html

  రిప్లయితొలగించండి
 9. నే గ్రామసింహమును గద
  యగ్రాసనమీయరేల యని క్రోధముతో
  నాగ్రాపుర సభలో నొక
  సుగ్రీవుని యెడమ కాలు శునకము గరచెన్

  (సుగ్రీవుడు = మంచి కంఠము కలవాడు అనగా ఒక యాంకరు కావచ్చును).

  రిప్లయితొలగించండి
 10. మా గ్రామమునందలి వై
  ద్యాగ్రణి పట్నము జనెనట, త్వరనంపుమయా
  మీ గ్రామవైద్యునా ఘన
  సుగ్రీవుని, యెడమకాలు శునకము కొరికెన్

  రిప్లయితొలగించండి
 11. అభ్యంతరము లేకపోతే గతం లో చేసిన పూరణ ఈనాడు చదువుతుంటే ఎలా అనిపించిందో చెప్పమని - నాడు పూరణ చేసిన వారలకు విన్నపం.

  రిప్లయితొలగించండి
 12. నమస్కారములు.
  క్షమించాలి . నేనూ అనుమానంగానే వ్రాసాను . " ఇది లోగడ చూసినట్టుం దీ " అని. కాకపొతే , సరిగ్గా నిర్దా రించు కోలేక సమస్యను వ్రాయడం జరిగింది గురువులు , పెద్దలు , మన్నించాలి . ఈ పొరబాటు " అక్షరాలా " నాది గురువులు శ్రీ శంకరయ్య గారిది ఎంత మాత్రం కాదని మనవి. మరొక్క సారి క్షమించ మని కోరుతూ . మీ అక్క
  తమ్ముడూ ! చూసారా ! " శ్రమ కల్పిం చడం లేదు " అని మీరన ......గా .....నే ...ఎంత శ్రమ కలిగిందో ?

  రిప్లయితొలగించండి
 13. సీతాన్వేషణ మరచి తార పరిష్వంగంలో మునగిన సుగ్రీవుని, రామభక్తి పరాయణ శునకము కోపంతో కరిచిందన్న భావంతో:
  నిగ్రహమువీడి తారా
  సుగ్రీవులలరి రఘుపతిసూచన మరువన్,
  ఉగ్రముగ, బాధ్యతఁదెలుపన్
  సుగ్రీవునియెడమకాలుశునకముఁగరిసెన్

  రిప్లయితొలగించండి
 14. విగ్రహము చెంత నిలబడి
  అగ్రజుని పిలువ పొరబడి హన్నాయనగా !
  ఉగ్రత నొందుచు పరుగున
  సుగ్రీవుని ఎడమకాలు శునకము గఱచెన్ !

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోర్ గారూ,
  మిత్రులను కుగ్రామం దారి పట్టించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  కంద పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మీ నైపుణ్యానికి జోహార్లు. చక్కని పూరణ. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ మొదటి పూరణ బాగుంది. అభినందనలు.
  మీ రెండవ పూరణ మీరు అన్నింటా అగ్రేసరులని నిరూపిస్తున్నది. అభినందనలు.
  ‘తిరిగే’ అని వ్యావహారిక పదాన్ని ప్రయోగించారు. అక్కడ ‘వీధిఁ దిరుగగా/ నగ్రేసర....’ అందాం.
  *
  సుబ్బారావు గారూ,
  ఆగ్రాలో నీగ్రోను చక్కగా పట్టేశారే! మీ పూరణ చమత్కార భరితంగా ఉంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  కనకపు సింహాసనమున కూర్చుండబెట్టని శునకం ఆగ్రహాన్ని చక్కగా వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  ఊకదంపుడు (రామకృష్ణ) గారూ,
  మీ ఆలోచనలు, పూరణలు ఎప్పుడూ వైవిధ్యంగానూ, చమత్కారభరితం గానూ ఉంటాయి. చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ ‘రామాయణంలో శునకం గోల’ బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ఇదెక్కడి శునకం? దానికి భాషాభిమానం ఎక్కువ అనుకుంటా! అన్నను హన్నా అంటే కోపగించుకుంది. హన్నా! అన్నన్నా! ఎంత చక్కని పూరణ చెప్పారు! అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. సుగ్రీవరావు, కొడుకు హ
  యగ్రీవుడు, కలసి మెలసి యాత్రకు వెడల
  న్నాగ్రహము తోడ తరుముచు
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్

  రిప్లయితొలగించండి
 17. అగ్రీమెంటుకు రాగనె
  నాగ్రా నగరపు ప్లవములు నక్కల పెంచన్
  ఆగ్రహముతోడ పరుగిడి
  సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్

  రిప్లయితొలగించండి