24, ఆగస్టు 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 802 (బుద్ధుఁ డాతఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
బుద్ధుఁ డాతఁడు హింసానిబద్ధుఁ డెపుడు.

17 కామెంట్‌లు:

  1. ముని గణమ్ముల హింసించె పూని యజ్ణ
    యాగతతుల నిషేధించె నతివల కును
    మాన హానిని కల్గించె దానవప్ర-
    బుద్ధుఁ డాతఁడు హింసానిబద్ధుఁ డెపుడు

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
    గురువుగారి సవరణలకు ధన్యవాదములు .
    కలియుగపు బుద్ధునిపై
    ------

    న్యాయ దేవత వడి లోన కాయ ముంచి
    వీధి కుక్క బలుకులకు విధులు మరచె
    రాముడాతని పేరు రూపమ్ము జూడ
    బుద్ధు డాతడు, హింసా నిబద్ధు డెపుడు

    రిప్లయితొలగించండి

  3. బోధి క్రిందన గనిపించు పూ రు షుండు
    బుద్దు దాత డు, హింసా నిబద్ధు డెపుడు
    కాదు కాదండి బుద్ధుడు కరుణ మూర్తి
    శరణు గోరుదు నాతని సవినయముగ

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ,
    బుద్ధుణ్ణి ప్రబుద్ధునిగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘యజ్ఞ’ అనేది ‘యజ్ణ’ అని టైపాటు..
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘దేవత వడి’ అన్నారు. ‘దేవత యొడి’ అని ఉండాలి కదా!
    *
    సుబ్బారావు గారూ,
    అహింసను బోధించిన బుద్దుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారూ అది టైపాటేనండీ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. ఉన్నతాసనాధీశుడైయుండి కూడ
    మనుష మాంసమ్ము మరిగిన దనుజుడగుచు
    ఇడియమీను, యుగాండాను జడిపెడు ప్ర
    బుద్ధుఁడాతఁడుహింసానిబద్ధుఁడెపుడు!

    రిప్లయితొలగించండి
  7. కొమ్ము నొక్కటి నిడితివి కొడుక 'డా' కు
    "బుద్ధు డాత డహింసా నిబద్ధు డెపుడు"
    యిట్లు జెప్పగ వ్రాసితి వీవు జూడ
    "బుద్ధు డాతడుహింసా నిబద్ధు డెపుడు"

    రిప్లయితొలగించండి



  8. ధర్మచక్రప్రవర్త,గౌతమకులుండు
    బుద్ధుడాతడు;హింసానిబద్ధు డెపుడు
    అతని మెచ్చడహింస సాధ్యమ్మె మహిని
    యనుచు సుగతుని దివ్య వాణిని వినండు.

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీ నరసింహ గారి పూరణ....

    వేలకొలది మానవులను వేటువేయ
    కూల్చె వాయువిహంగపు కుట్రతోడ
    వాడు బిన్‌లాడెను మనిషి కాడు వక్ర
    బుద్ధుడాతడు హింసానిబద్ధు డపుడు.

    రిప్లయితొలగించండి
  10. సహదేవుడు గారూ,
    ఈదీ అమీన్ ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మనుష’ శబ్దప్రయోగం దోషం. ‘మనుజ మాంసము’ అంటే సరి!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఏం నవ్వించారండీ బాబూ! చమత్కారం అదిరింది. చాలా మంచి పూరణ. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    విరుపుతో సమస్యను చక్కగా సాధించారు. అభినందనలు.
    పద్యంలో వాక్యం మధ్యలో అచ్చు రాకూడద. ‘నమ్మి మెచ్చడహింస సాధ్యమ్మె’ అని నా సవరణ...
    *
    లక్ష్మీ నరసింహం గారూ,
    బిన్‌లాడెన్ విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారికి నమస్సులు,తమరి సూచన,సవరణలకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్చాస్త్రి గారూ మీ పూరణ అద్భుతంగా ఉంది.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    గౌతమబుద్ధుడు :

    01)
    _______________________________

    పెద్ద యాతడు !యోగ వి - శుద్దు డతడు
    బద్ధుడాతడ హింసకు ! - సిద్ధుడతడు !
    బుద్ధుఁ డాతఁడు ! హింసాని - బద్ధుఁ డెపుడు
    గాడు ! కాడేరడెన్నడు - గనుడు నిజము !
    _______________________________

    రిప్లయితొలగించండి
  14. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘కానేరడెన్నడు’ అనేది ‘కాడేరడెన్నడు’ అని టైపాటు దొర్లింది...

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా ! ధన్యోస్మి.
    మిస్సన్న గారూ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి