27, ఆగస్టు 2012, సోమవారం

దత్తపది - 25 (నన - నీనీ - నును - నేనే)

నన - నీనీ - నును - నేనే
పై శబ్దాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
(కన్నడ బ్లాగు `పద్యపాన' సౌజన్యంతో...)

24 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    సౌగంధికా పుష్పం :

    01)
    _______________________________

    కాననము నందు ఘనమైన - గట్టు పైన
    గాంచి నునుపైన పుష్పంబు - గగురు పొడుప
    గాలిచూలిని కోరిన - కాంత యంత
    గగన సుమమును నే నేర్పు - గాను దెత్తు
    తాళు , భామినీ నీవిట - తడవు కొంత
    యనుచు పలికెను భీముండు - యామె తోడ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  2. కాన నాజ్ఞాత వాసము లేని ముగిసె
    నిజము బావ! నీ నీతియే నీకు రక్ష
    పూను దేనును తగు దౌత్యమును కురుపతి
    కెలమి నీ మాట దెలుప నేనేగువాడ

    రిప్లయితొలగించండి
  3. ఆననమదేల వాడెనొ యందమైన
    భామినీ, నీకు? భీముని బలము చాలు
    నునుపగు సొబగు దానవనుచును బలుకు
    కీచకుని ద్రుంచనే, నేడు కీలు కీలు.?

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పద్యములు....
    ఉ.
    వేదన నంది ద్రౌపది తపించుచు నిట్లనెఁ గృష్ణుఁ జెంత "దా
    మోదర! సంధిఁ గోరుచునుఁ 'బోరును వద్ద'నుచుండఁ గంటి, నీ
    నీ దృఢ వాక్కు సంధికిని దూరమె? నిక్కము వల్కుము! వారునున్ను, నే
    నేదెసఁ బోవఁగా వలయు? నీ విటఁ దెల్పుము కృష్ణ! యిప్పుడున్.

    [అరణ్యాజ్ఞాతవాసాలు ముగిసిన తదుపరి భీముఁడు ద్రౌపదితోఁ బలికిన సందర్భము]
    తే.గీ.
    "ఆననమ్మున దుఃఖమ్ము నగపడకను
    జేయ; మానినీ! నీకున్న చింతఁ దీర్ప;
    దుస్ససేను నుక్కడఁగింతు, దోర్బలమున
    ఱొమ్మునే నేనుఁ జీల్చియు, రుధిర మిడుదు!"

    రిప్లయితొలగించండి
  5. నర్తనశాలలో ఉత్తర :

    02)
    _______________________________

    తనన తననన తడబడి - తలిరుబోడి
    తనన తననని తానును - తద్ధి మనుచు
    మానినీ నీవిటుల జేయు - మనిన గురువు
    నృత్యమును జేయు విధమునే - నేర్చె నేర్పు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘భీముడు + ఆమె’ అన్నపుడు యడాగమం రాదు. ‘భీము డా యతివఁ జూచి’ అందాం.
    రెండవ పూరణలో ‘తద్ధి మనుచు’ ను ‘తద్ధిమి యని’ అనండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణము ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, పెద్దలందఱికి
    ప్రణామములు!

    నననారాచము నూని, నారిఁ గొని - సంధానించి కోటిన్, “సనా
    తను నీ నీఁగును చూత” మని చూతాజిహ్మగం బంది, తా
    నును యోగేశ్వరు మ్రోల నిలిచెన్ పుండ్రేక్షుకోదండుఁ డీ
    సున “నేనే పెనుజోదు” నని భస్మోత్క్రాంతకర్ముండు నై.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  8. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    నమస్కృతులు. ధన్యవాదాలు.
    కవితాప్రౌఢిమ ప్రతిబింబించే మీ పూరణ అద్భుతంగా ఉంది. కానీ మొదటి పాదంతప్ప మిగిలిన పదాల్లో గణదోషాలున్నవి. లేక ఇదేమైన విషమవృత్త భేదమా? నా సాహసాన్ని మన్నించ వలసిందిగా కోరుతూ నా సూచనలు....
    నననారాచము నూని, నారిఁ గొని - సంధానించి కోటిన్, “సనా
    తను నీ నీఁగును చూతమా” యనుచు చూతాజిహ్మగం బంది, తా
    నును యోగేశ్వరు మ్రోల చేరి నిలిచెన్ పుండ్రేక్షుకోదండుఁ డీ
    సున “నేనే పెనుజోదు నౌదు” నని భస్మోత్క్రాంతకర్ముండు నై.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ కృష్ణుడు అర్జునునితో..

    నేనే మూలము జగతికి
    నీ నీ క్రియలన్నిటికిని నేనే మూల
    మ్మో నర ! మన్నన సేయుము
    చేనును గాపాడ లెమ్ము చీడను ద్రుంపన్.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ గుండు మధుసూదన్ గారి పద్యము "వేదన నంది...."లో 3వ పాదములో 3 అక్షరములు ఎక్కువగా నున్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా!
    శుభాశీస్సులు.
    వ్యతిరేకార్థకములైన పదములు "కళలే" ద్రుతప్రకృతికములు కావు. చాల మంది మిత్రులు ఈ నియమమును మరచిపోవుచున్నారు. ఈరోజు శ్రీ గుండు మధుసూదన్ గారి పద్యములో "అగపడకను" అని ద్రుతాంతముగా వ్రాసేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారూ,
    నేమాని వారి వ్యాఖ్యలను గమనించారా? మీ ఫోను ‘స్విచ్‌డ్’ ఆఫ్ అని వస్తున్నది. మీ స్పందనను తెలియజేయండి...
    ‘నిక్కము వల్కుము! వారునున్ను’ అన్నదానికి‘నిక్కమె! వారునున్ను’ అనీ, ‘దుఃఖమ్ము నగపడకను’ అన్నదానికి ‘దుఃఖమ్ము నూనకుండ’ అనీ నా సవరణలు...

    రిప్లయితొలగించండి
  13. మాన్యశ్రీ శంకరార్యులకు
    విహితానేకప్రణామములతో,

    వాఙ్మయకళాధ్యక్ష వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు 1972లో ప్రభుత్వ లిఖితప్రతుల భాండాగారం పక్షాన దివాకర్ల వేంకటావధాని గారితో కలిసి తాము పరిష్కరించి ప్రకటించిన తెనాలి రామభద్రకవి “ఇందుమతీ పరిణయము” పీఠికలోను; చదలవాడ పిచ్చయ్యగారి సంపాదకత్వంలో వెలువడిన “నవభారతి” పత్రికలోని తమ ఆత్మకథ “నేను” లోనూ; వారు ఇతరుల గ్రంథాలకు వ్రాసిన పెక్కు పీఠికలలోనూ తెలుగులో ఇటువంటి పద్యాలను విషమవృత్తాలుగా ఎలా ప్రస్తరించాలో వివరంగా వ్రాశారు. మత్తేభాన్ని గుఱించి మఱీ విపులంగా వ్రాశారు.

    కాని, నేను ఏ పరధ్యానంలో పద్యాన్ని అలా చేశానో కాని, దోషమే దొర్లింది. చేసిన తప్పును పై విధంగా ప్రస్తరించి, సమర్థించుకోవాలనుకోవటం “వాదిబలం” అవుతుంది కాని, “వాదబలం” కాదు.

    మీరు చేసిన సవరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సద్యఃస్ఫూర్తికి అభివందనలు.
    పద్యాన్ని మీ పరిష్కరణతో ఈ విధంగా పఠింప ప్రార్థన.

    నననారాచము నూని, నారిఁ గొని - సంధానించి కోటిన్, “సనా
    తను నీ చేఁతను చూతుఁ గాత” మని చూతాజిహ్మగం బంది, తా
    నును యోగేశ్వరు మ్రోల చేరి నిలిచెన్ పుండ్రేక్షుకోదండుఁ డీ
    సున “నేనే పెనుజోదు నౌదు” నని భస్మోత్క్రాంతకర్మాంతు డై.

    ఈ విధంగా పద్యవిద్యార్థులకు ఛందస్సులలో ఔచిత్యవిచారాన్ని నేర్పుతున్న మీ సౌజన్యానికి ఋణపడి ఉంటాను.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి

  14. ననరు బోడి నీవేనటే నన్ను వలచి
    వచ్చితివి భామి నీ నీదు వలపు సింహ
    బలుని ముంచెత్తె నునుసిగ్గు వలదు చాలు
    కలికి నేనేగదా రమ్ము కౌగిలిమ్ము.

    రిప్లయితొలగించండి
  15. పెద్దలు క్షమించాలి. ఈ రోజు మనఃస్తిమితమే లేదు!

    నననారాచము నూని, నారిఁ గొని - సంధానించి కోటిన్, “సనా
    తను నీ నీఁగును చూతమా” యనుచు చూతాజిహ్మగం బంది, తా
    నును యోగేశ్వరు మ్రోల చేరి నిలిచెన్ పుండ్రేక్షుకోదండుఁ డీ
    సున “నేనే పెనుజోదు నౌదు” నని భస్మోత్క్రాంతకర్మాంతు డై.

    అని ఉండాలి.

    రిప్లయితొలగించండి
  16. కౌరవసేనలఁజూచి అర్జునునితోభయపడి తడబడి ఉత్తరుడన్నట్లు:

    న..న...నరవరాయిటు నిలువ నాకుఁదరమె?
    ను..ను...నుడువగ మాటేదియు నోట రాదె?
    కాలు నిలువదు నీ..నీవె గాచు మనగఁ
    న..న...న..నమ్ము నేనే గలననుచుఁబలికె!

    రిప్లయితొలగించండి



  17. దుఃఖించుచున్న ద్రౌపది నూరడించుచు,

    మానినీ,నీ కురుల నీడ్చె హీనుడైన
    వాని నేనే వధించెద,బూని యనిని,
    కాననమున కష్టమ్ములు గడిచెనంచు,
    నునుపు చెక్కిళ్ళ దుడిచె నా యనిలసుతుడు.

    రిప్లయితొలగించండి
  18. నునుపు సొగసుల ననబోణి యనుచు నిన్ను
    వెంట బడినట్టి కీచకు కంట బడక
    కీలు కీలును విరిచెద గనుము నేనే
    నిలచి యుండుము యుక్తిగ నీకు నీవె !

    రిప్లయితొలగించండి
  19. కీచకుడు:
    వినననుకొనిన నుడువును వి
    నినంతనే,ఘన నితంబినీ! నీనోటన్
    నునుమీసపువయసయ్యెను,
    చనిట్లె, వేచెదను నాట్యశాలను నేనే

    రిప్లయితొలగించండి
  20. శ్రీగురుభ్యోనమః
    చివరి పాదమునకు చిన్న సవరణ:

    న..న..న...నమ్ము నే..నే గల ననుచు నవ్వె!

    రిప్లయితొలగించండి
  21. సహదేవుడు గారూ ! నత్తి ఆలోచన భలే వుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. కవిమిత్రులు గోలి వారికి ధన్యవాదములు. తమరి పద్యాలు రస చమత్కార శోభితంగా అలరిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  23. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య...

    పండిత నేమాని వారికి హృదయ పూర్వక ధన్యవాదములు.
    ‘ప్రమాదో ధీమతామపి’ యని యార్యోక్తి యుండ, నేనెంతటివాఁడను? దయతో తాము తెలిపిన దోషముల నీక్రింది విధముగ సవరించుకొనుచున్నాను.
    కంది శంకరయ్య గారు సూచించిన సవరణలలో మొదటిది ‘సంధికిని దూరమె? నిక్కము వల్కుము! వారునున్ను’ అనుదానిని ‘సంధికిని నిక్కయె? పల్కఁగ వారునున్ను’ అని సవరించుచున్నాను. రెండవది వారు సూచించినదే...

    రిప్లయితొలగించండి