16, ఏప్రిల్ 2012, సోమవారం

పద్య రచన - 4


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

ఈ చిత్రాన్ని పంపిన వారు
శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు.
వారికి ధన్యవాదాలు.

6 కామెంట్‌లు:

  1. ధనువున్ బాణములూని రాఘవుడు యుద్ధక్షోణిలో నాంజనే
    యుని స్కంధమ్మున నిల్చి కాలువలె నత్యుగ్రాకృతిన్ దాల్చి వే
    సెను తీవ్రమ్మగు బాణ కోటి రిపులన్ జీల్చెన్ ప్రకోపాగ్నిలో
    దనుజ శ్రేణుల నెల్ల వ్రేల్చె సురలత్యానందమున్ బొందగన్

    రిప్లయితొలగించండి
  2. ఉచితరీతిని భాసిల్లుచున్న కవిత
    వ్రాసితిరికాదె నేమానివారు ,భళిర
    చిత్తరువు లోని భావమ్ము చెక్కినట్లు
    పదము లల్లిరి చక్కని పద్యమందు.

    రిప్లయితొలగించండి
  3. శ్యాముండై ఘన నీలదేహుడగుటన్ సంభావనన్ గంటి, నీ
    ధీమంతున్నిట చిత్రమందు నిటులన్ దిగ్దంతి గా గంటి, నే!
    భీమంబౌ సురవైరి బాహువుల దా భిన్నంబు గావించుచో
    రాముం గంటిని యుద్ధరంగమున నా రౌద్రుండ నేగంటినే!

    రిప్లయితొలగించండి
  4. రావణాసురుడంత రౌద్రరూపముదాల్చి
    వానరవీరులన్ వరుసతోడ
    చెలరేగి గూల్చగా శ్రీరాముడాతని
    సంహరించగ వేగ సాగుచుండ
    గరుడవాహనుడట్లు ఘనఘనాఘనతుల్య!
    భుజముపై గూర్చుండి పోరుమనుచు
    హనుమ కోరినయట్టులా వీరు మూపెక్కి
    శరశరాసనమంది యరిని జూచి
    త్రిపురసంహారి సాక్షాత్కరించినట్లు
    క్రమము దప్పక దశకంఠు గదలనీక
    సురలు బారులుదీరి ఖేచరులు జూడ
    బాణవర్షంబు గురిపించె బహుళగతుల.

    రిప్లయితొలగించండి
  5. డా. శ్రీకమనీయం గారికి కృతజ్ఞతలతో నమస్కారములు.
    శ్రీమతి లక్ష్మీ దేవి గారు శార్దూలమును బాగుగనే మలిచేరు. శుభాభినందనలు.
    శ్రీ....మూర్తి గారు సీసాన్ని ఎంచుకొని చక్కగా నడిపించేరు. శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ఆంజ నేయుని మూపును నాక్రమించి
    ఎక్కు పెట్టుచు రాముడు నొక్క శరము
    రౌద్ర రూపము దాల్చిన రుద్రు వోలె
    శత్రు సంహార పనికినై జనెను ననికి

    రిప్లయితొలగించండి