20, ఏప్రిల్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 683 (మనుచరిత్ర కర్త మంచన)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

మనుచరిత్ర కర్త మంచన గద!

24 కామెంట్‌లు:

 1. అల్లసాని పెద్దనార్య మహాకవి
  మనుచరిత్ర వ్రాసె మంచన కద (మంచి + అన కద)
  కాంచెనది ప్రశస్తి కావ్యరత్నంబుగా
  ఘన యశంబు గాంచె కవివరుండు

  రిప్లయితొలగించండి
 2. పూర్వ కాల మందు పుణ్య లోకంబున
  జరిగిన కథలు శుభ చరిత గాదె
  అట్టి వాటి లోన నా బసవ పురాణ
  మనుచరిత్ర కర్త మంచన గద!

  రిప్లయితొలగించండి
 3. బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్
  కూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
  హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌ
  ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై.

  ఇది మంచన గారి పద్యము.కేయూర బాహుని చరిత్రమందలిది అని ఒక చోట చదివాను.

  కావ్యకన్యనిచ్చి కాన్కలందుకొనగ
  నిచ్చగించకుండ నింపుగాను
  వ్రాసె ఘనత తోడ రాజుల చారిత్ర
  మను చరిత్ర కర్త మంచన గద!

  మూడవ పాదం సరిగ్గా లేదు. మన్నించండి.
  పునర్దర్శనం వచ్చేవారం.

  రిప్లయితొలగించండి
 4. శ్రీ మందాకిని గారూ,

  మన్నించాలి. ఆ పద్యము పోతన రచించినది. భాగవతాన్ని రాజులకు అంకితమివ్వకుండా శ్రీరామునికి అంకితమిస్తానని చెప్పే సందర్భములోనిది. పద్యములో కూడా చిన్నమార్పులు........

  బాలరసాలసాల నవపల్లవ ..........

  హాలికులైననేమి గహనాంతరసీమలకందమూలకౌ.......

  అని ఉండాలనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 5. అల్లసాని పెద్ద నార్యుండు గద నిల
  మనుచరిత్ర కర్త , మంచన గద !
  బసవు చరిత వ్రాసి బహుళ ప్ర శ స్థలు
  నొందె ధరను మంచి యొజ్జ గాను

  రిప్లయితొలగించండి
 6. అల్లసానివార లద్భుత మైనట్టి
  మనుచరిత్ర కర్త, మంచన గద
  సరళమైవెలుంగు చక్కని కేయూర
  బాహుచరిత కింక భవ్యముగను.

  రిప్లయితొలగించండి
 7. ప్రౌఢకవిపెద్దనార్యుడు, పండితుండు,
  మహిత లఖణగ్రంధంబు మనుచరిత్ర
  కర్త, మంచనగదఘన కావ్యమైన
  బసవ చారిత్రమును వ్రాసి వాసి కెక్కె.

  రిప్లయితొలగించండి
 8. బాలరసాలసాలనవపల్లవ కోమల కావ్యకన్యకం
  గూళలకిచ్చి యప్పడుఁపు గూడు భుజించుటకంటె సత్కవుల్
  హాలికులైననేమి గహనాంతరసీమలఁ గందమూల కౌ
  ద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై.

  ఈ పద్యము పోతన వ్రాసినట్లుగా నేనూ విన్నాను.

  అయితే పోతన భాగవతం ప్రథమ స్కంధములో
  ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి...... అనే పద్యం కృతిపతి నిర్ణయంలో ఉన్నది.
  షష్ఠ్యంతములలో కూడా
  హారికి.....
  శీలికి....
  క్షంతకు....
  న్యాయికి .....
  అనే పద్యాలు ఉన్నాయి.కానీ
  బాల రసాల .....పద్యం లేదు.
  పెద్దలు తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
 9. పోతన శ్రీనాథుల సంవాదములో ప్రస్తావింపబడిన పద్యము: "బాల రసాల సాల ....." ఇది కేవలము చాటువు. ఎక్కడా కావ్యములో కనుపింపదు.

  రిప్లయితొలగించండి
 10. Sree subbaaraavu gaaroo!
  2nd line is perfect in my view. please indicate the mistake if any found by you,

  రిప్లయితొలగించండి
 11. sir, namaste .kshaminchaali .samasya manucharitra karta ku badulu manu charitra vraase ani type ayyindi

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమానివారికి గురువర్యులందరికి వరప్రసాదు నమస్కారములతో
  ఈ మధ్య కుటుంబ, మరియు పిల్లల స్కూలు విషయములతో బ్లాగు చూచుటకు కుదరలేదండి.
  ముందుగా నూతన వధూవరులకు శుభాసీస్సులు. శుభాకాంక్షలు తెలుపుతూ,
  -----------
  తీర్చి దిద్దె తెనుగు దివిపైన పెద్దన్న
  మనుచరిత్ర కర్త, మంచన గద
  శివకవి యుగమందు స్థిరముగా నిలచెను,
  జాను తెనుగుదెచ్చె జాతికపుడు.

  రిప్లయితొలగించండి
 13. జిగురు సత్యనారాయణశుక్రవారం, ఏప్రిల్ 20, 2012 11:57:00 AM

  విద్య లేని వాని వివరంబు తెలియుము
  స్వంత తెలివి తోడ వింతగుండు
  "మ""మ"లు కలిసెఁగాన మంద బుద్దికిఁజూడ
  మనుచరిత్ర కర్త మంచన గద!!

  రిప్లయితొలగించండి
 14. తొలుత బలికె నొకడు తొందరపాటులో
  మను చరిత్ర కర్త మంచన గద
  యనుచు గాని పిదప అల్లసాని యటంచు
  తప్పు దిద్దుకొనుచు మెప్పులొందె

  రిప్లయితొలగించండి
 15. గురువుగారిప్రశ్న
  గురిఁజూచిశిష్యుడు
  అల్లసానివ్రాసెననుచుఁజెప్పె
  గరిమఁదెలియ ఉరమ కంగారునిట్లనె
  మనుచరిత్రకర్త మంచన?కద!?

  రిప్లయితొలగించండి
 16. అసమానధీశాలి యలసాని పెద్దన్న
  కవిరాజు రచియించు గ్రంథమేది?
  కావ్యసృష్టిని జేయు కవివరుం డేమౌను
  రచన పట్లను తాను రమ్యముగను?
  కీర్తినందించిన కేయూరబాహ్వాఖ్య(బాహుని)
  చరితంబు పలికిన జాణ(డె)యెవరు?
  హనుమంతునకు జూడ నాయుధం బదియేమి
  భాగ్యశాలికి రామభక్తునకును?
  పైన చూపబడిన ప్రశ్నలన్నింటికి
  వరుస మారకుండు సరణినిట్లు
  ఉత్తరంబులగును చిత్తంబులలరించు
  మనుచరిత్ర, కర్త, మంచన, గద.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ మూర్తిగారూ,

  చాలా మంచిపద్యము చెప్పారండీ.

  రిప్లయితొలగించండి
 18. మనుచరిత్ర కర్త మంచనగద యందు
  ప్రవరు శీల వైభవమును బొగడె
  నటులె మోహనాంగి యగు వరూధిని నన్య
  పాత్రలను సముచిత భంగి గూర్చె

  రిప్లయితొలగించండి
 19. హరికుల శశి మూర్తీజీ!
  పరువెత్తును మీ కలమ్ము భావము వెనుకే
  విరబూయు పద్య సుమములు
  మురిపించును పద్యప్రియుల ముచ్చటలగుచున్

  రిప్లయితొలగించండి
 20. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి
  ఆర్యా!
  మీ వాత్సల్యానికి ధన్యవాదములు
  శుభములు గూర్చుచు నుండెడి
  యభినందనలిచ్చుచుందు రస్మద్గురుస
  న్నిభులౌ పండితవర్యా!
  అభివాదశతంబు జేతు నయ్యా మీకున్.

  రిప్లయితొలగించండి
 21. అల్ల సాని వారి యల్లిక సొగసులు
  పరమ రమ్య మైన ప్రణయ గాధ
  మను చరిత్ర కర్త మంచన గదయనుట
  చిత్ర మేమొ దెలుప మంత్ర మహిమ ?

  రిప్లయితొలగించండి
 22. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  పూరణలు పంపిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. సమయాభావం వల్ల ఇప్పుడు మీ పూరణలను పరామర్శించలేక పోతున్నాను. కాసేపట్లో పవర్ కట్! తరువాత సమీక్షిస్తాను. ఆలస్యానికి మన్నించండి

  రిప్లయితొలగించండి