కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
పాపములకు మూలములగుఁ బశుపతి పూజల్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
పాపములకు మూలములగుఁ బశుపతి పూజల్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
కోపమ్ములు, తాపమ్ములు
రిప్లయితొలగించండిపాపములకు మూలములగు, బశుపతి పూజల్
పాపహరములున్ భవ పరి
తాపఘ్నములగుచు మోక్షధామము జేర్చున్
కుమతుల దుర్బోధనలే
రిప్లయితొలగించండిభ్రమలకు దావిచ్చు నవియె పాపములకు మూ
లములగు, బశుపతి పూజల్
శమించు పాపములనెల్ల, సత్ఫలములిడున్
పండిత నేమాని వారికి నమస్కారములు.రెందు కందములను అందముగా చెప్పినారు.
రిప్లయితొలగించండిపాపపు చింతనలెల్లెడ
రిప్లయితొలగించండిపాపములకు మూలములగుఁ; బశుపతి పూజల్
బాపునటయట్టి చింతన;
దీపము వలె జ్ఞానమునిడు; దిక్కై నిలుచున్.
ప్రాపంచిక విషయములే
రిప్లయితొలగించండిపాపములకు మూలములగు, పశుపతి పూజల్,
శ్రీపతి సంస్మరణంబులు
పాపంబులదొలగ జేసి భక్తుల గాచున్.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిశ్రీపతి! కోపము విడుచుము,
పాపములకు మూలములగుఁ, బశుపతి పూజల్
జేపట్టుము చేకూరును
ఆ పావనమూర్తి దయయు నానందములున్
శ్రీ హనుమఛ్ఛాస్త్రిగారి ప్రశంసలకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండికోపము ,గర్వము లీ ర్ష్యలు
రిప్లయితొలగించండిపాపములకు మూలము లగు ,బశుపతి పూజల్
బాపముల బార ద్రోలును
బాపములను జేయకునికి ప్రధమము మనకున్ .
పశుపతి పూజలు పాపహరము లవి
రిప్లయితొలగించండియేల పాపములకు మూలములగు?
పశుపతి పూజల్ కృపావర్షమును గూర్చు
పరమార్థ ముఖ్య సంపదల నిచ్చు
పశుపతి పూజలు భవభయహరములు
వాంఛితాఖిల వైభవప్రదములు
పశుపతి పూజలు భక్తివర్ధకములు
నమరతతులకు జయప్రదములు
బ్రహ్మ విష్ణ్వింద్ర ముఖ్యులు, భక్త తతులు
మునివరులు జేయు పశుపతి పూజ లఖిల
భువన రక్షాకరము లాపూజలెపుడు
సలుపుచుందును మానస సారసమున
మా పద్యములోని తేటగీతి 3వ పాదములో టైపు తప్పు దొరలినది ఆ పాదమును ఇలా చదువుకొందాము:
రిప్లయితొలగించండిభువన రక్షాకరమ్ము లాపూజలెపుడు
గురువర్యులందరికి నమస్కారములతో వరప్రసాదు
రిప్లయితొలగించండి(పశుపతి = రాజశేఖరుడను అర్థములో)
నేలను దున్నుట రైతుకు
పాపములకు మూలములగుఁ, బశుపతి పూజల్
మేలగు ముముక్షువులకున్
పాపపు చింతనలు లేని పాడు "జగతి"నన్|
శ్రీ శ్రీ పండిత నేమానివారికి నమస్కారములతో
రిప్లయితొలగించండిమీ సీసపద్యము బహుచక్కగనున్నది. మీరు సెలవిచ్చినట్లు "పశుపతి పూజలు భవభయహరములు"
కానీ నేడు రైతులకు పంటలు పండించుటకంటే, రాజకీయనాయకులకు ప్రదక్షిణలు జేయుట మంచిదని నా పూరణ.
భవదీయుడు
వరప్రసాదు
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
(1) పశుపతి అనే శబ్దమునకు అర్థమును వివరించుచున్నాను. పాశములచే బంధింపబడునది పశువు. ఆవు మొదలైనవే కాదు, బ్రహ్మ నుండి చీమ వరకు గల జంతువులన్నియు (మానవులుకూడా) అనేక బంధములచే బంధింపబడేవే -- అందుఛే జీవులన్నియు పశువులే. పశువులన్నిటికి నాథుడైనవాడు పశుపతి (ఈశ్వరుడు).
(2)రాజశేఖరుడు అనే పదమునకు అర్థమును విచారిస్తే - 2 విధములుగ చెప్పుకొనవచ్చును. (1) రాజులలో శిరోభూషణమైన వాడు (గొప్ప రాజు); (2) రాజు అనగా చంద్రుడు శిరస్సున గలవాడు - అనగా ఈశ్వరుడు.
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం. తాపఘ్నంబులు నానా
రిప్లయితొలగించండిశాపోపశమనము లాత్మ సంతోషణముల్
రూపారగ జన్మాంతర
పాపములకు మూలములగుఁ బశుపతి పూజల్.
శ్రీ శ్రీ పండిత నేమానివారికి నమస్కారములతో
రిప్లయితొలగించండిగురువు గారు మీ వివరణలకు ధన్యవాదములు. నా పూరణ డా| రాజశేఖర రెడ్డి భజనపరులపై మరియు రైతుల కష్టములపైన సార్, మఱియొక పద్యమును వ్రాయుటకు ప్రయత్నము జేసెదను.
భవదీయుడు
వరప్రసాదు
సీతను అపహరించి తెచ్చిన రావణునితో విభీషణుడు ఇలా అంటున్నాడు-
రిప్లయితొలగించండిభూపా! స్త్రీహరణంబులు
పాపములకు మూలములగు, పశుపతిపూజల్
నీపరమనైష్టికత్వము
లేపాటివి, నిన్నుగూల్చు టిది సత్యమనెన్.
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
శ్రీ శంకరాచార్య విరచితమైన లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమునకు నీ మధ్యనే నేను సరళమైన తెలుగులో స్వేఛ్ఛానువాదమును చేసినాను. దానిని మన మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతము" అనే బ్లాగులో ప్రచురించేరు. మీరందరు చూచి ఆనందించ గలరని నమ్ముచున్నాను. స్వస్తి.
గుండా సహదేవుడు గారి పూరణ....
రిప్లయితొలగించండిహేపరమేశా! కావగ
చూపుము మాపై కరుణను స్తోత్రముఁ జేయన్
తూపులఁసంధించగనే
పాపములకు, మూలము లగుఁ బశుపతి పూజల్.
గురువు గారు నన్ను క్షమించగలరు. ప్రాసను పాటించకుంటిని.
రిప్లయితొలగించండివ్యస్తుడనైతిని, త్వరగా పూరణ జేయుటయందు ప్రాసను మరచితిని.
--------
పాపపు చింతన విడచిన
పాపములకు మూలములగుఁ, బశుపతి పూజల్
కాపురమందున బాపును
తాపమ్ము, తొలకరి వాన దాకినరీతిన్|
ఆర్యా!
రిప్లయితొలగించండినా రెండవపద్యం మూడవ పాదంలో పొరపాటుగా టైపుచేయబడిన "నైష్టికత్వము" ను "నైష్ఠికత్వము" గా సవరించ ప్రార్థన.
3.
రేపైనా మాపైనా
పాపములకు మూలములగు, పశుపతి పూజల్
చేపట్టని దుష్కర్ముల
కాపురములు, సుఖమయంబు కాబోవెపుడున్.
కం. కోపములకు తాపములకు
రిప్లయితొలగించండిపాపములకు మూలములగుఁ బశుపతి పూజల్
చేపట్టక సంసారపు
కూపంబున సుఖము వెదకు కూళల బ్రతుకుల్
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా! ఈనాటి పూరణలను తిలకించుదాము:
1. శ్రీమతి లక్ష్మీదేవి గారు జ్ఞానదీపపు కాంతులతో వెలుగులు నింపేరు. చాల బాగున్నది.
2. శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారు: 3 విధాలుగా పూరించేరు.
(1) పాపమ్ముల తొలగ జేసి భక్తుల గాచున్; అని
(2) విభీషణుడు రావణునికి చేసిన హితబోధ; మరియు
(3) పశుపతి పూజల్ చేపట్టని దుష్కర్ముల దుష్ఫలితము గురించి
వర్ణించేరు. బాగున్నవి,
3. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: ఆత్మ సంబోధన చేసికొన్నారు. బాగున్నది.
4. శ్రీ సుబ్బా రావుగారు: 2 విధాలుగా పూరించేరు.
1. పాపపు జింతనలు లేని పాడు జగతిని అని వ్యంగ్యముగా;
2. తొలకరి వానలతో ఉపమించేరు.
పద్యములు భావములు బాగున్నవి.
5. శ్రీ శ్యామలరావు గారు: 2 విధాలుగా పూరించేరు.
1. రూపారగ జన్మాంతర పాపములకు మూలము అని మరియు
2. పశుపతి పూజల్ చేపట్టక సంసారపు కూపమ్మున .. అని
చాల బాగున్నవి.
6. శ్రీ సహదేవుడు గారు: పాపములపై తూపులు సంధించుటను వర్ణించేరు. బాగున్నది.
అందరకీ అభినందనలు. స్వస్తి.
నా వ్యాఖ్యలలో చిన్న సవరణ:
రిప్లయితొలగించండిశ్రీ సుబ్బారావు గారు చేసిన పూరణ: పాపములను చేయకునికి ప్రథమము మనకున్ ..అని చేసేరు. అంటే ప్రథమ కర్తవ్యము అని అన్వయించుకొనవలెను. బాగున్నది. స్వస్తి.
శ్రీ వర ప్రసాద్ గారు 2 విధాలుగా పూరించేరు.
1. వ్యంగ్యంగా పాపపు జింతనలు లేని పాడు జగతి అని వర్ణించేరు.
2. తొలకరి వానలతో ఉపమించేరు. బాగున్నవి.
పొరపాటులకు చింతించు చున్నాము. స్వస్తి.
పండితుల వారికి అనేకానేక ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివిద్యుత్సమస్యల వల్ల ఇప్పుడు స్పందించాను గురువు గారు
గోపాలుడు గోకులమున
రిప్లయితొలగించండిగోపికలతొ కలసి మెలసి గోవుల నడుమన్ !
శా పమ్ములు తొలగిం చగ
పాపములకు మూలము లగు పశుపతి పూజల్ !
-------------------------------------------------------
లోపముల నెంచి చూడక
కోపమున శపియించు మునులు కోవిదు నైనన్ !
తాపము తొలగిన పిమ్మట
పాపములకు మూలము లగు పశుపతి పూజల్ !
గురువుగారికి నమస్సులు. మీరు ఆంధ్రీకరించిన లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రము లోని శైలి రమ్యముగా నున్నది. మూలములోని భావము అనువాదములో ప్రతిబింబించినది. నిత్యపఠనీయములగు పద్యములను మాకందిచినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువర్యులకు వందనములు,
రిప్లయితొలగించండిఆర్యా! "తప్పు లెన్నగ గొప్పగా జెప్ప నేర్తు"
శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు.
రిప్లయితొలగించండిమన బ్లాగు సభ్యులు రచనలలో ఆరితేరిన వారే. వారంతట వారుగా ఏదో ఒక మంచి విషయమును ఎంచుకొని చిన్న చిన్న ఖండికలను రచించి అప్పుడప్పుడు మన బ్లాగులో ప్రచురణ కొరకు పంపుట మొదలిడితే బాగుండునని నా ఉద్దేశము. ఆలోచించండి. ఇది ఉభయ తారకము అవుతుంది కదా! స్వస్తి.
కోపపు తాపము నరునికి
రిప్లయితొలగించండిపాపములకు మూలములగు, పశుపతి పూజల్
ఆపక రేపులు మాపులు
చేపట్టిన శాంతి గలుగు చెడుగును మాపున్.
కోపము మోహము మున్నగు
రిప్లయితొలగించండిశాపములను కూలద్రోసి శౌర్యము తోడన్
రూపము గుణములతో ని
ష్పాపములకు మూలములగుఁ బశుపతి పూజల్
దీపము ధూపము తోడను
రిప్లయితొలగించండికైపున తెలగాణమనెడు కైలాసమునన్
మోపులు మోపులు కూడుచు
పాపములకు మూలములగుఁ బశుపతి పూజల్