జయ జయ శంకర!
శ్రీ శివశర్మకు శ్రీమదార్యాంబకు
వంశరత్నమ్ముగా ప్రభవమొంది
వేద శాస్త్ర పురాణ విద్యల నెల్లను
నాచార్యు కృప నధ్యయనమొనర్చి
సన్యాసియై మహాజ్ఞాన నిధానుడై
బ్రహ్మ విద్యా ప్రభా భాసితుడయి
అన్య మతమ్ముల నన్నింటి ఖండించి
అద్వైత మతమునే వ్యాప్తి జేసి
భరత దేశమ్ము నంతను పర్యటించి
నాల్గు పీఠముల్ స్థాపించి నాల్గు దెసల
కూర్మి నలరారు శ్రీజగద్గురు వరేణ్యు
శంకరాచార్యునకు నమశ్శతమొనర్తు
నేమాని రామజోగి సన్యాసి రావు
మిత్రులారా!
రిప్లయితొలగించండిఈనాడు శ్రీ శంకరాచార్యులవారి జయంతి సందర్భముగా ఆ స్వామి వారికి ఒక పూజా పుష్పమును సమర్పించు కొనినాను. స్వస్తి.
శంకర జయంతి సందర్భంగా ప్రాత:కాలంలో శ్రీ శంకరాచార్యుల వారిని భక్తితో స్మరించుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించిన గురుతుల్యులు శ్రీ నేమాని వారికి ధన్యవాదములు, నమస్కారములు.
రిప్లయితొలగించండికాలడి పల్లియ ఖ్యాతిని
రిప్లయితొలగించండినాలుగు చెరగులకు జేర్చి నారు మహాత్మా!
వేల నమస్కృతు లివిగో
గ్రోలితి మద్వైత సుధల గురువర జేజే.
శ్రీ హరి.... మూర్తి గారూ!
రిప్లయితొలగించండిసంతోషము - శుభాశీస్సులు - మీ వర్ణనలకై ఎదురు చూచుచున్నాను.
శంకాలేశము లేదిక
రిప్లయితొలగించండిశంకరులే పరమగురులు, సాక్షాచ్ఛివులౌ(శంకరరూపుల్)
సంకటహరణ సమర్థుల
కంకితభావంబుతోడ నర్పింతు నుతుల్.
నమస్కారములు.
రిప్లయితొలగించండిచదువరు లందరు ఆ స్వామికి పూజా పుష్పాన్ని అందించ గల అదృష్టాన్ని కలిగించిన గురువులు శ్రీ పండితుల వారికి ధన్య వాదములు + కృతజ్ఞతలు .
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిసత్యనారాయణ మూర్తి గారూ,
మిస్సన్న గారూ,
రాజేశ్వరి అక్కయ్యా,
............... ధన్యవాదాలు.