పరమ గురువు
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
ఆదిమ మానవు లక్షర శూన్యులై
మసలు చుండుట జగన్మాత గాంచి
పరమేశు ప్రార్థింప ధర నీశ్వరుండాది
గురువుగా విద్యల గరపె దొల్లి
నరజాతి కంతట నాగరికత చాల
వ్యాపించి వారలు నలరుచుండ
మరల గాంచెను జగన్మాత వేరొక లోటు
వారికి రాదంచు బ్రహ్మ విద్య
మరల ప్రార్థించె నీశ్వరు పరమ పురుషు
నంత నాతడు మనుజుల కందరకును
బ్రహ్మ విద్యను నేర్పె నప్పగిది నతడె
సకల విద్యల గురువు విశ్వంబునందు
(సౌందర్యలహరి లోని "చతుష్షష్ట్యా తంత్రై......." అనే శ్లోకములోని భావము ఆధారముగా.)
గురుతుల్యులు శ్రీ నేమాని పండితులవారికి,
రిప్లయితొలగించండిఆర్యా!
నమస్కారములు.
పరమగురువును గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిపరమగురు సాక్షాత్కారాన్ని కల్గించారు. ధన్యవాదాలు.